Wednesday, April 15, 2015

అమంగళ డీకే..

మంగళం అంటే శుభప్రదం.. మంగళ సూత్రానికి భారతీయ సంస్కృతిలో, హిందూ మతం పవిత్ర స్థానం ఉంది.. మరి మంగళ సూత్రం తెంచడం అంటే.. అమంగళం, అశుభప్రదం కాదా?.. తమిళనాట కొందరు మతిలేని వారు చేస్తున్న పనేమిటి?.. హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని వ్యతిరేకించడమే వారి పని..
మంగళ సూత్రాన్ని తెంచేయడం అనే వెర్రి కార్యక్రమం నిర్వహించింది ద్రవిడ కజగం(డీకే).. అదృష్ట వశాత్తు ఈ కార్యక్రమానికి స్పందన పెద్దగా లేదు.. పాల్గొన్న 25 జంటలు కూడా ఆ పార్టీ కార్యకర్తలే.. అందునా నాస్తికులు(?) వారంతా హిందూ మత వ్యతిరేకులే.. అయినా ఏదో జరిగిపోయింది, వందలు, వేల సంఖ్యలో జనం తాళి తెంచేశారు అన్నట్లు ప్రచారం జరిగిపోయింది.. మీడియాలో పబ్లిసిటీ ద్వారా ఉనికిచి చాటు కోవాలనే డీకే అధ్యక్షుడు వీరమణి పైశాచిక ఎత్తుగడ మాత్రం ఫలించింది. న్యాయస్థానం ఎక్కడ నిరాకరిస్తుందో అనే భయంతో ఉదయం పది గంటలకు జరగాల్సిన తాళి తెంచు కార్యక్రమాన్ని ఏడు గంటలకే పూర్తి చేసుకోవడం వీరి దొంగచాటు వ్యవహారానికి, దివాళాకోరు విధానానికి నిదర్శణం..
తాళి తెంచు కార్యక్రమం పెరియార్ ఆశయాల సాధనలో భాగమట(?).. మరి ఇందు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఎందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు.. పైగా ఇదే రోజు సాయంత్రం గోమాంస భక్షణ అనే మరో కార్యక్రమం తలపెట్టారు. అదృష్ణవశాత్తు న్యాయవ్యవస్థ, ప్రభుత్వం ఆలస్యంగా అయినా స్పందించడంతో ఆగిపోయింది. బాబాసాహెబ్ జయంతికి, తాళి తెంచుడు గోమాంస భక్షణకు ఏమిటి సంబంధం? ఎందుకు ఆ మహనీయుని జయంతి నాడు ఈ అపవిత్ర కార్యక్రమం తలపెట్టారు?

ద్రవిడ కజగం ఒక హిందూ వ్యతిరేక పార్టీ మాత్రమే కాదు.. దేశ సమైఖ్యతను దెబ్బతీయడమే వారి లక్ష్యం.. అందుకే మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలను తరచూ చేస్తూనే ఉంటుంది.. గతంలో పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంపై దాడి చేసి ధ్వంసం చేసింది ఎవరు?.. మన దేశానికి శత్రువు, రాజీవ్ హంతకులైన ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈకి బాహటంగా మద్దతు ఇచ్చింది ఎవరు?.. తాజాగా శేషాచలం ఎన్ కౌంటర్ సాగుతో తమిళనాట తెలుగువారిపై దాడులను ప్రోత్సహించింది ఎవరు?.. అసలు డీకే పార్టీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు? దేశ సమైఖ్యతను దెబ్బతీసే ఇలాంటి దుష్టశక్తులను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment