Monday, April 30, 2018

Monday, April 2, 2018

పంచ్.. పంచ్

01.04.2018
ఎవరక్కడ.. ఆ మానసిక విశ్లేషకున్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించండి

Saturday, March 31, 2018

ఇదేం పొగడ్త రాజు గారూ?



ఇంతకీ పొగిడారా?.. తిట్టారా?..
అశోక్ గజపతిరాజు గారికి ఎలాగూ తెలుగు రాదు కాబట్టి ఇలా తిట్టేసి మానసిక ఆనందడం పొందుతున్నారా? అసలు తెలుగు పేరుతో ఉన్న పార్టీలో ఈ తెగులు ఏమిటీ? బాబు గారు మీరు అధికార భాషగా తెలుగును ఎలాగూ అమలు చేయలేరు.. కనీసం మీ కార్యకర్తలకు అయినా తెలుగు నేర్పించండి..
29.03.2018

ఇదే రామ తత్వం



ఎవరు ఈ రాముడు?.. ఎందుకు ఆయనపై ఇంత భక్తి?.. యావత్ భారత దేశమంతా ఆయన్ని ఎందుకు పూజిస్తోంది?.. విదేశాల్లో సైతం రామాయణ గాథను ఎందుకు ఇష్టపడుతున్నారు?.. అసలు రామాయణంలో ఏముంది?..
మన తెలుగు నాట భక్తి అంటే ముందు రాముడే గుర్తు వస్తాడు.. శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి, పంచవటి తెలుగు నాట ఉండటం మనం చేసుకున్న పుణ్యం.. దాదాపుగా ఊరూరా రామాలయం సర్వసాధారణం.. ప్రతి ఊరిలో రామయ్య, రామశాస్త్రి, రామారావు, రాంరెడ్డిలు కనిపిస్తారు..
ఇక శ్రీరామ నవమి వచ్చిందంటే పండగే.. చలవ పందిళ్లు వేసి రాముని జయంతి, కల్యాణం, పట్టాభిషేకం కన్నుల పండువగా నిర్వహిస్తాం.. రామరసాన్ని తాగుతాం.. ఈ రాముడు, రామభక్తి తెలుగు నేలకే పరిమితం కాదు.. అయోధ్యలో జన్మించిన రాముడు అరణ్యవాసంలో భాగంగా సీత, లక్ష్మణులతో కలసి దేశమంతా తిరిగాడు.. చివరగా లంకకు వెళ్లి రావణున్ని వధించి, అయోధ్యకు చేరుకొని పట్టాభిషక్తుడయ్యాడు. ఇలా యావత్ భారతదేశం రాముని పాద స్పర్శతో తరించింది. 
రామాయణ గాధ దేశ సరిహద్దులను కూడా దాటి ప్రపంచ దేశాలను చేరింది.. ఇండోనేషియా, థాయ్ లాండ్, కాంబోడియా లాంటి తూర్పు ఆసియా దేశాల్ని సైతం రామాయణం ప్రభావితం చేసింది. చరిత్రలో తొలి ప్రపంచ ఆధ్యాత్మిక కథ శ్రీమద్రామాయణమే అని చెప్పక తప్పదు..

రాముని కథ ఎన్నిసార్లు చదివినా, విన్నా తనివి తీరదు.. అందుకే వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి తోడు ఎందరో కవులు, పండితులు ఈ గాథను రాశారు.. మళ్లీ మళ్లీ రాస్తున్నారు.. అదే రామాయాణానికి ఉన్న విశిష్టత.. 
శ్రీరామచంద్రుడు సకల సద్గుణాలు, పెద్దలపట్ల వినయ విధేయతలు కలవాడు.. ప్రజల పట్ల ఆత్మీయత, సేవకులపై ఔదార్యం చూపించాడు. శత్రువులను కూడా దయాగుణం చూపించాడు.. మాతృ-పితృ భక్తితో ఆదర్శ తనయునిగా, ఏకపత్నీవ్రతంతో ఆదర్శ భర్తగా, తోబుట్టువుపై మమకారంలో ఆదర్శ సోదరునిగా, గురువు ఆనతో రాక్షస సంహారం చేసిన ధర్మ రక్షకునిగా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని పాలించిన ఆదర్శ ధర్మపాలకునిగా, నమ్మిన మిత్రులకు రక్షకునిగా.. ఇలా ఎన్నో వైవిధ్య రూపాలల్లో రాముడు కనిపిస్తాడు.. భక్తుల పట్ల శరణాగత వాత్సల్యం, కృతజ్ఞత-క్షమా హృదయం, పరాక్రమం, ప్రజారంజక పాలక.. ఇలా ఎన్నోలక్షణాలు మనకు ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి.. 
అలాగే రామాయణంలోని పాత్రన్నీ విశిష్టతగలవే.. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రజ్ఞుడు, ఆంజనేయుడు. కౌసల్య, కైకేయి, విశ్వామిత్రుడు, శబరి, అహల్య, అగస్త్యుడు, గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్ట ఉంది.. 
రాముడైనా, రామాయణ గాథ అయినా ఒక తరానికి పరిమితం కాలేదు. ఇది పురాణ కథగా మాత్రమే భావించలేం.. మన తాత ముత్తాతలు, తండ్రులు అందించ రామాయణ సందేశాన్ని మన పిల్లలకు అందించాలి.. వారు భావి తరాలకు చాటి చెప్పేలా ప్రోత్సహించాలి.. మన కుటుంబ విలువలు, ప్రేమ, అన్యోన్యత, అనురాగం రామాయణంతో ముడిపడి ఉన్నాయి.. 
గాంధీజీ స్వాతంత్ర్యం తర్వాత రామరాజ్యం కావాలని కోరుకున్నారు.. రామరాజ్యం అంటే ఆదర్శ పాలన.. దురదృష్టవశాత్తు ఈ రోజున రాముడు అంటే ఒక మతానికి పరిమితమైన వ్యక్తిగా చూస్తున్నారు.. రాముడు పుట్టిన జన్మభూమి వివాదాస్పదమైపోయింది. రాముడిన మన నుంచి ఎవరూ దూరం చేయలేరు.. సూర్య చంద్రులు ఉన్నంత కాలం రాముడు మనతో ఉంటాడు.. శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ ఆయన కురుణా కటాక్షాలు శుభం కలగాలి అని కోరుకుంటూ.. జై శ్రీరామ్..
26.03.2018

రాములవారికి గులాబీ అలంకరణ?




