Friday, January 11, 2019

కుసంస్కారం

స్త్రీలను గౌరవించడం భారతీయ సంప్రదాయం.. అందుకే రాహుల్ గాంధీకి ఈ సంప్రదాయ విలువలు తెలియవేమో..
రఫేల్ ఒప్పందం గురుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఆయన్ని ఉతికి ఆరేసింది.. రాహుల్ దీన్ని జీర్ణించుకోలేక నిర్మల సీతారామన్, ప్రధాని నరేంద్ర మోదీలను నోటికొచ్చినట్లు తూలనాడుతున్నారు. రక్షణ మంత్రిని అవమానించిన రాహుల్ సంజాయిషీ ఇచ్చుకోవలని జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.. రాహుల్ అబద్ధాలను నిజాలుగా చూపే క్రమంలో వివేకాన్నే కాదు, సభ్యతా సంస్కారాలు కూడా కోల్పోతున్నారు..

Tuesday, January 8, 2019

రిజర్వేషన్ల విధానం మారాల్సిందే..


ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో అసలు ఈ విధానంపైనే సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలా అంటున్నానని నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అని భావించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాల్సిందే.. కానీ ప్రస్తుత రూపంలో కాదు..
భారత రాజ్యాంగం ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివక్ష నిషేధం.. దేశ ప్రజలందరినీ సమాన అవకాశాలుటు కల్పించింది రాజ్యాంగం.. అయితే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లను ఇచ్చారు. మొదట పదేళ్ల పాటు అనుకున్నారు ఈ రిజర్వేషన్లు.. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యాన కాల పరిమితిని పెంచుతూ పోయారు మన నాయకులు. కాలక్రమంలో మరికొన్ని కులాల రిజర్వేషన్ల జాబితాలోకి తెచ్చారు. రాను రాను ఇతర కులాల నుంచి కూడా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వాలపై వత్తిడి పెరుగుతూ వస్తోంది..
రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలా, సామాజిక వెనుకబాటు ప్రాతిపదికనా అనే విషయంలో మొదటి నుంచి అనేక వాదనలు ఉన్నాయి. ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. రిజర్వేషన్లను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది.
కాలంతో పాటు సమాజం కూడా ఎంతో మారిపోయింది. ఒకనాడు వివక్షను, వెనుకబాటు తన్నాన్ని ఎదుర్కొన్న కులాలు ఈనాడు ఆ పరిస్థితిలో లేవని అందరూ ఒప్పుకోక తప్పదు. అగ్రకులాలు అని చెప్పబడుతున్న కులాలలో పోలిస్తే వారే ఎక్కువ సంఘటితంగా ఉన్నారు. వారు కూడా రాజకీయంగా, ఆర్థికంగా బలపడ్డారు.. వీరిలో సంపన్న శ్రేణిని (క్రీమీ లేయర్) గుర్తించి వారిని రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం అన్ని విధాలా సమంజసం. అలాగే ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నట్లుగా ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొందిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వకపోవడం లేదా తగ్గించడం అమలు చేయాలి..
ఆకలికి, పేదరికానికి కులం లేదు.. అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు. కాబట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వడం అన్ని విధాలా సమంజసం.. ధనమూలం ఇదం జగత్ అని మన పెద్దలు అన్నారు. ధనవంతుడు తన పిల్లలతో వ్యాపారం చేయించి స్వయం ఉపాధి కల్పిస్తాడు.. వారి పిల్లలు పెద్ద చదువులు చదివించి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. కానీ పేదవారికి అన్ని అవకాశాలు ఎక్కడుంటాయి.. చదువు కొనేఈ రోజుల్లో కులాన్ని ఎవరు చూస్తున్నారు?.. అందుకే డబ్బు లేనోళ్లకు రిజర్వేషన్ల అవసరం ఎక్కువ..
మన దేశంలో రిజర్వేషన్ల కారణంగా ఎంతో మంది వ్యక్తులకు, కుటుంబాలకు మేలు జరిగింది.. అదే సమయంలో ఇవే రిజర్వేషన్ల కారణంగా అన్యాయాలు కూడా జరిగాయి.. బాధితులకు కడుపు మంట సహజం.. ఎందుకు ఈ విషయం ప్రస్థావిస్తున్నానంటే నేను కూడా రిజర్వేషన్ల కారణంగా అవకాశాలు కోల్సోయిన బాధితున్ని.. సోకాల్డ్  కులంలో పుట్టడమే నేను చేసిన పాపమేమో అని దు:ఖపడ్డ రోజులు ఉన్నాయి..
ప్రస్తుత రిజర్వేషన్ల పద్దతి ఉన్నంత కాలం బాబా సాహెబ్ అంబేద్కర్ కోరకున్న కుల రహిత సమాజం ఏర్పడదు.. నేను ఏ కులానికి వ్యతిరేకిని కాదు.. పేదల పక్షపాతిని మాత్రమే.. అందుకే నేను అర్ధిక ప్రాతిపదిక రిజర్వేషన్లను సమర్ధిస్తున్నాను..


