ఆట
మళ్లీ మొదలైంది.. ఏమో గుర్రము ఎగురనూ వచ్చు అన్నదే వారి ఆశ.. కొత్త సీసాలో పాత
కాక్ టైల్.. పేరు, జెండా తర్వాత అట.. ప్రస్తుత ఎజెండా మాత్రం ఒకటేనట.. అదే బీజేపీ
వ్యతిరేకత.. ఇందు కోసం గతంలో ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో, అదే కాంగ్రెస్ తో
అంట కాగేందుకు రెడీ.. జనతాదళ్(యు)+జనతాదళ్(ఎస్)+ఆర్జేడీ+సమాజ్
వాదీ+ఐఎన్ఎల్డీ+సమాజ్ వాదీ=జనతా పరివార్(?)
ఒకాయన
ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు.. మరొకాయన కులాల కుంపటితో చలి కాచుకుంటుంటాడు.. ఇంకొకాయన
పశువుల పొట్టగొట్టి తానే గడ్డి మేసేశాడు.. మరొకరు ప్రస్తుతం జైలులో కాలక్షేపం
చేస్తున్నాడు.. అవతలి వాడికి రెండు కళ్లు పోవాలని కోరుకుంటూ తన కంటినే పొడుచుకునే
రకం ఇంకో పెద్ద మనిషి.. అవునవును ఇలాంటి వారంతా ఒకే పరిపారంలో ఉండటం బెటరు..
కలవడం,
విడిపోవడం, మళ్లీ కలవడం వారికి మామూలే.. ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో
చెప్పరూ.. ఒకరంటే ఒకరికి పడదు.. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గోతులు తవ్వేందుకు
సిద్ధంగా ఉంటారు.. తమ అవకాశవాదంతో రెండు సార్లు అప్పనంగా కాంగ్రెస్ కు అధికారం
అప్పజెప్పారు.. మరోసారి అదే పని చేసేందుకు సిద్దమవుతున్నారు..
ఆరుగురు
వేర్వేరు శత్రులతో పోరాడే బదులు, ఉమ్మడి శత్రువుతో తలపడటం ఈజీ.. రాబోయే ఎన్నికల్లో
బీజేపీకి నెత్తిన పాలు పోసింది ఈ కొత్త అవకాశ వాద పరివార్..
No comments:
Post a Comment