భద్రాచల క్షేత్రంలో ఏమిటీ ఘోరం.. కాషాయం నచ్చకుంటే శ్వేత వస్త్రాలతో అలంకరించండి.. ఈ గులాబీ రంగు ఎందుకు? ఇది రాముల వారి కల్యాణమా?.. టీఆర్ఎస్ వారి ఇంట వివాహ వేడుకనా?.. రామచంద్ర ప్రభూ.. వారికి సద్బుద్ధి ప్రసాదించు.. ఇంతటి తప్పిదానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి..
25.03.2018

రోజుకు ఎన్ని గంటలు బాబు?





రోజుకు 24 గంటలే కదా ఉండేది.. బహుషా వారానికి 36 గంటలు పని చేస్తున్నారు అనుకుంటా.. 🤔

24.03.2018
🤔
🤔


2

గడ్డి తిన్న పాపానికి..

పశుగ్రాస కుంభకోణం కేసులన్నింటిలో లాలూ ప్రసాద్ యాదవ్ 20 ఇళ్లకు పైగానే జైళ్లో ఉండబోతున్నారు.. 
లాలూకు జైళ్లో మూడు పూటలా గడ్డి పెట్టాల్సిందే.. అంతే కాదు ఈ గడ్డి కూడా ఆయన తోనే పెంచిపిస్తే ఇంకా బాగుంటుంది..
మునుముందు ఇలాంటి కుంభకోణాలు చేయకుండా రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి..

24.03.2018

సెక్యులర్ సైకోన్మాదం



తమిళనాడులో పట్టపగలు కొందరు సైకోలు శ్రీరామచంద్రుని చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ ఊరేగిస్తున్న ఈ దృశ్యాలు ఇవి.. మెజారిటీ హిందువులకు స్వాభిమానం, చీము నెత్తురు లేవు కాబట్టి ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో కూడా సర్వసాధారణం కావచ్చు.. ఇదే ఘటన ఇతర మతస్తుల విషయంలో జరిగి ఉంటే ఏమయ్యేది?.. 
సెక్యులర్ పెక్యులర్స్ అంతా గోల చేసేవారు కాదా?.. ద్రవిడవాదం, పెరియార్ పేరు చెప్పుకునే ఈ విచ్చిన్నకర శక్తుల వెనుక ఉన్నది ఎవరు.. పక్కనే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
శ్రీలంకలో ఈలం పేరిట ప్రత్యేక దేశం కోసం పోరాడిన ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చిన వారు ఈ రోజు మరోసారి ద్రవిడస్థాన్ పేరుతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నారు. తమిళనాడును విడదీయాలి అనేది వారి దీర్ఘకాలిక కుట్ర. దీనికి ద్రావిడవాదం, పెరియారిజం అనేవి ముసుగులు.. రామున్ని అవమానిస్తున్న సైకో బ్యాచ్ అంతా ఈ విభజన మనస్థత్వం కలవారే.. కేవలం తమిళనాడు ఉంటే సరిపోదని దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిపి ద్రవిడస్థాన్ ఏర్పడాలంటున్నారు ఈ విద్రోహులు.. భారత దేశంలో భాగంగా ఉన్న తమిళనాడులో హిందువుల విశ్వాసాలకు ఇంతటి అవమానం జరుగుతుంటే, ఈ సైకోలు కోరుకునే ద్రవిడస్థాన్ వస్తే ఏమౌతుందో ఆలోచించారా?.. 
తెలిసో తెలియకో ద్రవిడస్థాన్ కావాలి, దక్షిణ భారత దేశం విడిపోవాలి అనే వాదించే మన తెలివి తక్కువ తెలుగు వితండ వాదులకు కూడా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.. రామున్ని అవమానించిన వారు రేపు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు.. అప్పుడు ఈ సెక్కులర్ పాఠాలు వళ్లించే పెక్యులర్స్ ఎవరూ నిన్ను రక్షించేందుకు రారు అన్నది గుర్తుంచుకో..
22.03.2018

సెక్యులర్ మానవత్వం నిద్రపోయిందా?



సిరియా అంతర్యుద్ధంలో వాళ్లు వాళ్లు కొట్టుకు చస్తుంటే మన దేశ 'సెక్యులర్స్' గగ్గోలు పెట్టి కన్నీరు కార్చి మానవత్వం గురుంచి ఉపన్యాసాలు ఇచ్చారు..
మరి పొట్ట కూటి కోసం ఇరాక్ వెళ్లిన భారతీయ కూలీలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఏ ఒక్కరూ స్పందించరేం.. కన్నీటి చుక్కలు మిగలలేదా?.. నోళ్లు పెగలలేదా?.. మన తోటి భారతీయుల ప్రాణాలకు విలువలేదా?

21.03.2018

ఉగాది శుభాకాంక్షలు..