Thursday, January 3, 2019

వందేమాతర గీతం వరుస మార్చిన కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగలంతా ఆలపించే వందేమాతరం గీతాలాపన నిల్పి వేసింది.. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు.. ఆ పార్టీ మొదటి నుంచి కూడా వందేమాతరానికి వ్యతిరేకం.

స్వాతంత్రానికి పూర్వం బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆలపించేవారు. కానీ 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్షునిగా ఉన్న మహ్మద్ అలీ వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించి వేదిక దిగి వెళ్లిపోయారు. ముస్లింలీగ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అలీ సోదరుల నిరసన కారణంగా మహాత్మాగాంధీ వందేమాతరానికి పక్కన పెట్టారు.. వందేమాతరంలో దేవతార్చన విగ్రహారాదన అవుతుంది గనక తమకు అభ్యంతరమని వారు చెప్పడంతో కాంగ్రెస్ పెద్దలు రాజీ మార్గానికి వచ్చారు. నాలుగు చరణాలు ఉన్న వందేమాతరాన్ని కేవలం ఒక చరణానికి పరిమితం చేశారు..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా వందేమాతరం స్వీకరించేందుకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇష్ట పడలేదు. దీంతో ‘జనగనమన’ మన జాతీయ గీతమైంది. అయితే ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చొరవ తీసుకొని వందేమాతరానికి కూడా జాతీయ గీత హోదా ఇచ్చారు..
సంతృష్టీకరణ రాజకీయాల రుచి మరిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తానికే వందేమాతరం గీతానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో మొదటి మెట్టు మధ్యప్రదేశ్ సచివాలయంలో వందేమాతరంపై నిషేధం..

ఇంతకీ వందేమాతరం అంటే అర్థం తెలుసా?.. 'అమ్మా వందనం' అని.. దేశాన్ని తల్లిగా భావించి పూజించడం, గీతాన్ని అలపించడం కూడా మతతత్వంగా కనిపిస్తోంది కొందరికి.. అరె బాబులూ.. వందేమాతరం గీతం ఆరెస్సెస్, బీజేపీ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో ఉందిరా.. తల్లిలాంటి దేశాన్ని కీర్తించినంత మాత్రాన మీరు మతతత్వ వాదులు అయిపోరురా..

Wednesday, January 2, 2019

ఇదేం సెక్కులరిజం?


