Tuesday, January 1, 2019

క్యాలెండర్ మారితే హంగామా ఎందుకు?

డిసెంబర్ తర్వాత ఏమొస్తుంది?.. జనవరి.. అంతే కదా..
మరి 31వ తేదీ తర్వాత?.. మళ్లీ 1వ తేదీతో కొత్త నెల..
అలాగే 2018 తర్వాత 2019 వస్తుంది.. క్యాలెండర్ మారిపోతుంది అంతే..
ఇంత మాత్రానికే హడావుడి ఎందుకు?.. జనవరి 1 మనకు పండుగ కాదు.. క్యాలెండర్ మార్పు మాత్రమే.. న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటే, ఎంజాయ్ చేస్తే తప్పు ఏమిటి అంటారా?.. అది మీ ఇష్టం.. కేక్ కట్ చేసుకుంటారో, మందు కొడతారో, డాన్సులు చేస్తారో చేసుకోండి..
కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకండి.. పెద్ద సౌండ్ పెట్టి, వెర్రి కేకలు వేసి నిద్రపోయే వారిని ఇబ్బంది పెట్టకండి.. తాగిన మైకంలో రోడ్ల మీద అడ్డగోలు వేగంతో వాహనాలు నడపకండి.. మీ చావు మీరు చేస్తే ఎవరికి నష్టం లేకపోవచ్చు.. కానీ మీ పిచ్చ ఆనందం కోసం ఎదుటి వారి ప్రాణం తీసే స్వేచ్ఛ మీకు లేదు.. 
ఒక సనాతన ధర్మ విశ్వాసకునిగా, తెలుగు వాడిగా నేను ఉగాదిని సంవత్సరాదిగా జరుపుకుంటాను.. ఆ రోజే పండుగ చేసుకుంటాను..
మీరు నమ్మే న్యూ ఇయర్ నిషాచారులు తిరిగే అర్ధరాత్రి వస్తే, నా సంవత్సరాది లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడిని మేలుకొలిపే సుప్రభాత వేళ ప్రారంభం అవుతుంది.. అర్ధరాత్రి మన నిద్ర చంపుకొని, అవతలి వాడి నిద్రను పాడు చేసే అవసరం లేదు.. అడ్డగోలుగా తాగి వాహనాలు నడిపి ప్రాణాలు తీయడం, తీసుకోవాల్సిన అవకాశం లేదు..
చివరగా క్యాలండర్ మార్పు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment