Saturday, March 31, 2018

లెనిన్ ఎవరికి ఆరాదకుడు?

వ్యక్తిపూజ, విగ్రహ సంస్కృతికి నేను వ్యతిరేకం.. విగ్రహాల ఏర్పాటు, పడగొట్టడాన్ని కూడా వ్యక్తిగతంగా సమర్ధించలేను.. కానీ త్రిపురలో లెనిన్ విగ్రహం పడగొట్టారని గగ్గోలు పెడుతున్నవారిని చూసి స్పందించాల్సి వస్తోంది..
రష్యన్ విప్లవం తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వానికి సారధ్యం వహించాడు లెనిన్.. పొరుగు దేశాలను కబలించి సోవియట్ యూనియన్ కు పునాది వేసిన సామ్రాజ్యవాది. కమ్యూనిజం పతనం తర్వాత రష్యాతో సహా, మాజీ సోవియట్ దేశాల్లో లెనిన్ విగ్రహాలు పడగొట్టేశారు. సొంత దేశ ప్రజలే తిరస్కరించిన లెనిన్ భారత కమ్యూనిస్టులకు ఆరాధకుడు. భారత దేశంలో ఎంతో మంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. వారి విగ్రహాలు అవసరం లేదు. కానీ విదేశీయుడి విగ్రహం కూల్చేశారని బాధపడిపోతున్నారు.
లెనిన్ విగ్రహం పడగొట్టారని యాగీ చేస్తున్న కమ్యూనిస్టులు చేస్తున్న పనేమిటి? బెంగాల్ లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని అవమానించారు. ఇది కరెక్టా?.. త్రిపురలో శ్యామల్ కాంతి సేన్ గుప్తా, సుధామయ్ దత్, దేవేంద్ర డె, శుభాంకర్ చక్రవర్తి అనే నలుగు దేశ భక్తులను వామపక్ష ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నప్పుడు ఎవరూ స్పందించలేదు. కేరళలో దేశభక్తుల మారణకాండను పట్టించుకోలేదు.. కడుపు మండి కమ్యూనిస్టు ప్రభుత్వాన్నివదిలించుకున్న త్రిపుర వాసులు విదేశీ భావదాస్య చిహ్నాన్ని వదిలించుకుంటే లొల్లి లొల్లి.. వాహ్వా. క్యా బాత్ హై జీ..
07.03.2018

No comments:

Post a Comment