Thursday, April 30, 2015

ఆదుకుందాం రండి..

మన పొరుగు దేశం నేపాల్ తో పాటు బీహార్ రాష్ట్రంలో వచ్చిన ఘోర ప్రకృతి విపత్తులో 10 వేల మందికి పైగా మరణించారు. నేపాల్ చాలా దారుణంగా దెబ్బతిన్నది భూకంపం ధాటికి ఇళ్లు, భవనాలు కుప్పకూలి లక్షలాది మంది నిరాశ్రయులైపోయారు. గాయపడిన వారి పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంది. వీరందరికీ తిండి, వసతి, పునరావాసం కల్పించడం శ్రమతో కూడిన పని. అలాగే కుప్పకూలిన చారిత్రిక ఆలయాలు, వారసత్వం సంపదను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం మానవతా మూర్తులు పెద్ద ఎత్తున ముందుకు రావాల్సిన అవసరం ఉంది. విరాళాలు సేకరించడం ఒక ఎత్తయితే, వాటిని సద్వినియోగం చేస్తున్నారా, అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పారదర్శకంగా సాయం అందించే సంస్థలకే మనం ధన, వస్తు రూపేనా విరాళాలు అందించాలి. ఈ దిశగా  సేవా భారతి, విశ్వ హిందూ పరిషత్ ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి.. ఈ సంస్థల ద్వారా మనమంతా సాయం అందిద్దాం.. మీ విరాళాలు నేరుగా ఈ క్రింది అకౌంట్లలో జమ చేయవచ్చు.. ఇతర వివరాలకు క్రింది సంస్థలను సంప్రదించవచ్చు..
1)      Vishwa Hindu Parishad, Telangana – Union Bank, Tilak Road, Hyd, A/c No.347702010011989, (IFSC-UBI No.534773)  or Vishwa Hindu Parishad, OBC Bank, Basant Lok, New Delhi – A/c No.407210017250 (IFS-ORB0100407) or Bharath Kalyan Parthistan, OBC Bank, Basant Lok, New Delhi – A/cNo. 04072010019960 (IFSC-ORBC 0100407)
2)      SEVABHARATHI, ICICI Bank, A/C No.630501065297 (IFSC – ICIC0006305)

సేవా భారతిని సంప్రదించాల్సిన చిరునామా సేవా భారతి, ఇం.నెం.3-2-106/1, నింబోలి అడ్డ, కాచిగూడ, హైదరాబాద్ – 500027, email: sewabharathi@gmail.com

Wednesday, April 29, 2015

సాయమా?.. మత ప్రచారమా?

నేపాల్ భూకంపం ప్రపంచాన్ని కదిలించింది.. భారత్ సహా అన్ని దేశాలు పెద్ద ఎత్తున సాయం చేసేందుకు రంగంలోకి దిగాయి.. ఇలాంటి సమయంలో త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 1,00,000 గిడియాన్ బైటిల్ ప్రతులు దిగాయి.. వారిని చూసి నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కుమార్ కోయిరాలా అగ్గిమీద గుగ్గిలమైపోయారు..
ఇదేం తెలివి తక్కువ పని.. నేపాల్ ఏమైనా మోటెల్ (హోటల్) అనుకుంటున్నారా?.. మేము బైబిల్స్ తనలేము.. వాటిని గడ్డపారలుగా కూడా ఉపయోగించలేం.. నేపాల్ కు ఇప్పుడు ఆహారం, మందులు, సహాయ సామాగ్రి, కార్మికులు కావాలి.. బెస్ట్ సెల్లర్ పుస్తకాలు కాదు..అంటూ ఆగ్రహం వ్యక్త చేశారు కోయిరాలా..
‘’మీరు నేపాల్ కోసం ప్రార్ధనలు చేస్తే ధన్యవాదాలు.. కానీ బైబిల్స్ మాత్రం పంపకండిఅని స్పష్టం చేశారు కోయిరాలా..
నేపాల్ అధికారికంగా హిందూ రాజ్యం.. ప్రకృతి వైఫరీత్యం కారణంగా సర్వం కోల్పోయిన నేపాలీలను సాయం పేరిట మత మార్పిడి చేసేందుకు అవకాశవాదులు పొంచి చూస్తున్నారు.. ఇలాంటి సమయంలో నిజంగా సేవాభావంతో పని చేస్తున్నది ఎవరు? దుర్భుద్దికి సేవ ముసుగేసుకుంటున్నది ఎవరు అన్న విషయాన్ని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది..

గతంలో ఓ నియోజక వర్గ ప్రజలు నాయకురాలిని ఓడించింనందుకు హుద్ హుద్ వచ్చిందని సోషల్ మీడియాలో చాటుకున్న మత పిచ్చోళ్లు, ఇప్పుడు నేపాల్ విషయంలోనూ అదే తరహా ప్రచారానికి దిగారు.. తమ మతం వారిని నేపాలీలు హింసించినందుకే దేవుడు ఆ దేశాన్ని నాశనం చేశాడట.. హే ప్రభువా.. ఇలాంటి ప్రేలాపనలు చేసేవారిని క్షమిస్తావో, శిక్షిస్తావో నీ ఇష్టం.