మామిడి పూవుకు మాట వచ్చింది..
కోయిల గొంతుకు కూత వచ్చింది..
వేప కొమ్మకు పూత వచ్చింది..
పసిడి బెల్లం తోడు తెచ్చింది..
గుమ్మానికి పచ్చని తోరణం తెచ్చింది..
ఉగాది పండుగ మన ముందుకొచ్చింది..
బంధు మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు అందరికీ..
18.03.2018

ఫడ్నవీస్ చాతుర్యం



ముంబై మహా నగరంలో ఇటీవల రెండు భారీ ర్యాలీలు జరిగాయి.. కొద్ది వారాల క్రితం మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు.. తాజాగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం భారీ పాదయాత్ర జరిపారు.. ఈ రెండు ప్రదర్శనలు ముంబై నగరంపై ఉప్పెనలా వచ్చి పడ్డాయి.. లక్షలాది మంది వీధుల్లో కదం తొక్కారు.. పూర్తి క్రమశిక్షణతో జరిగిన ఈ రెండు ర్యాలీలో ఎక్కడా అవాంఛనీయ ఘటలు జరగలేదు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ర్యాలీలకు అనుమతి ఇవ్వడమే కాదు, అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా పోలీసు భద్రత కల్పించారు.. ర్యాలీలు నిర్వహించిన వారితో చర్చించి వారి సమస్యలు ఎంత మేరకు పరిష్కరించడం సాధ్యమో ఆ మేరకు హామీ ఇచ్చారు.. అప్పుడు మరాఠాలు, ఇప్పుడు రైతులు ఫడ్నవీస్ హామీతో సంతృప్తి చెంది నిరసనలు విరమించారు
ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ముంబై వచ్చిన రైతులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళడానికి ఫడ్నవీస్ రవాణా సౌకర్యం కూడా కల్పించారు..
ఇప్పుడు మన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకు వద్దాం.. ఉద్యమాలు అనగానే మన ఇద్దరు సీఎంలకు వణుకు. ప్రదర్శన, సభలకు అనుమతి నిరాకరణ.. నాయకుల ముందస్తు నిర్బంధం, అరెస్టులు శరా మామూలే.. అంతే కాదు ఇక్కడి ఉద్యమకారుల్లో కూడా అంతటి క్రమశిక్షణ కనిపించదు..
ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజా ఉద్యమాలు ఎదుర్కోక తప్పదు.. వారి డిమాండ్లు, కోర్కెల సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అధికారంలో ఉన్నవారు తమ పరిధిలో ప్రయత్నం చేస్తే కొంతైనా పరిష్కరించడం సాధ్యమే.. ఈ విషయంలో వయసులో చిన్నవాడైనప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను చూసి నేర్చుకోక తప్పదని చెప్పగలను..
13.08.2018

జిన్ పింగ్ నియంత రూపం



నేతి బీరకాయలో నెయ్యి ఎంతో చైనా కమ్యూనిస్టు పార్టీలో ప్రజాస్వామ్యం అంతే.. దేశాధ్యక్షుడు ఎవరు కావాలి అనేది పొలిట్ బ్యూరో అనే ఓ ముఠా నిర్ణయిస్తుంది. ఈ ముఠాను బాగా చూసుకునేవాడు ఉత్తుత్తి ఓటింగ్ ద్వారా దేశాధినేత అవుతాడు.. ఈ ముఠాపై మంచి పట్టు సంపాదించిన షీ జిన్ పింగ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా దేశాధినేతగా ఉండేందుకు ఏకంగా రాజ్యాంగాన్నే మార్చేశాడు. 

చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. ఆచరణ అంతా పెట్టుబడిదారి విధానమే.. ఇప్పుడు ఈ పెట్టుబడిదారి కమ్యూనిస్టు దేశానికి జీవితాంత (శాశ్వత) అధ్యక్షుడు జిన్ పింగ్.. పార్టీ, సైన్యంపై ఇప్పటికే పట్టు సాధించి, అవినీతిపై యుద్దం పేరిట ఎంతో మంది ప్రత్యర్థులను జైలుకు పంపి భయోత్పాతం సృష్టంచిన జిన్ పింగ్ నియంతృత్వానికి తెర తీశాడు. మళ్లీ మావో కాలంనాటి భయోత్పాత దినాలు దాపురించాయని చైనీయులు ఆందోళనతో ఉన్నారు. వీరికి ఉన్న ఏకైన గొంతుక సోషల్ మీడియాను కూడా చైనా కమ్యూనిస్టు పార్టీయే నియంత్రిస్తోంది..
జిన్ పింగ్ చైనాకు శాశ్వత అధినేతగా ఉండటం భారత్ ప్రయోజనాలకు ఇబ్బందికమే.. ఇప్పటికే చైనా అడుగడుగునా మనకు వ్యతిరేకంగా పని చేస్తోంది. పాకిస్తాన్ లో ఎకనామిక్ కారిడార్ నిర్మించడంతో పాటు ఆ దేశ ఉగ్రవాద చర్యలను గుడ్డి సమర్ధిస్తోంది చైనా.. నేపాల్, శ్రీలంక, మాల్దీవులను ఆర్థిక సాయం పేరిట స్థావరాలు ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని దిగ్భందించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల డోక్లామ్ లో భారత సైన్యం నిలువరించడంతో భంగపడ్డ చైనా, అదను కోసం ఎదురు చూస్తోంది. ఇప్పడు నియంతగా మారుతున్న జిన్ పింగ్ పట్ల మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
12.03.2018

ఈ విషయంలో బాధ లేదా?

అడ్వాణీ గారిని మోడీ గారు అవమానించారని కాంగ్రెస్ మిత్రులు బాధపడిపోతున్నారు.. మరి ఈ ఫోటోలకు కూడా బాధపడే ఉండాలి.. 11.03.2018

ఇదొకరకం జిజియా పన్ను

పూర్వం ఔరంగజేబు జిజియా పన్ను వేశారని చరిత్రలో చదివాను.. ఇప్పుడు సెక్యులర్ ఇండియాలో గోరింటాకు ఫైన్ వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. సనాతన ధర్మం, సంప్రదాయాలు పాటించడం నేరమా?.. ఇంతకీ మనం భారత దేశాలోనే ఉన్నామా?.. ఘటన పాతది అయినా దారుణమైనదే..

