Friday, January 31, 2014

ఇంకా అడ్డుకోవాలనుకోవడం భ్రమే..

అసెంబ్లీలో మొత్తం సీట్లు 294.. సీమాంధ్ర ప్రాంత సభ్యుల సంఖ్య 175.. తెలంగాణ ప్రాంత సభ్యుల సంఖ్య 119.. అంటే తెలంగాణ వారి కన్నా సీమాంధ్ర సభ్యులు 56 మంది అధికంగా ఉన్నారు..
సీమాంధ్ర సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరిరేకిస్తున్నందున రాష్ట్ర పునర్విభజన బిల్లుకు పట్టే గతేమిటో అందరూ ముందుగా ఊహించిందే.. వరదలో కొట్టుకుపోయే వారికి గడ్డిపోచ దొరికినా అదే ఎక్కవ అనుకుంటారు.. అదే విధంగా అసెంబ్లీ తిరస్కరించటంతో తెలంగాణ ప్రక్రియ ఆగిపోయినట్లు సీమాంధ్ర నేతలు ప్రచారం చేసుకుంటున్నారు..
కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్పష్టంగా చెప్పింది.. ముసాయిదా బిల్లును అసెంబ్లీ అభిప్రాయం కోసమే పంపామని. అసెంబ్లీ తీర్మానమే ప్రాతిపదిక అయితే అసలు తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా?
తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నప్పుడు, కలిసే ఉండాలని వత్తిడి తెచ్చినా, బలవంత పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.. ఇంకా పిడి వాదనలతో తెలంగాణను అడ్డుకోవడం అంటే సమస్యను వాయిదా వేసుకోవడంలాంటిదే.. నాకు ఇరు ప్రాంతాలపై నాకు గౌరవం ఉంది.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు..
పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించాల్సి అవసరం ఉంది.. కేవలం హైదరాబాద్ ను, తెలుగు భాషను సాకుగా చూపి పిడి వాదనలతో తెలంగాణను అడ్డుకోవాలనే కుయుక్తులను కట్టిపెట్టడం మంచిది..

చరిత్ర గతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రాజ్యాల సరిహద్దులు నిరంతరం మారుతూ ఉంటాయి.. తెలంగాణ విషయంలోనూ అంతే.. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పగలమా? తెలంగాణ వారిమైనా, సీమాంధ్రులమైనా ముందు మనం భారతీయులం అనే విషయాన్ని మరచిపోరాదు..

Wednesday, January 29, 2014

పప్పూ ఇక మారడా?

పప్పుకి అంత సీన్ లేదని తాజా టైమ్స్ నౌఇంటర్వూ ద్వారా తేలిపోయింది.. 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీకి న్యాయస్థానాలు క్లీన్ చీట్ ఇచ్చినా ప్రజలు నమ్మరట.. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోతలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదట..  ఈ హత్యాకాండ వెనుక ఉన్న సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్లు ఏ పార్టీ వారు?.. ఢిల్లీ సిక్కులు కాంగ్రెస్ పై ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నారు?.. అసలు స్వర్ణ దేవాలయ సమస్య ఏమిటి? ఇందిరా గాంధీని ఎందుకు హత్య చేశారు? ఈ సమస్యకు మూలమైన బింద్రన్ వాలేనే పెంచి పోషించింది ఎవరు?.. ఈ ప్రశ్నలపై లోతుగా చర్చ జరిగితే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేవి..
తమది దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని రాహుల్ గాంధీ చెప్పుకోవడం.. కాంగ్రెస్ నేతలు అందుకు బాకా ఊదడం పరిపాటి అయిపోయింది.. అయ్యా వీరు ఎవరి కోసం త్యాగాలు చేశారు?.. ఇందిర, రాజీవ్ హత్యలకు కారణమై సంఘటనల వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని ఎందుకు దాస్తారు?.. ఖలిస్తాన్ ఉద్యమానికి కారకుడైన బింద్రన్ వాలేను, శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభాకరన్ ను తయారు చేసింది ఎవరు?.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారికి పోషించింది మీ మహానేతలు కాదా?..
తాను వంశ పారంపర్య పాలనకు వ్యతిరేకమని రాగాసుద్దులు చెబుతున్నారు.. మరి కాంగ్రెస్ పార్టీని అవిచ్చిన్నంగా పాలిస్తున్నది మీ కుటుంబం కాదా? ఆ కుటుంబానికి చెందిన మీరు పార్టీ పగ్గాలు చేపట్టడం వంశ పారంపర్య విధానం కాదా?