Monday, April 27, 2015

నిజాయితీపై కత్తి కట్టిన ప్రభుత్వం

నీతి, నిజాయితీ, అంకిత భావంతో పని చేసే ఉద్యోగులకు బహుమానం బదిలీయా? పదోన్నతులను అడ్డుకునేందుకు కేసులు బనాయిస్తారా? ఐఏఎస్ ప్రమోషన్ జాబితాలో ఉన్న ఒక ఉన్నతాధికారిణికి తీరని అన్యాయం జరిగింది. అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసి పగతీర్చుకున్నారు కొందరు పెద్దలు.. ఎందుకిలా జరిగింది?.. తనకు అప్పగించిన బాధ్యతను ముక్కుసూటిగా, చిత్తశుద్దితో నిర్వర్తించడమే ఆమె చేసిన పాపమా?
తెలంగాణ రాష్ట్ర సహకార శాఖలో అధనపు రిజిస్ట్రార్ కిరణ్మయి.. కొందరు అధికారుల అవినీతి వ్యవహారాన్ని బయట పెట్టడం, వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడమే ఆమె చేసిన నేరం. ఆ అవినీతి అధికారులకు కొందరు నాయకులు అండగా నిచిలి కొమ్ము కాస్తున్నారు. గతంలో కూడా కిరణ్మయి ఒక హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలను బయట పెట్టారు.. కానీ ఆ నివేదికపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలియదు, కానీ ఈ అవినీతిలోని ముఖ్య పాత్రధారి మాత్రం ప్రభుత్వంలో కీలక పదవి పొందారు.
పలు ఆర్థిక అక్రమాల కేసుల్లో విచారణాధికారిగా పని తీరుకు కిరణ్మయి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. కిరణ్మయికి ఇప్పుడు పదోన్నతి లభించాల్సి ఉంది.. ఐఏఎస్ హోదా పొందే జాబితాలో ఉన్నారు.. సరిగ్గా ఇక్కడే కపట నాటకాలు నడిచాయి. ఆమెపై పగబట్టినవారంతా పావులు కదిపారు.. తమను కేసుల నుండి తప్పించేందుకు డబ్బు అడిగారంటూ అవాస్తవ ఫిర్యాదులు చేశారు. వెంటనే ప్రభుత్వంలోని పెద్దలు విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు బయటకు వచ్చినా, ఆలోగా కిరణ్మయి పదోన్నతి ఆగిపోవడమే వారి లక్ష్యం..
ఈ వ్యవహారంలో తెలంగాణ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కిరణ్మయికి అండగా నిలిచింది. సీబీసీఐడీ విచారణ కోసం డిమాండ్ చేశాయి. తమ శాఖలో తమను ఇబ్బంది పెడుతున్న ఓ అధికారిపై ఇద్దరు మహిళా ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూ లేదు. కానీ కిరణ్మయిపై అత్యవసరంగా చర్యలు తీసుకోవాల్సిన అగత్యం పెద్దలకు ఏర్పడినట్లుంది. కిరణ్మయి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు.. కానీ స్వరాష్ట్రం వచ్చాక ఆమె అన్యాయానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఈ కథలో తాజా మలుపు ఏమిటంటే కిరణ్మయిని బదిలీ చేసి అప్రధాన్యపు పోస్టు ఇచ్చారు. ఆమెపై క్రమశిక్షణా చర్యల పేరిట వరంగల్ జిల్లా సహకార ట్రిబ్యునల్ సభ్యురాలిగా బదిలీ చేశారు.. మరో ట్విస్ట్ ఏమిటంటే, క్రమశిక్షణా చర్యలకు గురి కావాల్సిన వ్యక్తి దర్జాగా తన పూర్వపు పదవిలో ఆసీనుడైపోయారు. నిజాయితీగా వృత్తి ధర్మాన్ని పాటించడమే కిరణ్మయి చేసిన నేరమా?.. ఒక్కసారి ఆలోచించండి.. మనమంతా ఆమెకు అండగా నిలుద్దాం.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల్లో చలనం వచ్చి కిరణ్మయికి న్యాయం జరగాలని కోరుకుందాం..

పాక్ నుండి స్వేచ్చే లక్ష్యం..

పాకిస్తాన్ మా వనరులను కొల్లగొడుతోంది. ఇక్కడి నీరు, ఖనిజ సంపద తరలించుకుంటోంది.. కానీ మమ్మల్ని త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది, అక్కడ మాకు ఎలాంటి రాజ్యాంగ పరమైన హక్కులు లేవు.. అంటున్నారు ప్రొఫెసర్ సెంగె హస్నన్ సెరింగె.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్ బాల్తిస్తాన్ వాసి ప్రొ.సెరెంగె అమెరికా కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గిల్గిత్ బాల్తిస్తాన్ సంస్థను నిర్వహిస్తూ దానికి డైరెక్టర్ గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం (హైదరాబాద్) ఆహ్వానం మేరకు రెండు రోజులు నగరంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారాయన. జర్నలిస్టులు, మేధావులు, స్థానిక ముస్లింల ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. The Unknown Kashmir : Plight of Gilgit Baltistan అనే అంశంపై పురజనుల సభలో ప్రసంగించారు సెంగె హస్నన్ సెరింగె.
భారత దేశంలో పురాతన సాంస్కృతిక వారసత్వం సంబంధాలను గుర్తు చేశారు ప్రొ.సెరెంగె. గల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ బలవంతంగా కలిపేసుకున్నా, తమ మనుసులను మాత్రం జయించలేకపోయిందని అన్నారు. పాక్ పాలకులు తమను ద్వితీయ శ్రేణి పౌరులగానే చూస్తున్నారని తెలిపారు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న తమ నాయకుల గొంతులు నొక్కేస్తున్నారని, ప్రజలపై అరాచకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గిల్గిత్ బాల్తిస్తాన్ లో జరిగే నేరాలపై విచారణ, శిక్షల శాతం ‘0’ అని స్పష్టం చేశారు. ఇస్లామిక్ ఛాందస వాదులకు, తాలిబాన్లకు తమ ప్రాంతం కేంద్రంగా మారిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో చైనా పెడుతున్న పెట్టుబడులు తమ ప్రాంత అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడవని, గిల్గిత్ ప్రాంతం వారికి ఒక ట్రాన్సిట్ హబ్ మాత్రమే అంటున్నారు. మధ్య ఆసియా దేశాలకు కూడలిగా ఉన్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రజలు భారత దేశంతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు ప్రొ.సెరింగె.. జమ్మూ కాశ్మీర్తో రోడ్డు మార్గం తెరచుకుంటే తమ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

భారత దేశంతో తమకు సంస్కృతిక వారతస్వం సంబంధాలు ఉన్నా, గత 70 దశాబ్దాలుగా ఏర్పడ్డ అంతరం వల్ల ఇప్పటి తరానికి పెద్దగా మానసిక బంధం లేకుండా పోయిందని ప్రొ. సెరెంగె తెలిపారు. పాక్ చెరలో మగ్గిపోతున్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్వేచ్ఛను కోరుకుంటోందని, భారత్ తో సోదర బంధాన్ని వాంచిస్తోందని అంటున్నారు సెరెంగె. ప్రొఫెసర్ సెంగె హస్నన్ సెరింగె తన పేరు సింధు నది, టిబెట్ బౌద్దం, మహ్మద్ ప్రవక్తతో ముడిపడి ఉందని వివరించారు.


Sunday, April 26, 2015

విషాద నేపాలం..

కనీ వీనీ ఎరగని విషాదం.. దేశానికి దేశమే శిథిలాల దిబ్బగా మారింది.. వేలాది మంది మృతవాత పడ్డారు.. భూతల స్వర్గంలా ఉండే నేపాల్ క్షణాల్లో మరుభూమిగా మారింది.. కళ్లీ ముందే భవనాలు వణికిపోతూ, భూమి చీలిపోతుంటే జనం భయంలో పరుగులు తీశారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే రాజధాని ఖాఠ్మండూలో అత్యధిక నష్టం జరిగింది. ప్రపంచ చారిత్రిక సంపదగా గుర్తించిన నేలమట్టమైంది. భూకంప తాకిడికి మరణించిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. భూకంపం రాగానే మన దేశం స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.. కేవలం ప్రభుత్వాలు స్పందిస్తే సరిపోదు.. భారతీయులంతా మన పొరుగుదేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అనాధిలో మనతో చారిత్రిక, సాంస్కృతిక, మతపరమైన సంబంధాలు ఉన్న నేపాలీలకు సాయపడదాం..

Saturday, April 25, 2015

అందరికీ వందనాలు.. ధన్యవాదాలు

చూడబోతే ఏప్రిల్ మాసానికి చాలా ప్రత్యేకలు కనిపిస్తున్నాయి.. మేధావులు, కళాకారులు, గురువులు, రాజులు, నాయకులు, నియంతలు, సంస్కర్తలు, వ్యాపారవేత్తలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్రముఖులే ఈ నెలలో జన్మించారు.. చివరకు నాలాంటి సామాన్యుడూ పుట్టింది ఏప్రిల్ లోనే..
నా దృష్టిలో పుట్టిన రోజు అంటే వయసు పెరిగిన కొద్దీ మన జీవితంలో ఒక సంవత్సరం తరిగిపోతున్నట్లే.. ఈ భూమి మీద ఇంత వరకూ ఏ సాధించామో తెలియదు కానీ, మిగిలిన సంవత్సరాల్లో అయినా వ్యక్తిగత, కుటుంబాలతో పాటు సమాజానికి ఏదైనా చేయగలిగింది చేస్తే బాగుంటుంది.. నా పరిధిలో నేను ఎంతో కొంత చేస్తున్నానేమా అనే తృప్తి అయితే ఉంది..
పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అలవాటు నాకు లేదు.. కానీ ఈ తేదీని దాచుకోలేం కదా.. సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసిపోతుంది.. నేనొక్కన్ని ఉన్నానని గుర్తు పెట్టుకొని శుభాకాంక్షలు తెలియజేసిన బంధుమిత్రులకు, హితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. శుభరాత్రి.

Friday, April 24, 2015

వీరికే శిక్ష వేయాలి?

దాసుడి తప్పులకు దండంతో సరి అని సరిపుచ్చుకుంటాం.. కానీ నాయకులే తప్పు చేస్తే.. గజేంద్ర సింగ్ ఆత్మహత్యలకు కారణమై విమర్శలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు.. అరవింద్ కేజ్రీవాల్ తప్పయిపోయింది క్షమించమన్నాడు.. అసుతోష్ వెక్కివెక్కి ఏడిచాడు.. క్షమాపణలు, ఏడుపులతో గజేంద్ర ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు అయన కుటుంబ సభ్యులు.. దీనికి ఏం సమాధానం చెబుతారు?

గిల్గిత్ బాల్టిస్థాన్ పోరాట యోధుడు సెంగె హస్నన్ సెరింగె..

భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం జరిగే సమయంలో పాకిస్తాన్ దొంగచాటుగా ఆక్రమించిన భూభాగమే పాక్ ఆక్రమిత కాశ్మీర్.. ఇందులో గిల్గిత్ బాల్టిస్థాన్ అతి కీలకమైన భూభాగం. పాకిస్తాన్ పాలనలో మగ్గిపోతున్న అక్కడి ప్రజలు భారత దేశం వైపు ఆశగా చూస్తున్నారు. పాకిస్తాన్ చేతిలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలపై పోరాడుతున్నారు ‘సెంగె హస్నన్ సెరింగె’. పాకిస్తాన్ దుష్ట విధానాలను, ఐఎస్ఐ అరాచకాలను అంతర్జాతీయ వేదికపై ఎండగడుతున్నారాయన.. ఇందులో భాగంగా భారత్ లో పర్యటిస్తున్నారు సెంగె హస్నన్.. ఈ నెల 25న ఆయన హైదరాబాద్ వస్తున్నారు..
ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాచిగూడలోని భద్రుకా కాలేజీ ఆడిటోరియంలో "The Unknown Kashmir : Plight of Gilgit Baltistan" అనే అంశంపై ప్రసంగిస్తున్నారు సెంగె హస్నన్ సెరింగె..
ఈ కార్యక్రమానికి మిత్రులంతా తప్పకుండా రావాలని వారి పోరాటాన్ని, అనుభవాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల పోరాటానికి మన సంఘీభావం ప్రకటిద్దాం.. అందరికీ ఇదే ఆహ్వానం..

Thursday, April 23, 2015

పాప్ శవ రాజకీయం..

కళ్ళ ముందే ఓ రైతు చెట్టిక్కి ఆత్మహత్య చేసుకుంటున్నాడు.. ఆ నాయకుడు చూశాడు. దిగమని చెప్పలేదు. పైగా చోద్యం చూశాడు.. కథ క్లైమాక్స్ చేరాక కొందరు కార్యకర్తలు చెట్టెక్కి శవాన్ని దించారు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభలో జరిగిన ఘటన ఇది..
రైతు ఆత్మహత్య తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి..
ఆప్ కార్యకర్తలు చెట్లు ఎక్కడంలో శిక్షణ తీసుకోలేదు, అందుకే రైతును రక్షించలేకపోయాం.. ఈసారి అలా జరిగితే కేజ్రీవాల్ తప్పకుండా చెట్టిక్కి రైతును రక్షిస్తారు - అసుతోష్
ఆప్ ర్యాలీని భగ్నం చేసేందుకు బీజేపీ చేసిన కుట్ర రైతు ఆత్మహత్య కుమార్ విశ్వాస్
ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడటంతో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు – కేజ్రీవాల్

వీరి మాటల్లో మానవత్వం ఎక్కడైనా కనిపించిందా?.. రాజకీయం తప్ప.. బహిరంగ సభను నిర్వహించింది ఎవరు? జనాలను పోగుచేసింది ఎవరు?.. కేజ్రీవాల్ కు ప్రసంగ యావ తప్ప రైతును రక్షించాలనే ధ్యాసలేదా? చెట్టు దిగమని రైతును కోరి ఉంటే ఆయన సొమ్మేంపోయేది? నీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని బుజ్జగించే ప్రయత్నం చేశారా?.. ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించి రాక్షసానందం అనుభవించడమేనా ఆయన చేయగలిగింది?.. తన కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని సిగ్గు విడచి వ్యాఖ్యానించడం తగునా? ఢిల్లీ పోలీసులు ఆయన పరిధిలో లేకపోయినా, కనీసం పోలీసులకైనా ఆదేశాలు ఇచ్చారా రైతును చెట్టునుండి దించమని.. మోదీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న మీరు చేసిందేమిటి?.. రైతు ప్రాణం తీసుకోవడం తప్ప..

Monday, April 20, 2015

దేశాన్నే మరచిపోయాడా రాహుల్?