సౌజన్యం: Santosh Kumar Karri గారు
10.03.2018

లెనిన్ ఎవరికి ఆరాదకుడు?

వ్యక్తిపూజ, విగ్రహ సంస్కృతికి నేను వ్యతిరేకం.. విగ్రహాల ఏర్పాటు, పడగొట్టడాన్ని కూడా వ్యక్తిగతంగా సమర్ధించలేను.. కానీ త్రిపురలో లెనిన్ విగ్రహం పడగొట్టారని గగ్గోలు పెడుతున్నవారిని చూసి స్పందించాల్సి వస్తోంది..
రష్యన్ విప్లవం తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వానికి సారధ్యం వహించాడు లెనిన్.. పొరుగు దేశాలను కబలించి సోవియట్ యూనియన్ కు పునాది వేసిన సామ్రాజ్యవాది. కమ్యూనిజం పతనం తర్వాత రష్యాతో సహా, మాజీ సోవియట్ దేశాల్లో లెనిన్ విగ్రహాలు పడగొట్టేశారు. సొంత దేశ ప్రజలే తిరస్కరించిన లెనిన్ భారత కమ్యూనిస్టులకు ఆరాధకుడు. భారత దేశంలో ఎంతో మంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. వారి విగ్రహాలు అవసరం లేదు. కానీ విదేశీయుడి విగ్రహం కూల్చేశారని బాధపడిపోతున్నారు.
లెనిన్ విగ్రహం పడగొట్టారని యాగీ చేస్తున్న కమ్యూనిస్టులు చేస్తున్న పనేమిటి? బెంగాల్ లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని అవమానించారు. ఇది కరెక్టా?.. త్రిపురలో శ్యామల్ కాంతి సేన్ గుప్తా, సుధామయ్ దత్, దేవేంద్ర డె, శుభాంకర్ చక్రవర్తి అనే నలుగు దేశ భక్తులను వామపక్ష ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నప్పుడు ఎవరూ స్పందించలేదు. కేరళలో దేశభక్తుల మారణకాండను పట్టించుకోలేదు.. కడుపు మండి కమ్యూనిస్టు ప్రభుత్వాన్నివదిలించుకున్న త్రిపుర వాసులు విదేశీ భావదాస్య చిహ్నాన్ని వదిలించుకుంటే లొల్లి లొల్లి.. వాహ్వా. క్యా బాత్ హై జీ..
07.03.2018

ఈ ప్రశ్నలకు జవాబు ఏది కేసీఆర్?

ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌కు ఒక పౌరుడి స్పంద‌న‌..
1. అమెరికా లో రాష్ట్రాల పైన కేంద్రం పెత్తనం ఉండదు.. మనది పేరుకే ఫెడరల్ వ్యవస్ధ
* మనది ఫెడరల్ వ్యవస్థ అని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు.. రాజ్యంగ నిపుణులు, రాజనీతి శాస్త్ర పండితులు మనది ఫెడరల్ స్వభావం కలిగిన బలమైన కేంద్రం కలిగిన రాజ్యాంగం అని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన వివిధ దేశాల వ్య‌వ‌స్థ‌లను సుదీర్ఘంగా అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత మ‌న దేశానికి అనుగుణంగా మన రాజ్యాంగ రచన చేశారు.
2. అన్ని అధికారాలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి.. కేంద్రానికి పరిమిత అధికారాలు ఉండాలి. మిగతా వన్నీ రాష్ట్రాలకు బదలాయిన్చాలి...
* అధికారాల కోసం కేంద్రంను అడుగుతున్నారు స‌రే.. మ‌రి రాష్ట్రంలో స్థానిక‌ సమస్థలకు ఎందుకు ఈ అధికారాలు బదలాయించ‌లేదు? ఆ సంస్థల పైన రాష్ట్ర పెత్తనం ఎందుకు?.. మీకు ఫోన్ చేసి అభినందించిన‌ మమతా బెనర్జీ (నిజ‌మేనా?) చిన్న రాష్ట్రాలను ఎందుకు వ్యతిరేకించింది. బెంగాల్‌లో స్థానిక సంస్థ‌ల‌కు ఆమె బదలాయించిన అధికారాలు ఏమిటి?

3. చైనా అభివృద్ధి పని విధం గురించి పొగుడుతున్నారు..
* భార‌త్‌లో మాట్లాడినట్టు క‌మ్యూనిస్టు నియంతృత్వ‌ చైనాలో మాట్లాడే స్వేచ్చ ఉండ‌దు. దేశ అధ్యక్షుడు జీవిత కాలం పదవిలో ఉండే విధంగా అక్కడ రాజ్యంగాన్ని మారుస్తున్నారు. మీరు కోరుకుంటున్నది ఇదేనా? అమెరికా, జపాన్ లో, బ్రిటీష్లో రెండు పార్టీల వ్యవస్థ. మీరు కూడా దీన్ని కోరుకుంటున్నారా ?
4. ప్ర‌ధాని మోదీని విమ‌ర్శిస్తే నన్ను జైలుకు పంపుతారా?
* మ‌రి తెలంగాణ‌లో మీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే కేసులు పెట్ట‌డం లేదా? కోదండరామ్ మీటింగు పెట్టుకోవటానికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు?.. మీరు మాత్రం అందరినీ నోటికొచ్చినట్లు తూలనాడవచ్చు. కానీ అవతలి వారి విమర్శలను మాత్రం తట్టుకోలేరు..
5. తెలంగాణ‌లో బీజేపీ ఉన్న‌దా? ఉనికి లేకుండా చేస్తా..
* త్రిపురలో మానిక్ సర్కార్ కూడా ఎన్నికల ముందు ఇలాగే అన్నారు.. చివరికి ఏమైంది?.. ఫలితం చూశారు కదా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో దిమ్మ తిరిగి మీరు ఇలా మాట్లాడ‌టం నిజం కాదా?
వైద్యుడు ఇచ్చే మందు పని చేయటానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఈ స‌మ‌యం కూడా ఇవ్వకుండా వైద్యుడిని మారిస్తే రోగే నష్ట పోతాడు త‌ప్ప వైద్యునికి ఏమీ కాదు. డీమోనిటైజేషన్, GST వంటివి మంచివి కాబట్టి సమర్ధించాను అని చెప్పారు. మ‌రి ఫలితం కోసం ఆగ‌కుండా ఇలా యుద్దాల‌కు దిగ‌డం స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మా?.
06.03.2018