ఇంతకీ నేను కాదు, మనం అనే నినాదాన్ని ఎందుకు కాపీ కొట్టారు పప్పూ? సొంత ఆలోచనలు లేవా?

Monday, January 27, 2014

రాజకీయ నాయకులకు తనకు తేడా లేదంటున్నాడు తనిష్క్ ఆభరణాల షాపులో దొంగతనం చేసిన కిరణ్.. 
తాను ఒక రాత్రి దొంగను ఆయితే, నాయకులు ఐదేళ్ళ దొంగలంటున్నాడు కిరణ్.. 
సంచలనం కోసమే తను దొంగతనం చేశానని చెబుతున్నాడు అయన..
లీడర్ అయ్యి చట్ట సభకు వెళ్ళడమే తన లక్ష్యం అంటున్నాడు..
అల్ ద బెస్ట్ కిరణ్..

ఒక ముఖ్య ప్రకటన

మూర్ఖులకు, కుట్రదారులకు చికిత్స చేసేందుకు మానసిక వైద్యులు కావలెను..
కార్యస్థానం: ఢిల్లీ, హైదరాబాద్..
గమనిక: పేషంట్లు ఎవరో ప్రత్యేకంగా చెప్పను.. సదరు డాక్టర్లకు మీరే ఆ పేషంట్లను అప్పగించాలి..

Saturday, January 25, 2014

ఏదైనా సినిమా బాగుంటే, దాని కాపీ కొట్టి కథను అటు ఇటు చేసి మరో సినిమా తీయడం తెలిసిందే.. కాంగ్రెస్  పార్టీ ఇప్పుడు అదే పని చేసి చిక్కుల్లో పడింది. గతంలో నరేంద్ర మోడీ ఉపయోగించిన పోస్టర్ను ఎంత చక్కగా కాపీ కొట్టారో చూడండి.. 
సొంత ఆలోచన లేదా పప్పు..
ఓటు ఒక వరం.. ఒక స్వరం..
దేశ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది..
ఓటరుగా నమోదై గుర్తింపు పొందండి.. ఉత్తమ నాయకులనే ఎన్నుకోండి..
ఓటరు భారత భాగ్య విధాత.. VOTE FOR INDIA
జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు..
ఓవైసీ బ్రదర్స్ వ్యతిరేకిస్తున్నారంటే ఇందులో ఏదో మ్యాటరుందన్న మాట.. అయితే మనం సల్మాన్ భాయ్ కొత్త సినిమా Jai Ho చూడాల్సిందే.. సినిమా చూశాక మళ్లీ స్పందిద్దాం..

Friday, January 24, 2014

ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు.. దిగజారుతున్న పప్పూ (అదే.. రాగా అంటున్నారే ఆయన) ఇమేజీని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్ల నిధిని కేటాయించింది.. అందులో భాగంగా పత్రికల్లో ఎంత భారీ ప్రకటనలు ఇస్తున్నారో చూడండి.. ఎంతైనా తేరగా వచ్చిన స్కాముల సొమ్మే కదా? యువరాజా ఇమేజ్ పెరగడం సంగతేమో కానీ, పత్రికలకు మాత్రం మంచి ఆదాయం పెరుగుతోంది.. ప్రకటనలతో ఇమేజీ పెరగదు.. చేతల్లో చూపించుకోవాలి..

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్జీ జీవితంలో ఐదు తప్పులు..


