Sunday, May 28, 2017

కులభూషన్ విషయంలో భంగపడ్డ పాక్

కులభూషణ్ జాదవ్ వ్యవహారంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మన దేశానికి నైతిక విజయం మాత్రమే కాదు.. పాకిస్తాన్ కు చెంప పెట్టు.. ఇంకా చెప్పాలంటే ఒక హెచ్చరిక..

కులభూషణ్ నావికాదళంలో పదవీ విరమణ చేసి వ్యాపారం చేసుకుంటున్నాడని భారత్ చెబుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అతడు గూఢచారి అంటూ ఏకంగా మరణ శిక్ష విధించింది. అతన్ని కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకే కాదు, కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇవ్వలేదు.. పాక్ పూర్తిగా ఏకపక్షంగా, అనుమానాస్పదంగా వ్యవహరించింది కాబట్టే ఐసీజేలో మన వాదన నెగ్గింది.. ఇప్పడు అత్యవసరంగా చేయాల్సిన పని కులభూషణ్ ను కాపాడుకోవాలి. ఇంతకీ అతనికి మరణ శిక్ష ఎప్పుడు? అనే విషయంలో స్పష్టత లేదు.. ఈలోగా పాకీలు ఏదైనా దురాగతానికి పాల్పడినా దిక్కులేదు.. నిండా మునిగినోడికి చలి ఉండదంటారు. ఉగ్రవాద దేశంగా ముద్ర వేయించుకొని అన్నింటికీ బరి తెగిస్తోంది పాక్.. వారికి ఐసీజే ఒక లెక్కకాదు.. దాన్ని తోసిరాజని హడావుడిగా శిక్ష అమలు చేసి చేతులు దులుపుకుంటే మనం చేయగలిగేది ఏమీ ఉండదు..
పాకిస్తాన్ విషయంలో మనం మొదటి నుండి అవలంభిస్తున్న మెతక వైఖరే అనర్థాలకు దారి తీస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో సగ భాగాన్ని ఆక్రమించుకొని, కొంత భాగం చైనాకు దారా దత్తం చేసినా పాక్ ను ఏమీ చేయలేకపోతున్నాం.. ఐక్యరాజ్య సమితిలో నెహ్రూ మహానుభావుడు వేసిన కేసు ఇంకా అలాగే ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకూ జరిగిన యుద్దాల్లో మనమే గెలిచాం.. కానీ మన భూభాగాలను మాత్రం తిరిగి తెచ్చుకోలేకపోయాం.. మన బలహీనతలు గ్రహించింది కాబట్టే పాక్ ధీమాగా ఉంది..
కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి ప్రక్రియ, చర్చలూ అంటూ సమయం చాలా వృధా చేస్తున్నాం.. పాకిస్తాన్ ను తన భాషలోనే ధీటుగా బదులు ఇచ్చి మన భూభాగలను మనం లాక్కున్నప్పుడే నిజమైన విజయం.. జైహింద్..

(19.05.2017)

No comments:

Post a Comment