త్రిపురలో జాతీయవాద విజయం



అటు లెఫ్ట్.. ఇటు రైట్.. దేశంలో తొలిసారిగా భిన్న సైద్ధాంతిక పార్టీలు నేరుగా తల పడిన ఎన్నికలు ఇవే.. ఇప్పటి వరకు వామపక్షాలు సరైన సిద్ధాంతం లేని వారసత్వ రాజకీయ పార్టీ కాంగ్రెస్ తో మాత్రమే పోటీ పడుతూ వచ్చాయి..
తొలిసారిగా విదేశీ సిద్ధాంత భావజాలం ఉన్న సీపీఎం, స్వదేశీ జాతీయవాద పార్టీ బీజేపీ హోరాహోరీ పోరాడాయి.. ఈశాన్య భారత దేశంలోని చిన్న రాష్ట్రం త్రిపుర ఇందుకు వేదిక అయింది..
త్రిపుర అసెంబ్లీకి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడలేదు.. కానీ తాజా ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మార్క్సిస్టుల కంచుకోటను బద్దలు కొట్టింది. కాంగ్రెస్ పై ఎప్పుడో విశ్వాసం పోయిన త్రిపుర ప్రజలు విధిలేని పరిస్థితుల్లో సీపీఎంను భరిస్తూ వచ్చారు.. కానీ అవినీతి, అసమర్థ నిర్వాకంతో ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది..
కమ్యూనిస్టులు నిన్న పశ్చిమ బెంగాల్ కోల్పోయారు.. ఇవాళ త్రిపుర కోల్పోయారు.. రేపు కేరళ కూడా కోల్పోవడం ఖాయం.. మరోవైపు త్రిపుర విజయం బీజీపీకి ఒక హెచ్చరిక కూడా.. ఆ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేశంలో ఏకైక కమ్యూనిస్టు రాష్ట్రం కేరళ కూడా కైవసం కావడం ఖాయం..
04.03.2018

పంచ్.. పంచ్..

31.03.2018
తెలుగుదేశం పార్టీ పెట్టమని ఎన్టీరామారావుకు సలహా ఇచ్చింది నిజం అయినప్పుడు బమ్మెర పోతన రామాయణం రాసింది నిజం కాదా?

24.03.2018
అమిత్ షా రాసిన లేఖలో అన్నీ వక్రీకరణలే:  బాబు
భాష అర్థం కాలేదా? తలకిందులుగా చదివే ప్రయత్నం చేశారా?

23.08.2018
'పరేషాన్ నరుడా' స్క్రిప్ట్ బాగుంది.. మొదలు పెడదాం.. మినిమం గ్యారెంటీ..

21.03.2018
మొదీ ఈ స్థాయికి ఎదగడానికి కారణం టీడీపీ : బాబు.. Best Joke

19.03.2018
ఇతర భాషలను వ్యతిరేకించే కుటుంబ పార్టీ డీఎంకే ఇప్పుడు ద్రవిడస్థాన్ పేరుతో దేశ విభజన కోరుతోంది..

17.03.2018
కుంభ కర్ణుడు నాలుగేళ్ల తర్వాత నిద్ర లేచి ఆకలి కేకలు, పెడబొబ్బలు పెడుతున్నాడు..

16.03.2018
అరారియాలో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి ఎందుకు?

16.03.2018
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు - భర్తృహరి
అన్నట్లు ఇసుక లెక్కలు తేలాయా?

16.03.2018
వైసీపీ అవిశ్వానికి టీడీపీ మద్దతు.. ఇక కపట నాటకాలు కట్టిపెట్టి కలిసిపోతు బెటర్

15.03.2018
కలిసి ఉంటే కలదు సుఖమూ.. కలిసి వచ్చిన విజయమూ..

15.03.2013
అన్యాయం.. మమ్మల్ని మాత్రమే తిడతావా?

12.03.2018
పెద్దల సభకు వెళ్లేందుకు ఉండాల్సిన అర్హతుల ఏమిటి?

10.03.2018
కోటా పెంచాలా?.. ముందు మీ క్యాబినెట్లో అమలు చేయడండి..

09.03.2018
విడాకులు తీసుకున్నా కాపురం సాగుతోంది..

09.03.3018
సకుంటుబ సకుటుంబ పార్టీలతో జరభద్రం

08.03.2018
మంత్రివర్గంలోని సోదరీ మణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

08.03.2018
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భాజపా శ్రేణులకు శుభాకంక్షలు.. అభినందనలు

07.08.2018
అంతా మన మంచికే..

06.03.2018
వినాశకాలే విపరీత బుద్ది

05.03.3018
వామపక్షాల అంతర్ధానం దేశానికి తీరని లోటంటున్నాడు జై రాం రమేష్.. ఆ లోటు పూడ్చేందుకు ఆయనే ఎర్రజెండా పట్టుకుంటే బెటర్  కదా?

