Thursday, April 23, 2015

పాప్ శవ రాజకీయం..

కళ్ళ ముందే ఓ రైతు చెట్టిక్కి ఆత్మహత్య చేసుకుంటున్నాడు.. ఆ నాయకుడు చూశాడు. దిగమని చెప్పలేదు. పైగా చోద్యం చూశాడు.. కథ క్లైమాక్స్ చేరాక కొందరు కార్యకర్తలు చెట్టెక్కి శవాన్ని దించారు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభలో జరిగిన ఘటన ఇది..
రైతు ఆత్మహత్య తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి..
ఆప్ కార్యకర్తలు చెట్లు ఎక్కడంలో శిక్షణ తీసుకోలేదు, అందుకే రైతును రక్షించలేకపోయాం.. ఈసారి అలా జరిగితే కేజ్రీవాల్ తప్పకుండా చెట్టిక్కి రైతును రక్షిస్తారు - అసుతోష్
ఆప్ ర్యాలీని భగ్నం చేసేందుకు బీజేపీ చేసిన కుట్ర రైతు ఆత్మహత్య కుమార్ విశ్వాస్
ఆత్మహత్య చేసుకున్న రైతును కాపాడటంతో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు – కేజ్రీవాల్

వీరి మాటల్లో మానవత్వం ఎక్కడైనా కనిపించిందా?.. రాజకీయం తప్ప.. బహిరంగ సభను నిర్వహించింది ఎవరు? జనాలను పోగుచేసింది ఎవరు?.. కేజ్రీవాల్ కు ప్రసంగ యావ తప్ప రైతును రక్షించాలనే ధ్యాసలేదా? చెట్టు దిగమని రైతును కోరి ఉంటే ఆయన సొమ్మేంపోయేది? నీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాం అని బుజ్జగించే ప్రయత్నం చేశారా?.. ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పించి రాక్షసానందం అనుభవించడమేనా ఆయన చేయగలిగింది?.. తన కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలేదని సిగ్గు విడచి వ్యాఖ్యానించడం తగునా? ఢిల్లీ పోలీసులు ఆయన పరిధిలో లేకపోయినా, కనీసం పోలీసులకైనా ఆదేశాలు ఇచ్చారా రైతును చెట్టునుండి దించమని.. మోదీ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్న మీరు చేసిందేమిటి?.. రైతు ప్రాణం తీసుకోవడం తప్ప..

No comments:

Post a Comment