రెండు నెలల డుమ్మా తర్వాత పార్లమెంటులో చెలరేగి పోయాడు రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీని ఉద్ధేశించి 'మీ ప్రధాని' అనే పదం వాడాడు.. ఏం మోదీ బీజేపీ వారికే ప్రధానియా? రాహుల్ గాంధీకీ కాదా? రాహుల్ ఈ దేశ పౌరుడు కాదా? ఇంతకీ రాహుల్ ఏ దేశ పౌరుడు? సెలవుల కోసం థాయ్ లాండ్ వెళ్లి వచ్చే సరికి తనది భారత దేశం అని మరచిపోయాడా?..

Saturday, April 18, 2015

కొన్ని ప్రశ్నలు, జవాబులు..


ప్రశ్న- పప్పూ మళ్లీ బ్యాంగ్ కాక్, థాయ్ మసాజ్ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఏమి చేయాలి?..
జవాబు- ముందు అర్జంటుగా పెళ్లి చేయాలి..
ప్రశ్న- పార్లమెంట్ లో నిద్ర పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
జవాబు- కునికి పాట్లు రాగానే తొడపాశం పెట్టాలి..
ప్రశ్న- అధికారం రాకున్నా ఎన్నోకొన్ని సీట్లు రావాలంటే ఏమి చేయాలి?
జవాబు- పప్పూ ప్రచారానికి పోకుండా దూరం పెట్టాలి..
ప్రశ్న- పార్టీ శాశ్వతంగా అధికారానికి దూరంగా ఉండాలంటే ఏమి చేయాలి?

జవాబు- అర్జంటుగా పప్పూ గారికి సారధ్యం అప్పగించాలి..

Thursday, April 16, 2015

ఢిల్లీ టూ బ్యాంగ్ కాక్ టూ ఢిల్లీ.. పప్పూ ఘర్ వాపసీ..

బుజ్జోడొచ్చాసాడోచ్ అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.. 'నాన్నా ఎక్కడికెళ్లావ్ కన్నా.. అంటూ అమ్మగారు బెంగెట్టుకున్నారు.. నిన్నెవరూ ఏమీ అనరు పప్పూ.. అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది.. త్వరగా వచ్చేయరా..' అంటూ బుజ్జగించారు.. మసాజులు ఇక చాలులే అనుకున్నాడు.. వచ్చేశాడు..
రాహుల్ గాంధీ.. ఫిబ్రవరి 16న ఢిల్లీ నుండి బిజినెస్ క్లాస్ విమానంలో తెల్లవారు జామున 3.30కి బయలు దేరిన రాహుల్ 9.00కి బ్యాంగ్ కాక్ చేరుకున్నాడు.. మళ్లీ ఏప్రిల్ 16న ఉదయం 7.35కి బ్యాంగ్ కాక్ నుండి 10.35కి ఢిల్లీకి వచ్చేశాడు.. ఈ మధ్య కాలంలో అక్కడేమి చేశారో రాజావారు..
పార్లమెంట్ సమావేశాలు డుమ్మా.. రెండు వారాలు సెలవన్నాడు.. ఏకంగా రెండు నెలల తర్వాత తీరిగ్గా వచ్చాడు.. సెలవు పెట్టడానికి ఇదేమన్నా ఉద్యోగమా? ప్రజా సేవకు సెలవు అనేది ఉంటుందా?.. అధ్యయనం కోసం సెలవుమీద వెళ్లాడని చెప్పుకొచ్చారు కాంగీ పెద్దలు.. దేశంలో ఎక్కడా దిక్కు లేనట్లు అధ్యయనాని థాయ్ లాండే దొరికిందా అబ్బాయి గారికి.. విపస్యన ధ్యాయం కోసం వెళ్లాడని మరి కొందరు అన్నారు.. థాయ్ లాండ్ వారే ధ్యానం కోసం మన దేశానికి వస్తుంటారు. మరి ఈయన అక్కడికి వెళ్లి నేర్చుకొచ్చిందేమిటో..
ఢిల్లీలో దిగుతూనే తానెక్కడికెళ్లాడో, ఏం చేశాడో ఎవరికీ చెప్పొద్దని తన భద్రతా సిబ్బందికి హుకుం జారీ చేశారంట యువరాజా వారు.. అంత రహస్యం ఏమిటో మరి.. రాహుల్ ఎక్కడికి వెళ్లాడని ఆ మధ్య భద్రతా సిబ్బంది ఆరా తీస్తే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టేశారు.. అజ్ఞాతంలో ఏదైనా జరగకూడనికి జరిగి ఉంటే ఏం చేసేవారు? మోదీ సర్కారు భద్రత కల్పించలేదని వారే కదా చిందులేసేది?..

ఇంతకీ పప్పూ థాయ్ లాండ్ ఎందుకెళ్లాడు?.. నో టాప్ సీక్రెట్.. తెలిస్తే ఇంకేమైనా ఉందా?.. థాయ్ స్పెషాలిటీస్ ఏమిటో అక్కడికి వెళ్లి వచ్చినవారిని  అడగండి చెబుతారు.

అవకాశ వాద పరివార్..

ఆట మళ్లీ మొదలైంది.. ఏమో గుర్రము ఎగురనూ వచ్చు అన్నదే వారి ఆశ.. కొత్త సీసాలో పాత కాక్ టైల్.. పేరు, జెండా తర్వాత అట.. ప్రస్తుత ఎజెండా మాత్రం ఒకటేనట.. అదే బీజేపీ వ్యతిరేకత.. ఇందు కోసం గతంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో, అదే కాంగ్రెస్ తో అంట కాగేందుకు రెడీ.. జనతాదళ్(యు)+జనతాదళ్(ఎస్)+ఆర్జేడీ+సమాజ్ వాదీ+ఐఎన్ఎల్డీ+సమాజ్ వాదీ=జనతా పరివార్(?)
ఒకాయన ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు.. మరొకాయన కులాల కుంపటితో చలి కాచుకుంటుంటాడు.. ఇంకొకాయన పశువుల పొట్టగొట్టి తానే గడ్డి మేసేశాడు.. మరొకరు ప్రస్తుతం జైలులో కాలక్షేపం చేస్తున్నాడు.. అవతలి వాడికి రెండు కళ్లు పోవాలని కోరుకుంటూ తన కంటినే పొడుచుకునే రకం ఇంకో పెద్ద మనిషి.. అవునవును ఇలాంటి వారంతా ఒకే పరిపారంలో ఉండటం బెటరు..
కలవడం, విడిపోవడం, మళ్లీ కలవడం వారికి మామూలే.. ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో చెప్పరూ.. ఒకరంటే ఒకరికి పడదు.. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గోతులు తవ్వేందుకు సిద్ధంగా ఉంటారు.. తమ అవకాశవాదంతో రెండు సార్లు అప్పనంగా కాంగ్రెస్ కు అధికారం అప్పజెప్పారు.. మరోసారి అదే పని చేసేందుకు సిద్దమవుతున్నారు..