05.03.2018
ట్రంప్, పుతిన్ కూడా ఫోన్ చేసి ఉండాలి.. మనం నమ్మలేమేమ్మో అని లీక్ చేయలేదనుకుంటా?

05.03.2018
మమత ఫోన్ చేశారా? కేసీఆర్ ఫోన్ చేశారా?.. ఎవరు డయల్ చేశారు? ఎవరు లిఫ్ట్ చేశారు?

05.03.0218
ఫ్రంటా?.. ెంటా?

01.03.2018
అబద్దాలు చెప్పకు దొరా..

Wednesday, February 28, 2018

ఏది నమ్మాలి?

26.02.2018

మధు హత్యను పట్టించుకోరా?



మన దేశ పార్లమెంట్ మీద దాడి చేసిన దేశ ద్రోహికి ఉరి శిక్ష వేస్తే అతనికి సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు..
కర్ణాటకలో మహిళా జర్నలిస్టును హత్య చేసింది ఎవరో తెలియకున్నా ఒక సంస్థను టార్గెట్ చేస్తూ ఆందోళనలు జరిపారు..
సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు సామాజిక వర్గం రంగు పులిమి గోల చేశారు..
కానీ..
కేరళలో ఒక ఆదివాసీ యువకుడు ఆహారం దొంగిలించాడే సాకుతో సెల్ఫీలు దిగి మరీ దారుణంగా కొట్టి చంపితే ఎవరికీ పట్టదేం.. 
ఏమయ్యాయి మీ ఆందోళలు, నిరసనలు, ప్రదర్శనలు.. 
ఆదివాసి మధు ప్రాణానికి విలువ లేదా?.. కేరళ ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న ఇతర హత్యల విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది ఎందుకు?
25.02.2018

శ్రీదేవికి ఆశ్రునివాళి



కథగా కల్పనలా కనిపించి మాయమైందో వసంతకోకిల..
దివి నుంచి భువికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిందో ఇంద్రజ..
పదహరేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయా?..
ఎప్పటికీ లేవని నిద్రలోకి జరుకున్నావా?..
నీవిక లేవా?.. శ్రీ దే వి
25.02.2018

కాషాయం అంటే వారికి భయం భయం


కాషాయం.. ఈ ప‌దం విన‌గానే కొంద‌రు వ్య‌క్తులు గంగ‌వెర్రులెత్తిపోతున్నారు.. ఇదేమో బీజేపీ, ఆరెస్సెస్‌ల ట్రేడ్ మార్క్ అన్న‌ట్లుగా భ‌య‌ప‌డిపోతూ దూరం దూరం అంటున్నారు. ఈ సంస్థ‌లు పుట్ట‌క ముందే వేలాది సంవ‌త్స‌రాలుగా కాషాయం ఉంది. అది ఒక మ‌త చిహ్నం మాత్ర‌మే అనుకుంటే అంత‌క‌న్నా అజ్ఞానం మ‌రొక‌టి ఉండ‌దు. స‌నాత‌న ధ‌ర్మం, సంస్కృతిక వార‌స‌త్వంతో ముడిప‌డిన కాషాయం రంగు త్యాగానికి ప్ర‌తీక‌.. దేశ సంస్కృతి, చ‌రిత్ర మీద ఏమాత్రం అవ‌గాహ‌న లేనివారు, సంకుచిత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడే వారు, కొన్ని విచ్చిన్న‌ర‌క‌ర శ‌క్తులు ఈ త‌ర‌హా ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 
కొత్త‌గా రాజ‌కీయ పార్టీ పెట్టిన న‌టుడు కాషాయం అంటేనే ఉలిక్కి ప‌డుతున్నాడు. ఏకంగా జాతీయ ప‌తాకంలోని కాషాయం రంగు విస్త‌రించ వ‌ద్దంటున్నాడు. ఈయ‌న‌కు అస‌లు జాతీయ ప‌తాకం, రాజ్యాంగ‌ప‌ట్ల ఏమాత్రం అవ‌గాహ‌న లేదు అన‌డం క‌న్నాకొన్ని శ‌క్తులు ఆయ‌న‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి అన‌డం స‌మంజ‌సం. జాతీయ ప‌తాకంలోని మూడు రంగులు మ‌తాల‌కు ప్ర‌తీక‌గా భావించేవారిని చూసి వారి తెలివి త‌క్కువ‌త‌నానికి జాలి ప‌డ‌టం మిన‌హా మ‌రేం చేయ‌లేం.. 
భార‌త తొలి ఉప రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ స‌ర్వేప‌లి రాధాకృష్ణ‌న్ ఉల్లేఖ‌నం ప్ర‌కారం.. "కాషాయరంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తు. ఆకుపచ్చరంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతరజీవులన్నీ ఏ వృక్షసంపదమీద ఆధారపడి ఉన్నాయో ఆ పచ్చని చెట్లకు గుర్తు. అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. పైగా చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవమున్న ప్రతిచోటా చైతన్యముంటుంది. చైతన్యం లేనిది చావులోనే. భారతదేశం ఇక మీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలి. చక్రం శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం." (మ‌రిన్ని వివ‌రాల‌కు చూడండి:http://india.gov.in/knowindia/national_flag.php)
కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు; తెలుపు శాంతికి, సత్యానికి; ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది.
ఇప్ప‌టికైనా కాషాయం రంగును అవ‌మానించ‌డం మానుకోండి
24.02.18

నాకు అది కావాలి అంతే..


