Saturday, March 31, 2018

ఫడ్నవీస్ చాతుర్యం



ముంబై మహా నగరంలో ఇటీవల రెండు భారీ ర్యాలీలు జరిగాయి.. కొద్ది వారాల క్రితం మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు.. తాజాగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం భారీ పాదయాత్ర జరిపారు.. ఈ రెండు ప్రదర్శనలు ముంబై నగరంపై ఉప్పెనలా వచ్చి పడ్డాయి.. లక్షలాది మంది వీధుల్లో కదం తొక్కారు.. పూర్తి క్రమశిక్షణతో జరిగిన ఈ రెండు ర్యాలీలో ఎక్కడా అవాంఛనీయ ఘటలు జరగలేదు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ర్యాలీలకు అనుమతి ఇవ్వడమే కాదు, అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా పోలీసు భద్రత కల్పించారు.. ర్యాలీలు నిర్వహించిన వారితో చర్చించి వారి సమస్యలు ఎంత మేరకు పరిష్కరించడం సాధ్యమో ఆ మేరకు హామీ ఇచ్చారు.. అప్పుడు మరాఠాలు, ఇప్పుడు రైతులు ఫడ్నవీస్ హామీతో సంతృప్తి చెంది నిరసనలు విరమించారు
ఎంతో కష్టపడి పాదయాత్ర చేసి ముంబై వచ్చిన రైతులు తిరిగి స్వస్థలాలకు వెళ్ళడానికి ఫడ్నవీస్ రవాణా సౌకర్యం కూడా కల్పించారు..
ఇప్పుడు మన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకు వద్దాం.. ఉద్యమాలు అనగానే మన ఇద్దరు సీఎంలకు వణుకు. ప్రదర్శన, సభలకు అనుమతి నిరాకరణ.. నాయకుల ముందస్తు నిర్బంధం, అరెస్టులు శరా మామూలే.. అంతే కాదు ఇక్కడి ఉద్యమకారుల్లో కూడా అంతటి క్రమశిక్షణ కనిపించదు..
ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజా ఉద్యమాలు ఎదుర్కోక తప్పదు.. వారి డిమాండ్లు, కోర్కెల సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే అధికారంలో ఉన్నవారు తమ పరిధిలో ప్రయత్నం చేస్తే కొంతైనా పరిష్కరించడం సాధ్యమే.. ఈ విషయంలో వయసులో చిన్నవాడైనప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను చూసి నేర్చుకోక తప్పదని చెప్పగలను..
13.08.2018

No comments:

Post a Comment