ఆరుగురు వేర్వేరు శత్రులతో పోరాడే బదులు, ఉమ్మడి శత్రువుతో తలపడటం ఈజీ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నెత్తిన పాలు పోసింది ఈ కొత్త అవకాశ వాద పరివార్..

Wednesday, April 15, 2015

అమంగళ డీకే..

మంగళం అంటే శుభప్రదం.. మంగళ సూత్రానికి భారతీయ సంస్కృతిలో, హిందూ మతం పవిత్ర స్థానం ఉంది.. మరి మంగళ సూత్రం తెంచడం అంటే.. అమంగళం, అశుభప్రదం కాదా?.. తమిళనాట కొందరు మతిలేని వారు చేస్తున్న పనేమిటి?.. హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని వ్యతిరేకించడమే వారి పని..
మంగళ సూత్రాన్ని తెంచేయడం అనే వెర్రి కార్యక్రమం నిర్వహించింది ద్రవిడ కజగం(డీకే).. అదృష్ట వశాత్తు ఈ కార్యక్రమానికి స్పందన పెద్దగా లేదు.. పాల్గొన్న 25 జంటలు కూడా ఆ పార్టీ కార్యకర్తలే.. అందునా నాస్తికులు(?) వారంతా హిందూ మత వ్యతిరేకులే.. అయినా ఏదో జరిగిపోయింది, వందలు, వేల సంఖ్యలో జనం తాళి తెంచేశారు అన్నట్లు ప్రచారం జరిగిపోయింది.. మీడియాలో పబ్లిసిటీ ద్వారా ఉనికిచి చాటు కోవాలనే డీకే అధ్యక్షుడు వీరమణి పైశాచిక ఎత్తుగడ మాత్రం ఫలించింది. న్యాయస్థానం ఎక్కడ నిరాకరిస్తుందో అనే భయంతో ఉదయం పది గంటలకు జరగాల్సిన తాళి తెంచు కార్యక్రమాన్ని ఏడు గంటలకే పూర్తి చేసుకోవడం వీరి దొంగచాటు వ్యవహారానికి, దివాళాకోరు విధానానికి నిదర్శణం..
తాళి తెంచు కార్యక్రమం పెరియార్ ఆశయాల సాధనలో భాగమట(?).. మరి ఇందు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఎందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు.. పైగా ఇదే రోజు సాయంత్రం గోమాంస భక్షణ అనే మరో కార్యక్రమం తలపెట్టారు. అదృష్ణవశాత్తు న్యాయవ్యవస్థ, ప్రభుత్వం ఆలస్యంగా అయినా స్పందించడంతో ఆగిపోయింది. బాబాసాహెబ్ జయంతికి, తాళి తెంచుడు గోమాంస భక్షణకు ఏమిటి సంబంధం? ఎందుకు ఆ మహనీయుని జయంతి నాడు ఈ అపవిత్ర కార్యక్రమం తలపెట్టారు?

ద్రవిడ కజగం ఒక హిందూ వ్యతిరేక పార్టీ మాత్రమే కాదు.. దేశ సమైఖ్యతను దెబ్బతీయడమే వారి లక్ష్యం.. అందుకే మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను తరచూ చేస్తూనే ఉంటుంది.. గతంలో పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంపై దాడి చేసి ధ్వంసం చేసింది ఎవరు?.. మన దేశానికి శత్రువు, రాజీవ్ హంతకులైన ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈకి బాహటంగా మద్దతు ఇచ్చింది ఎవరు?.. తాజాగా శేషాచలం ఎన్ కౌంటర్ సాగుతో తమిళనాట తెలుగువారిపై దాడులను ప్రోత్సహించింది ఎవరు?.. అసలు డీకే పార్టీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు? దేశ సమైఖ్యతను దెబ్బతీసే ఇలాంటి దుష్టశక్తులను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది..

Tuesday, April 14, 2015

అంబేద్కర్ ను అర్ధం చేసుకున్నామా?

దేశ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకున్నాం.. ఏటా ఏప్రిల్ 14న జయంతిని, డిసెంబర్ 6న వర్ధంతిని జరుపుకుంటూనే ఉంటాం.. ఇలా జయంతి, వర్ధంతులు జరుపుకోవడం వరకే పరిమితం అవుతున్నామా? లేక ఆ మహనీయుడు చెప్పినవి ఏమైనా ఆచరిస్తున్నామా? ప్రతి నాయకుడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది..

అసలు బాబాసాహెబ్ ఏమి చెప్పారు?.. మనం వాటిని పాటిస్తున్నామా?.. లేక వాటికి విరుద్దంగా నడుస్తున్నామా?.. అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 65 ఏళ్లు అవుతోంది. ఆయన అందించిన రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన వారికే అందుతున్నాయా?.. దళితులు, బహుజనులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా? ఈ రిజర్వేషన్లు ఇంకా ఎంత కాలం కొనసాగించాల్సి ఉంది?.. అంబేద్కర్ కోరుకున్న కుల నిర్మూళన ఎంత వరకు అమలులోకి వచ్చింది?.. అంటరానితనం, అసమానతలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి?.. రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు ఎక్కడ విఫలం అవుతున్నాయి?.. వీరంతా అంబేద్కర్ ను నిజంగా అర్ధం చేసుకున్నారా? లేక ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తున్నారా?.. ఆలోచించండి.. చర్చించండి..

Monday, April 13, 2015

జర్నలిస్టులైన పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలుగు నాట గత 48 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తున్న శ్రీ సరస్వతీ శుశు మందిరాలలో లక్షలాది మంది విద్యాభ్యాసం చేసి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో జర్నలిస్టులైన పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యుల కోసం శ్రీ సరస్వతీ విద్యా పీఠం పూర్వ విద్యార్థి పరిషత్ ఒక సమ్మేళనం నిర్వహిస్తోంది. 19-04-2015 (ఆదివారం) నాడు శారదాధామంలో ఉ.10 గం. నుండి సా.4 గం. వరకూ జరిగే ఈ సమ్మేళనంలో జర్నలిస్టులైన పూర్వ విద్యార్థులు, పూర్వాచార్యులు తప్పని సరిగా హాజరు కావాలని మనవి. ఇతర వివరాలు, సంప్రదింపుల కోసం ఆహ్వానపత్రం చూడగలరు. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని, షేర్ చేయాలని ప్రత్యేక మనవి

Saturday, April 11, 2015

నేతాజీపై నెహ్రూ ఎందుకు నిఘా పెట్టారు?

నేతాజీ.. అసలు ఈ పేరు పుట్టిందే ఆయన కోసం.. భారతీయుల హృదయాల్లో ఎన్ని తరాలైనా సజీవం ఉంటే మహావ్యక్తి సుభాష్ చంద్రబోస్.. వీరులకు మరణం ఉండదంటారు.. యాదృచ్ఛికంగా నేతాజీ మరణించింది ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఇది రహస్యంగానే ఉండిపోయింది. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన మరోరహస్యం సంచలం సృష్టించింది.. అది సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెట్టిన నిఘా.. అసలు బోసు బాబుపై నెహ్రూ ఎందుకు నిఘా పెట్టినట్లు?..
భారత స్వాతంత్రోద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది.. మహాత్మా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సారధ్యం వహిస్తోంది.. అదే సమయంలో దేశ ప్రజల హృదయాలను మరో వ్యక్తి ఆక్రమించాడు.. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్..  1938లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు వచ్చిపడ్డాయి. గాంధీజీ అధ్యక్ష అభ్యర్థిగా పట్టాభి సీతారామయ్యను ప్రతిపాదించారు. అయితే సుభాష్ చంద్ర బోసు కూడా ఈ పదవికి పోటీ పడ్డారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో బోసుబాబు కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నకయ్యారు. ఈ విషయాన్ని గాంధీ జీర్ణించుకోలేక పోయారు. పట్టాభి ఓటమిని తన ఓటమిగా ప్రకటించుకున్నారు. బోసుకు  ప్రత్యామ్నాయంగా జవహర్ లాల్ నెహ్రూను ఎగదోసి అసమ్మతి రాజకీయాలకు ఊతం ఇచ్చాడు మన మహాత్ముడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు నేతాజీ..
రెండో ప్రపంచ యుద్దంలోకి భారత దేశాన్ని బలవంతంగా నెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన సుభాష్ చంద్రబోసును అరెస్టు చేశారు. కొంత కాలం జైలుతో పెట్టి ఆ తర్వాత గృహ నిర్భందంలో ఉంచారు. ఆ సమయంలో నేతాజీ మదిలో కొత్త ఆలోచనలు వచ్చాయి. 1941లో బ్రిటిష్ ప్రభుత్వ నిఘాను తప్పించుకునేందుకు మారు వేషంలో దేశం విడిచిపోయారు. బ్రిటిష్ వారి బద్ద శత్రువులుగా ఉన్న జర్మనీ, జపాన్ దేశాలను సంప్రదించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యుద్దం ప్రారంభించారు సుభాష్ చంద్రబోస్. మీ రక్తాన్ని ధారబోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానుఅనే నేతాజీ పిలుపు భారతీయులందరినీ కదిలించింది.. దీన్నినెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. బోసుబాబు తిరిగి వస్తే తమ పీఠాలు కదులుతాయని భయపడ్డారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా నేతాజీ వ్యవహారంలో ముచ్చెమటలు పట్టాయి.
అలాంటి సమయంలో ఆగస్టు 18, 1945న తైవాన్ నుండి టోక్యో వెళుతున్న విమానం కుప్పకూలిందనే వార్త వచ్చింది. అందులో బోసుబాబు ఉన్నారని చెబుతున్నారు. నేతాజీ మరణించారనే వార్త దుమారాన్ని లేపింది. కానీ ఎవరూ ఈ వార్తను నమ్మలేదు.. ఆయన చితాభస్మాన్ని జపాన్ లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని అంటారు. నెహ్రూ తనకు సన్నిహితుడైన సోవియట్ నియంత స్టాలిన్ తో సంప్రదించి సుభాష్ చంద్రబోసును రష్యాలోని సైబీరియాలో నిర్భందించారనే కథనాలు కూడా ఉన్నాయి..
15 ఆగస్టు, 1947న స్వతంత్ర్య భారత ప్రభుత్వానికి తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ లాల్ నెహ్రూ.. వాస్తవానికి ఆ పదవిలో ఉండాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్.. బోసు బాబు ఇంకా ప్రజల మాటల్లో సజీవంగా ఉండటం నెహ్రూ జీర్ణించుకోలేకపోయారు.. అందు కోసమే ఆయన కుటుంబంపై నిరంతర నిఘా కొనసాగించారు.. 1948 నుండి 1968 వరకూ ఇంటలిజెన్స్ బ్యూరో సాగించిందీ వ్యవహారం.. నెహ్రూ చనిపోయిన తర్వాత కూడా నిఘా కొనసాగడం విశేషం.. బోసు బాబు మరణ రహస్యాన్ని ఛేదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు.. వివిధ వర్గాల నుండి వచ్చిన వత్తిడితో 1956లో షానవాజ్ కమిటీని నియమించినా సరైన వివేదిక ఇవ్వలేక పోయింది. అటల్జీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ సంచలన విషయాన్ని బయట పెట్టింది.. అందరూ అనుకున్నట్లుగా అసలు ఆగస్టు 18, 1945న విమాన ప్రమాదమే జరగలేదు. జపాన్ లోని రెంకోజీ ఆలయంలోని చితాభస్మం కూడా నేతాజీది కాదని స్పష్టమైంది. నివేదిక వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సహజంగానే ఈ నివేదికను తిరస్కరించింది..

ఇంతకీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైనట్లు.. ఆయన ఎక్కడికీ పోలేదు.. దేశ ప్రజల హృదయాల్లోనే చిరస్థాయిగా ఉన్నారు..


Friday, April 10, 2015

సత్యం అసత్యమైన వేళ..

సత్యం వద ధర్మం చర.. ఇది మన ఉపనిషత్తుల్లోని సూక్తి ముక్తావళి. ఆయన సత్యాన్ని వధించారు.. ధర్మాన్ని తప్పారు.. చివరకు చెరసాలపాలయ్యారు..
ఆయన స్థాపించిన సంస్థ సత్యం.. ఇంటి పేరే మారిపోయి సత్యం రామలింగరాజు అయ్యాయి. తన సంస్థను అగ్రగామిగా నిలిపారు. వేలాది మందికి ఉపాధి అవవకాశాలు కల్పించారు.. ఎన్నో సామాజిక, దాతృత్వ సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా 108 అత్యవసర సేవలకు నాంది పలికారు. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శుద్ధ జలాలను అందించారు.. చివరకు ఏమైంది?..
అసత్యం ఆయన జీవితాన్ని తిరగరాసింది.. ఎంతో కాలం నిజాలను దాచి చివరకు ఒప్పుకున్నా ఫలితంలేకపోయింది. చట్టం దృష్టిలో ఆర్ధిక నేరగానిగా మారిపోయారు. రామలింగరాజు ఉదంతం అందరికీ కనువిప్పు కావాలి.. వ్యాపార అవసరాల కోసం సత్యాన్ని దాస్తే చివరకు చేరేది చెరసాలకే.. దొరికాడు కాబట్టి దొంగ అంటున్నారు.. కానీ ఎందరో దొంగలు దొరల ముసుగేసుకొని దర్జాగా తిరిగేస్తున్నారు.

