Friday, April 10, 2015

సత్యం అసత్యమైన వేళ..

సత్యం వద ధర్మం చర.. ఇది మన ఉపనిషత్తుల్లోని సూక్తి ముక్తావళి. ఆయన సత్యాన్ని వధించారు.. ధర్మాన్ని తప్పారు.. చివరకు చెరసాలపాలయ్యారు..
ఆయన స్థాపించిన సంస్థ సత్యం.. ఇంటి పేరే మారిపోయి సత్యం రామలింగరాజు అయ్యాయి. తన సంస్థను అగ్రగామిగా నిలిపారు. వేలాది మందికి ఉపాధి అవవకాశాలు కల్పించారు.. ఎన్నో సామాజిక, దాతృత్వ సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోనే తొలిసారిగా 108 అత్యవసర సేవలకు నాంది పలికారు. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శుద్ధ జలాలను అందించారు.. చివరకు ఏమైంది?..
అసత్యం ఆయన జీవితాన్ని తిరగరాసింది.. ఎంతో కాలం నిజాలను దాచి చివరకు ఒప్పుకున్నా ఫలితంలేకపోయింది. చట్టం దృష్టిలో ఆర్ధిక నేరగానిగా మారిపోయారు. రామలింగరాజు ఉదంతం అందరికీ కనువిప్పు కావాలి.. వ్యాపార అవసరాల కోసం సత్యాన్ని దాస్తే చివరకు చేరేది చెరసాలకే.. దొరికాడు కాబట్టి దొంగ అంటున్నారు.. కానీ ఎందరో దొంగలు దొరల ముసుగేసుకొని దర్జాగా తిరిగేస్తున్నారు.

Satyam ను  తిరగేసి maytas పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు రామలింగ రాజు.. సత్యాన్ని తిరగేయడమే ఆయన జీవితాన్ని మార్చేసిందా?..

No comments:

Post a Comment