‘ఏమండీ డైమండ్ రింగ్ కొనిస్తారా?’
‘డైమండ్ రింగ్ బదులు మరిన్ని బంగారు ఆభరణాలు చేయించుకోవచ్చు కదా?’
‘అయితే ఓకే.. డబ్బులు ఇవ్వండి..’
ఆయన గారు అప్పుడప్పుడూ డబ్బులు ఇస్తూ పోయారు.. ఈవిడేమో ఇతరత్రా ఖర్చు చేసింది.. చివరకో రోజు ఇచ్చిన సొమ్ముకు లెక్కలు అడగాడు.. ఆమె లెక్క చెప్పడం దేవుడెరుగు ఇంటి బయటకు వచ్చి రచ్చ చేసింది.. ‘నా మొగుడు ఖర్చులకు డబ్బులివ్వడం లేదు’ అని ఇకటే గోల..
ఇంకేం దారిన పోయే దానయ్య, పనీ పాటా లేని పుల్లయ్య, ఖాళీగా తిరిగే కనకయ్య, తిన్నది అరగని తిమ్మయ్య గుమి గూడారు.. ‘ఏమయ్యా ఆమె అడిగిన సొమ్ములు ఇవ్వొచ్చు కదయ్యా’ అంటాడు ఒకాయన.. ‘ఆమె ఏమైనా ఖర్చు చేసుకుంటుంది, నీకెందుకయ్యా’ అంటాడు ఇంకొకాయన.. ‘విడాకులు ఇచ్చేయి’ అని సలహా ఇస్తాడో తింగరోడు..
ఇది చదివినోళ్లు ఆలోచించుకోవచ్చు.. ఎక్కడో తగలినోళ్లు భుజాలు తడుముకోవచ్చు.. మీ ఇష్టం..

23.02.2018

పార్టీ పెట్టగానే పండుగ కాదు కమల్..



'కమల్ హాసన్ పార్టీ పెట్టిండంట కదా?’ అని చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు.. ‘అయితే ఏందంట..’ అని నేను రిప్లయ్ ఇచ్చే సరికి అతడు కొద్ది క్షణాలు నివ్వెరబోయి, ‘అదేంది అట్లంటవ్?’ అని వేరే సబ్జక్ట్ లోకి వెళ్లిపోయాడు.. నన్ను దగ్గరగా చూసిన వారికి నిజంగానే కమల్ విషయంలో నా తాజా వైఖరి ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది.
నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన సినిమాల్లో కమల్ హాసన్ వే ఎక్కువ.. అలా నాకు తెలియకుండానే అందరి దృష్టిలో ఆయనకు ఫ్యాన్ అయిపోయా.. నేను చూసిన మొదటి కమల్ హాసన్ చిత్రం సాగర సంగమం.. ఆ తర్వాత స్వాతిముత్యం, వసంత కోకిల, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, నాయకుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, సతీలీలావతి, ద్రోహి, గుణ, మహానది, హేరామ్, సత్యమే శివమ్, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఆయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు చూశాను. కమల్ సహజ నటన, సృజనాత్మకత, కొత్త ప్రయోగాలు నాకు చాలా నచ్చేవి.
కమల్ హాసన్ తర్వాత నాకు నచ్చిన నటుడు రజినీకాంత్.. వారు తెలుగులో నేరుగా నటించినవి అతి కొద్దివే.. మిగతావన్నీ డబ్బింగ్.. అయినా నేను వారు తమిళురు అని ఏనాడూ భావించలేదు.. గొప్ప భారతీయ నటులుగానే చూశాను.. కానీ వారి మొదటి ఆట చూడాలి అనేంత వెర్రి అభిమానిని మాత్రం కాదు.. నాకు వీలుంటే చూస్తాను.. చూడని చిత్రాలే ఎక్కవ,,
రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు.. ఈ హద్దులు నాకు తెలుసు. అందుకే ఎవరెంత విమర్శించినా కమల్ వ్యక్తిగత జీవితాన్ని నేను అంతగా పట్టించుకోను. కానీ వారు ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చారో, అప్పుడు అన్నీ పట్టించుకోక తప్పడం లేదు.. కమల్ ఇప్పుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని పెట్టారు.. పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు ఉండొచ్చు.. కానీ అభిమానిగా నాలాంటి వారు సమర్ధించాల్సిన అవసరం అయితే కనిపించలేదు.. అందుకు సహేతుక కారణాలు ఉన్నాయి..
కమల్ నాస్తికుడిని అని చెప్పుకుంటారు.. అది ఆయన వ్యక్తిగతం. కానీ మెజారిటీ ప్రజల హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గుడి దగ్గర బిచ్చగాడిని చూసి దేవుని మీద విరక్తి కలిగింది అంటారు.. మరి మిగతా మతాల ప్రార్థనాకేంద్రాల దగ్గర బిచ్చగాళ్ల సంగతేంటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.. కాషాయానికి ఆయన విరుద్దమట.. కమల్ ఆరెస్సెస్, బీజేపీలకు వ్యతిరేకం కావచ్చు, హిందూ మతానికి వీరు మాత్రమే గంపగుత్త కాదు కదా?.. సనాతన ధర్మానికి, త్యాగానికి ప్రతీక అయిన కాషాయంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. ఆధ్మాత్మిక విలువలు ఉన్న రజనీ కాంత్ కాషాయానికి దగ్గర అని నోరు పారేసుకున్నారు. కమల్ పార్టీ పెట్టడానికి ముందుగా పలు అంశాలపై కొద్ది రోజుల వ్యవధిలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.. భిన్న ధృవాలైన పార్టీల నాయకులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వయాన పార్టీ పెడుతున్నప్పుడు ఈ ముందస్తు బేరాలు ఏమిటి?
కమల్ హాసన్ ను నటుడుగా దేశ వ్యాప్తంగా అభిమానించేవారున్నారు. కానీ ఆయన తమిళనాడు హద్దులకే పరిమితం.. పైగా ద్రవిడ, దక్షిణాది అంటూ దబాయింపు.. తమిళపేరుతో ఉన్న ఆయన పార్టీ దక్షిణాది మొత్తానికి ఎలా ప్రతీక అవుతుంది? ఆయన పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేది లేదు. పొత్తులు పెట్టుకునే అవకాశాలు తక్కువే. నా మాతృభాష తెలుగు అయినా నేను ఒక ‘భారతీయుడు’ని అని భావిస్తాను.. కానీ కమల్ మాత్రం తాను ‘తమిళ్’ అని గిరి గీసుకున్నారు.
ఇప్పడు చెప్పండి ఇంకా ఎలా అభిమానించేది.. నా దృష్టిలో ఒకప్పుడు కమల్ హాసన్ అనే గొప్ప నటుడు ఉండేవాడు అంతే..
22.02.2018