నిజమైన భక్తులు ఎంతో నియమ నిష్టలతో ఆలయానికి వస్తారు.. కానీ దొంగలకు భయం, భక్తి ఉండవు.. అలాగే రాక్షసులు ధర్మాన్ని నాషనం చేసేందుకు ఎల్లవేళలా కాచుకొని ఉంటారు.. అన్య మతస్తులు విద్వేషంతో మన ధర్మంపై దాడికి వస్తారు?
మరి వీరెవరు?
పవిత్ర శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వారు వచ్చిన తీరు చూస్తే దొంగల్లాగే ఉన్నారు.. సాంప్రదాయాలకు ఉల్లంఘించిన తీరు చూస్తే రాక్షస సంతతే అనిపిస్తోంది. కనీసం కట్టూ బొట్టు లేని వీరు మన ధర్మీయులు మాత్రం కాదు.. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో, లింగ సమానత్వం ముసుగులో, నకిలీ ఇరుముడులతో వచ్చిన వీరిని ఏమనాలి ఇంతకు?
కేరళ వామపక్షుల బరి తెగింపు ఇది.. తమ ప్రభుత్వం అండ చూసుకొని అయ్యప్ప ఆలయంలో ప్రవేశించిన ఆ పార్టీ కార్యకర్తలు మన ధర్మంపై దాడికి వచ్చారు.. ఇదే దుస్సాహసం అన్య మతస్తుల ప్రార్థనాలయాల విషయంలో చేయగలరా?.. సెక్యులరిజం ముసుగులో ఇలాంటి వెర్రి తలలను ఇంకా భరించాల్సిందేనా? ఈ దేశంలో మెజారిటీ ప్రజల సహనాన్ని అసమర్ధతగా భావిస్తున్న వీరికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే..
ధర్మో రక్షతి రక్షిత: మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.. అదే మనల్ని రక్షిస్తుంది.
.

Tuesday, January 1, 2019

క్యాలెండర్ మారితే హంగామా ఎందుకు?

డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది?.. జనవరి.. అంతే కదా..
మరి 31వ తేదీ తర్వాత?.. మళ్లీ 1వ తేదీతో కొత్త నెల..
అలాగే 2018 తర్వాత 2019 వస్తుంది.. క్యాలెండర్ మారిపోతుంది అంతే..
ఇంత మాత్రానికే హడావుడి ఎందుకు?.. జనవరి 1 మనకు పండుగ కాదు.. క్యాలెండర్ మార్పు మాత్రమే.. న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటే, ఎంజాయ్ చేస్తే తప్పు ఏమిటి అంటారా?.. అది మీ ఇష్టం.. కేక్ కట్ చేసుకుంటారో, మందు కొడతారో, డాన్సులు చేస్తారో చేసుకోండి..
కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకండి.. పెద్ద సౌండ్ పెట్టి, వెర్రి కేకలు వేసి నిద్రపోయే వారిని ఇబ్బంది పెట్టకండి.. తాగిన మైకంలో రోడ్ల మీద అడ్డగోలు వేగంతో వాహనాలు నడపకండి.. మీ చావు మీరు చేస్తే ఎవరికి నష్టం లేకపోవచ్చు.. కానీ మీ పిచ్చ ఆనందం కోసం ఎదుటి వారి ప్రాణం తీసే స్వేచ్ఛ మీకు లేదు.. 
ఒక సనాతన ధర్మ విశ్వాసకునిగా, తెలుగు వాడిగా నేను ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటాను.. ఆ రోజే పండుగ చేసుకుంటాను..
మీరు నమ్మే న్యూ ఇయర్ నిషాచారులు తిరిగే అర్ధరాత్రి వస్తే, నా సంవత్సరాది లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడిని మేలుకొలిపే సుప్రభాత వేళ ప్రారంభం అవుతుంది.. అర్ధరాత్రి మన నిద్ర చంపుకొని, అవతలి వాడి నిద్రను పాడు చేసే అవసరం లేదు.. అడ్డగోలుగా తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీయడం, తీసుకోవాల్సిన అవకాశం లేదు..
చివరగా క్యాలండర్ మార్పు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Monday, April 30, 2018

Monday, April 2, 2018

పంచ్.. పంచ్

01.04.2018
ఎవరక్కడ.. ఆ మానసిక విశ్లేషకున్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించండి