Thursday, January 3, 2019

వందేమాతర గీతం వరుస మార్చిన కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగలంతా ఆలపించే వందేమాతరం గీతాలాపన నిల్పి వేసింది.. ఇది కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు.. ఆ పార్టీ మొదటి నుంచి కూడా వందేమాతరానికి వ్యతిరేకం.

స్వాతంత్రానికి పూర్వం బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆలపించేవారు. కానీ 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్షునిగా ఉన్న మహ్మద్ అలీ వందేమాతరం గీతాన్ని వ్యతిరేకించి వేదిక దిగి వెళ్లిపోయారు. ముస్లింలీగ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అలీ సోదరుల నిరసన కారణంగా మహాత్మాగాంధీ వందేమాతరానికి పక్కన పెట్టారు.. వందేమాతరంలో దేవతార్చన విగ్రహారాదన అవుతుంది గనక తమకు అభ్యంతరమని వారు చెప్పడంతో కాంగ్రెస్ పెద్దలు రాజీ మార్గానికి వచ్చారు. నాలుగు చరణాలు ఉన్న వందేమాతరాన్ని కేవలం ఒక చరణానికి పరిమితం చేశారు..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ గీతంగా వందేమాతరం స్వీకరించేందుకు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇష్ట పడలేదు. దీంతో ‘జనగనమన’ మన జాతీయ గీతమైంది. అయితే ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ చొరవ తీసుకొని వందేమాతరానికి కూడా జాతీయ గీత హోదా ఇచ్చారు..
సంతృష్టీకరణ రాజకీయాల రుచి మరిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తానికే వందేమాతరం గీతానికి ఎసరు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో మొదటి మెట్టు మధ్యప్రదేశ్ సచివాలయంలో వందేమాతరంపై నిషేధం..

ఇంతకీ వందేమాతరం అంటే అర్థం తెలుసా?.. 'అమ్మా వందనం' అని.. దేశాన్ని తల్లిగా భావించి పూజించడం, గీతాన్ని అలపించడం కూడా మతతత్వంగా కనిపిస్తోంది కొందరికి.. అరె బాబులూ.. వందేమాతరం గీతం ఆరెస్సెస్, బీజేపీ పుట్టక ముందు నుంచే ఈ దేశంలో ఉందిరా.. తల్లిలాంటి దేశాన్ని కీర్తించినంత మాత్రాన మీరు మతతత్వ వాదులు అయిపోరురా..

No comments:

Post a Comment