మన భాషను కాపాడుకుందాం..



మిత్రులారా.. ఇవాళ మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. అసలు విషయంలోకి వచ్చే ముందు మూడు ప్రశ్నలు వేసుకుందాం..
1. మీ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా?
2. తెలుగు పత్రికలను స్పష్టంగా చదవగలరా?
3. అన్య భాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుతున్నారా?..
ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఔననే సమాధానం లేకపోతే మన ఇంట్లో తెలుగు భాషకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే లెక్క.. 
ప్రపంచంలో తెలుగు మాతృభాషగా ఉన్నవారి సంఖ్య 10 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంఛనా.. ఇందుతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నారు.. కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో 30 నుంచి 40 శాతం దాకా, మహారాష్ట్ర, పాండిచ్చేరిలలో 20 శాతం వరకూ తెలుగు వారు ఉన్నారు..
నిజానికి దేశంలో ఎక్కువ మంది ప్రజల మాతృభాష తెలుగే.. ఇందుకు మనం జబ్బలు చరచుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకు అంటే ప్రపంచంలో అంతరిస్తున్న భాషల జాబితాలో చేరేందుకు శతాబ్దంకన్నా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు..
తెలుగు అధికారిక భాషగా గుర్తింపు ఉన్న రాష్ట్రాల్లోనే మాతృ భాషకు దిక్కు లేదు. రెండు రాష్ట్రాల పాలకులు తెలుగు భాషాభివృద్ధి గురుంచి సుద్దులు బాగేనే చెప్పుతారు. ఉత్సవాలు చేస్తారు, గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు.. కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు.. తమిళనాడు, కర్ణాటకలు విపరీతమైన స్వభాషాభిమానంతో తెలుగు భాషను అణచివేస్తున్నాయని బాధపడతాం.. ఈ విషయంలో మనం ఎక్కువగా స్పందిస్తే గొంగట్లో వెంట్రుకలు ఏరినట్లే ఉంటుంది..
తెలుగు భాషకు ప్రాచీన హోదా కావాలని కేంద్రంతో పోరాడి సాధించుకున్నాం.. కానీ ఏం జరిగింది.. పీఠం ఏర్పాటును గాలికి వదిలేస్తే అది మైసూరులో స్థిరపడిపోయింది..
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని, ఆంగ్లానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తుంటాం.. కానీ భాషను రక్షించుకునే విషయంలో మన వంతు పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు..
తెలుగు మాధ్యమం పాఠశాలలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. కానీ మన పిల్లలను మాత్రం ఆంగ్ల మాద్యమ పాఠశాలలకే పంపుతాం..
టీవీ యాంకర్లు భాషను ఖూనీ చేస్తున్నారని నిందిస్తున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నామనే విషయాన్ని ఆలోచించం..
మీలో తెలుగు అక్షరాలను వరుసక్రమం తప్పకుండా రాసే వారు ఎంత మంది?.. ఇంతకీ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి?.. కొన్ని అక్షరాలను ఎందుకు మింగేశాం? ఈ రోజు మనం మాతృ భాషను వదిలేసి అన్య భాషల వెంట పడుతున్నాం.. రేపు మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఇలాగే వదిలేస్తామా?
మారుతున్న సమాజంలో విద్య, ఉపాధి అవకాశాలు ఆంగ్ల భాష చుట్టే తిరుగుతున్నాయనేది సత్యం.. కాదనలేం.. మన పిల్లలను ఆంగ్ల మాధ్యమాల్లో చదివించక తప్పని పరిస్థితి వచ్చింది. నిజమే.. కానీ అదే సమయంలో మన భాషా సంస్కృతులను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మన ఇళ్లలో అయినా తెలుగు భాషను రక్షించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు కొంత మేరకైనా చేస్తున్నామా?
మన దేశంలో 42 భాషలు, మాండలికాలు త్వరలో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఇటీవల కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. ఇందులో అండమాన్ నికోబార్ దీవులకు చెందినవి 11, మణిపూర్ (7), హిమాచల్ (4) కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గడాబా, నైకీ ఉన్నాయి. అంతరిస్తున్న భాషల్లో మన తెలుగు లేదని సంతోష పడుతున్నారా?.. అప్పుడే సంబర పడకండి.. తర్వలో ఆ ముచ్చటా తీరిపోయే ప్రమాదం కనిపిస్తోంది..
తెలుగు భాషను రక్షించుకునే విషయంలో వ్యక్తిగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ఈ రోజుల్లో మాతృభాషను రక్షించుకునే అవకాశాలు గతంలో కన్నా మెరుగయ్యాయి.. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన భాషకు ఎప్పటికీ ఢోకా ఉండదు.. ఎన్ని భాషలైనా నేర్వండి.. కానీ మీ మాతృభాషను మాత్రం మరచిపోకండి..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (21 ఫిబ్రవరి) సందర్భంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి..
21.02.2018