Satyam ను  తిరగేసి maytas పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు రామలింగ రాజు.. సత్యాన్ని తిరగేయడమే ఆయన జీవితాన్ని మార్చేసిందా?..

Wednesday, April 8, 2015

పాపం చందన కూలీలు

ఎందుకు చంపారు?..
ఎదురు తిరిగారు కాబట్టి చంపాం..
వారు ఎర్రచందన స్మగ్లర్లేనా?..
కొందరు కూలీలు.. కొందరు స్మగ్లర్లు కావచ్చు..
ఇదండీ శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కథ.. ఎవరు దొంగలు, ఎవరు స్మగ్లర్లు, ఎవరు కూలీలో తెలియదు.. కానీ ఒక్కటి మాత్రం చెప్పవచ్చు పొట్టకూటి కోసం ఎర్రచందనం నరికేందుకు తమిళనాడు నుండి వచ్చిన అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారు.. వారిని అక్కడికి పంపినవారు సేఫ్.. విలువైన అటవీ సంపదను కాపాడుకోవడంలో తప్పులేదు.. కానీ కాస్త విచక్షణ కూడా అవసరం.. ఎర్రచందన వ్యవహారం నడిపిస్తున్నవారు ఎవరు?.. ఈ స్మగ్లర్లకు రాజకీయ అండదండలు లేకుండానే ఇంతగా బరి తెగించారా? వారంతా భద్రంగా ఉన్నారు.. కూలీలు మాత్రం చచ్చారు..

విచక్షణ లేని పోలీసుల బుర్రల కారణంగా తమిళనాడుతో వివాదం తెచ్చుకోవాల్సి వచ్చింది.. అక్కడి తలతిక్క నాయకులు ఏకంగా తెలుగువారిని టార్గెట్ చేసేందుకు ఉసిగొల్పుతున్నారు.. శేషాచలం ఎన్ కౌంటర్ వెనుక నిజానిజాలు తేలాలి.. 

అలసత్వమే ఉగ్రవాదానికి ఊతం..

ప్రభుత్వాల అలసత్వమే ఉగ్రవాదానికి ఊతం.. కఠినంగా వ్యహరించాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం ఉపేక్షించినా నెత్తికెక్కి కూర్చుంటారు ఉగ్రవాదులు.. భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర చెబుతున్న సత్యం ఇది.. తెలంగాణ ఇందుకు భిన్నం కాదు..
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి ఇద్దరు పోలీసులను చంపి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత హోంమంత్రి  చేసిన బాధ్యతా రహిత ప్రకటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.. అది దోపిడీ దొంగల పని, వారు ఉగ్రవాదులు కాదన్నారు.. జానకీపురంలో పోలీసులు సమర్థంగా వ్యవహరించి నేరగాళ్లను మట్టు బెట్టిన తర్వాత కూడా హోంమంత్రి పల్లవి మారలేదు.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతీయొద్దు అనే కోణంలో మాట్లాడారు.. ఇంట్లో కంపు పెట్టుకొని మా ఇంటికి రండి అంటూ అతిథులను ఆహ్వానించగలమా?
చేతిలో సరైన ఆయుధాలు లేకుండానే ఉగ్రవాదుల వేట సాగించి, సహచరులను పోగొట్టుకున్నారు పోలీసులు.. అయిన వెనుకాడలేదు.. తుదిదాకా పోరాటం సాగించి వారిని హతమార్చారు. ప్రజలచే జేజేలు కొట్టించుకున్నారు. అదే ఊపులో కరడు గట్టిన ఉగ్రవాది వికారుద్దన్ గ్యాంగ్ పోలీసుల ఎస్కార్ పార్టీ చేతిలో హతమైపోయింది.. తెలంగాణ పోలీసులు ప్రజల దృష్టిలో హీరోలుగా అభినందనలు పొందుతున్నారు.
ప్రభుత్వం ముందుగానే అప్రమత్తంగా ఉంటే ఉగ్రవాదులు ఇంతగా బరి తెగించేవారా? ఓటు బ్యాంకు రాజకీయాలతో టాడా వంటి కఠిన చట్టాలను చెత్తబుట్టలో పడేసిన ఘనత మన ప్రభుత్వాలది. ఎక్కడ ఏ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో పోలీసులు చాలా విషయాల్లో చేతులు ముడుచుకు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేటలో సీఐ దగ్గర సమయానికి ఆయుధం అందుబాటులో లేదట.. మిగతా పోలీసుల దగ్గర ఆయుధాలు లేదు.. ఉగ్రవాదులను వీరోచింతంగా వెంటాడిన మరో పోలీసు అధికారి తుపాకీ మొరాయించి విధిలేక వెనుదిరిగాడు. ఇదంతా ఒక ఎత్తయితే కాశ్మీర్లో మరణించిన ఓ జవానుకు స్వస్థలం పాలమూరు జిల్లాలో అంత్యక్రియల సందర్భంగా గౌరవవందనం సమర్పిస్తుండగా పేల్చాల్సిన తుపాకులు మొరాయించాయి.. ఏమిటీ దురవస్థ..

మన పోలీసు వ్యవస్థను న్యూయార్క్, సింగపూర్ రేంజికి తీసుకుపోవాలన్న పాలకుల ఆశయంలో తప్పులేదు.. వారికి సరికొత్త వాహనాలు ఇస్తే చాలదు.. ఆధునాతన ఆయుధాలు, శిక్షణ కూడా అవసరం.. రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఇవ్వాలి. అలాగే మన చట్టాలను పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఉగ్రవాదులపై పోరులో వీర మరణం పొందిన నల్లగొండ పోలీసులకు ఘనంగా నివాళులర్పిద్దాం..

Monday, April 6, 2015

బీజేపీకి 35 ఏళ్లు..

దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 35 పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టింది. బీజేపీ.. బురదలో పుట్టిన కమలం అని ఈసడించారు ప్రత్యర్ధులు.. అయితే రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని ధీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు.. జాతీయవాద రాజకీయ పార్టీగా, వారతస్వ రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న బీజేపీ ప్రస్థానం అంత తేలికగా సాగలేదు.. ఎన్నో ఆటు పోట్లను చవిచూసింది.. బీజేపీ ప్రస్థానం సంక్షిప్తంగా పరీశీలిద్దాం..
భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం భారతీయ జన సంఘ్.. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నామ రాజకీయ పార్టీ అవసరం అని భావించారు ప్రముఖ శ్యామప్రసాద్ ముఖర్జీ. 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో ప్రభావితులైన జాతీయ వాదులు ఆ పార్టీలో చేరారు.  ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు.. 1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జన సంఘ్ 3 సీట్లే సాధించినా, 1971 ఎన్నికల నాటికి 22 సీట్లలో ధీటైన ప్రతిపక్షంగా రూపొందతింది. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెర్సీ విధించిన తర్వాత ప్రతి పక్షాలన్నీ ఒకటి కావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది.. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం.. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గ కుమ్ములాటలలో ఎక్కువ కాలం నిలవలేదు ఈ ప్రభుత్వం.. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై వత్తిడి తెచ్చారు..  దీంతో జనసంఘ్ నాయకులంతో జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీని ప్రారంభించారు.
అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.. దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ హత్యానంతం జరిగిన 1984 పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి.. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ పార్టీని ముందుకు నడిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది.. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇచ్చింది.. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృత్తమై ఈ ప్రభుత్వం పతనమైంది. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు.. కానీ తొలివిడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణిచడంతో తదుపరి పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 120 సీట్లు వచ్చాయి..

1996లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లును కైవసం చేసుకున్నా కనీస మెజారిటీ రాలేదు.. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజపేయి..  బీజేపీకి అంటరాని పార్టీగా చూస్తున్న రోజులు అవి.. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆతర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ ఘోరంగా వైఫల్యమైంది.. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఏ)ను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే అర్ధనంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్కఓటుతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటల్జీ నేతృత్వంలో ఐదేళ్లు విజయవంతంగా సాగిన ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పధంలో అద్భుత విజయాలను సాధించింది.. కానీ మితిమీరిన అంఛనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఒటమి పాలైంది.. పదేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అఖండ మెజారిటీని అసాధించింది. ఈ ఘనతకు కారకుడు నరేంద్ర మోదీయే.. దేశ ప్రజల మనసును చూరగొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు..

శేఖర్జీ ఆత్మీయ సత్కార సభలో..

నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన పేరాల శేఖర రావు గారి ఆత్మీయ సత్కార సభలో మా మిత్ర బృందం.. నాతో పాటు శ్రీనివాస రావు అవ్వారు, రవిశంకర్ చావలి, చెరుపల్లి బాలకృష్ణ, జనబంధు నాగేందర్, భాస్కర్ మాకం తదితరులు..


Saturday, April 4, 2015

ఇదీ మన మీడియా తీరు..

నిజం నిద్రలేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు. మన జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్న మీడియా అసలు విషయాలను దాచి పెడుతోంది. ఈ ద్వంద్వ వైఖరిని ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రిగారు ఇవాళటి 'వీక్ పాయింట్'లో చక్కగా ఎండగట్టారు. 

రామభక్త హనుమాన్ కీ జయ్..


Thursday, April 2, 2015

కలం లేనివాడు పాత్రికేయుడేనా?

సర్ కాస్త పెన్నిస్తారా?.. అన్నా జర పెన్నిస్తవా?.. ఈ అడుక్కోవడాలు వినీ వినీ చిరాకేస్తోంది.. ఏ బ్యాంకులోనో, రిజర్వేషన్ కౌంటర్ దగ్గరో ఎవరైనా పెన్ అడిగితే అర్ధం చేసుకొని ఇవ్వొచ్చు.. కానీ విచిత్రంగా ఇటీవల పెన్నులు అడుగుతున్నది తోటి జర్నలిస్టులే.. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది..
యుద్ధానికి వెళ్లే సైనికునికి ఆయుధం లేకపోతే ఎలా ఉంటుంది?.. జర్నలిస్టుకు కలం లేకపోతే అలాగే ఉంటుంది.. కానీ సొంతంగా పెన్ను కొని దగ్గర పెట్టుకోలేని కటిక పేద జర్నలిస్టులు ఎక్కువైపోయారు.. ఓ పెన్ను దగ్గరుంచుకుంటే నీ సొమ్మేం పోయిందయ్యా అంటే, మర్చిపోయొచ్చానని అందమైన అబద్దం చెప్పేస్తారు.. డబ్బాల కొద్దీ సిగరెట్లు ఊదేస్తారు.. కప్పుల కొద్ది టీలు లాగిస్తారు.. పీపాల కొద్దీ మందు ఖతం చేస్తారు.. కానీ సొంతంగా పెన్ను దగ్గర పెట్టుకోవడంలో వీరికి నామోషీ ఎందుకు వస్తోందో తెలియడం లేదు..
వాళ్లు అడిగేది పెన్నే కదా.. ఇస్తే పోలా.. ఎందుకింత రాద్దాంతం అంటున్నారా?.. ఇవ్వచ్చు కానీ ఎంత మందికని ఇచ్చేది.. వారికి పెన్ను ఇచ్చినా, పని అయిపోయాక తిరిగి ఇస్తారన్న గ్యారంటీ లేదు.. ఆ పెన్ను ఎక్కడో పోగొట్టుకొని మళ్లీ మరునాడు యధావిధిగా ఎలాంటి నామోషీ లేకుండా పెన్ను అడిగేస్తున్నారు.. ఇలాగైతే లాభం లేదని నిర్ణయించుకున్నా.. మిత్రుడు శ్రీ చమన్ మధు సలహాతో వినూత్న ఆలోచన అమలులో పెట్టేశాను..
ఆఫీసులో యధావిధిగా పెన్ను అడిగాడో మిత్రుడు.. ఓ పది రూపాయలుంటే ఇస్తావా అని అడిగాను.. ఎందుకూ అంటూ ఇచ్చాడు.. ఆ పది జేబులో పెట్టుకొని రెండు బాగా రాసే అర్డినరీ పెన్నులు ఇచ్చాను.. నేను చేసిన పనికి అవాక్కయ్యాడా మిత్రుడు.. ఏమిటిది అన్నాడు.. అదంతే జర్నలిస్టుగా నీ బాధ్యతారహితంగా పెన్నులేకుండా వచ్చినందుకు అపరాధ రుసుం అని చెప్పేశాను.. మొహం మాడ్చుకొని వెళ్లిపోయాడు.. అలా ఇద్దరు ముగ్గురుకు షాక్ లు తగిలేసరికి నన్ను పెన్ను అడగటం మానేశారు.. మిత్రుడు మధు ఐడియా నచ్చితే మీరూ ఆచరణలో పెట్టండి..

ఒక్క జర్నలిస్టులే కాదు.. సమాజంలో చదువుకున్న ప్రతి నాగరికుడు విధిగా జేబులో పెన్ను పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.. ఎంత డిజిటల్ యుగం వచ్చినా కలం అవసరం తప్పని సరి..