Thursday, January 23, 2014

‘మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’


ఎప్పడో స్వాతంత్ర్యం వచ్చానా, ఏడు దశాబ్దాల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు ఈనాటికీ భారతీయులను కదిలిస్తోంది.. ఇవాళ ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం..
వీరులకు జననమే కానీ, మరణం ఉండదంటారు.. నిజమే నేతాజీ అమరుడు.. వివాదాలను పక్కన పెడితే, ఆయన ఏనాడో మరణించారంటే చాలా మంది నమ్మరు.. నేతాజీ పోరాట మార్గం గురుంచి ఎవరేమన్నా, ఆయన ఇచ్చిన జై హింద్ నినాదం ఉన్నంత కాలం ప్రతి భారతీయుని హృదయంలో ఉంటారు.. తొలి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయారు నేతాజీ..
సుభాష్ చంద్రబోస్ చాలా కాలం మహాత్మా గాంధీజీపై నమ్మకంతో ఆయన అహింసా సిద్దాంతాన్ని గౌరవించి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.. 20 ఏళ్ల పోరాట కాలంలో 11 సార్లు జైలుకు వెళ్లన ఘనత ఆయనది.. కానీ గాంధీ మాత్రం బోస్ బాబును ఎప్పుడూ అనుమానంగా చూసేవారు.. కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ కన్నా సుభాష్ చంద్రబోస్ ను అభిమానించే వారే ఎక్కవగా ఉండటం ఇందుకు కారణం.. 1938లో బోస్ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘన విజయం సాధిస్తే గాంధీజీ సమర్ధించిన పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షునిగా పని చేసినా, గాంధీ-నెహ్రూల కుట్రలు కుతంత్రాలతో విసిగిపోయారు బోస్ బాబు. చివరకు ఆ పార్టీని నుండి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు..
తదనంతర కాలంలో దేశం నుండి అనూహ్యంగా అదృశ్యమైన సుభాష్ చంద్రబోస్ విదేశాలకు చేరుకొని, బ్రిటిష్ వారి శతృ దేశాల మద్దతు కూడగట్టి ఆజాద్ హింద్ ఫాజ్ ఏర్పాటు చేశారు.. బోస్ పోరాటంలో విజయాలూ, అపజయాలూ ఉన్నాయి.. 18 ఆగస్టు 1945లో జరిగిన విమానం ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతున్నా, ఎలాంటి ఆధారాలు దొరకలేదు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ ఈ విషయంలో విచారణకు ఆసక్తి చూపకపోవడం అనుమానాలకు తావిచ్చింది.. ఏది ఏమైనా భారతీయులు బోస్ ను తమ నేతాజీగా గుర్తించారు.. కాంగ్రెస్ చరిత్రలో కుట్రలు, కుతంత్రాలు లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు తొలి ప్రధానమంత్రి అయ్యేవారు..


Wednesday, January 22, 2014

అరుణ్ జైట్లీ, హరీష్ సాల్వే ముఖాలపై ఉమ్మేస్తాడట.. ఢిల్లీ న్యాయ మంత్రి సోమనాథ్ భారతిది ముద్దు పెట్టుకునేంత సుందర ముఖారవిందం కదూ?.

అరాచకవాది ధర్నా..

ఇద్దరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సెలవు మీద పంపడం కోసం ఢిల్లీ ప్రజలు రెండు రోజులు నరకం అనుభవించాలా?.. ఇది కేజ్రీవాల్ ఆప్ సర్కారు విజయమా?.. సిగ్గు సిగ్గు.. ఇలాంటి వ్యక్తులు మన ప్రజాస్వామ్యానికే చేటు..
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తన అరాచక, సైకో ధోరణితో సాధించదలచుకున్నది ఏమిటి? ఢిల్లీ పోలీసులు తన మాట వినడం లేదని అలికి రోడ్డుపై రెండు రోజులు ధర్నా చేయాలా? కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రజలను అగచాట్లకు గురిచేయాలా?.. రాజ్యాంగపరమై హోదాలో ఉన్న వ్యక్తికి, కేంద్ర ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించుకునే విషయంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.. కానీ కేజ్రీవాల్ తక్షణ రాజకీయ లబ్ది పొందాలనే ఆరాటంలో ఉన్నాడు.. అందుకే ఈ ఢిల్లీ ధర్నా..
రిపబ్లిక్ డే వేడుకల కన్నా, తన ధర్నానే ముఖ్యమంటాడీ క్రేజీ.. అది వీఐపీలు మాత్రమే పాల్గొనే ఉట్టి లక్క పిడతల ఊరేగింపు అంటాడు.. దేశ సైనిక శక్తి సామర్ధ్యాలు చాటే వేడుకలను ఎలా అవమానించాడో చూడండి.. దేశ ప్రజలు రిపబ్లిక్ డే వేడుకల బదులు, ఈయనగార జిడ్డు మొహాన్ని లైవ్లో చూసి సంబరపడాలనుకుంటున్నాడా?
రెండు రోజుల కేజ్రీ రోడ్ షోతో ఇబ్బందులు పడి విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు తిట్ల దండకం మొదలు పెట్టేసరికి ఆప్ అదిరిపోయింది.. ఇక తప్పని సరి పరిస్థితి ఏర్పడటంతో అవమానకర పద్దతిలో ధర్నా విరమించింది.. నలుగురు పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలనే డిమాండ్తో ప్రారంభమైన ధర్నా ఇద్దరు ఎస్.హెచ్,వో.లను సెలపైపై పంపడంతో రాజీ పడిపోయింది.. ఇది ఢిల్లీ ప్రజల విజయం అని సిగ్గులేకుండగా సమర్ధించుకుంటున్నాడు గజిబిజివాలా...
దసరా బుల్లోడు.. దేవదాసు.. బుద్దిమంతుడు.. అన్నీ ఆయనే.. ఇక ఆయన శాశ్వతంగా వెళ్లిపోవడంతో తెలుగు వెండితెర చరిత్రలో తొలి అధ్యాయం ముగిసింది.. తెలుగు ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..

Tuesday, January 21, 2014

చరిత్రకు వక్రభాష్యాలు వద్దు..

రాష్ట్ర విభజన పుణ్యమా అని కొత్త చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సి వస్తోంది.. అసెంబ్లీ రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా హైదరాబాద్ చరిత్రకు కొత్త భాష్యం చెబుతున్నారు మన నాయకులు..
నిరంకుశ పాలకుడైన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ విషయంలో ఎలాంటి సానుభూతి చూపాల్సి అవసరం లేదు.. ఆయన ప్యూడల్ పాలన, రజాకార్ల రక్త చరిత్ర అందరికీ తెలుసు.. తెలియని వారు ఇంకా బతికే ఉన్న మన తాతయ్యలను అడిగితే చెబుతారు.. ఈ విషయాలను పక్కన పెడి
తే చరిత్రకు వక్ర భాష్యం చెబుతున్న తీరు అత్యంత విచారకరం.. అసలు వీరికి చరిత్ర తెలుసా? తెలిసినా తమ స్వార్ధ ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారా? ఒకసారి గమనించండి...
400 ఏళ్ల పాలనలో నిజాం సికింద్రాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేస్తే, 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ ను మొత్తం అభివృద్ధి చేశాను.. సింగపూర్ తో సమానంగా.. చంద్రబాబు నాయుడు
(బాబు గారూ మీరు పుట్టి, హైదరాబాద్ రాక ముందే ఇది ఎంతో అభివృద్ధి చెందింది చరిత్ర చదవండి.. సికింద్రాబాద్ బ్రిటిష్ వారి పెత్తనంలో ఉండేది, నిజాములకు సంబంధం లేదు)
నిజాం ప్రభువును పొగిడేందుకు గర్వ పడతాను, ఆయన నిజమైన సెక్కులరిస్టు అక్బరుద్దీన్ ఓవైసీ
(అవును మీరు రజాకార్ వారసులు కదా గర్వపడక ఏమి చేస్తారు.. నిజాం పాలనలో హిందువులపై జరిగిన అరాచకాలకు ఎందుకు విచారిస్తారు లెండి..)
తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం వెనుక కుట్ర దాగి ఉండి.. దొడ్డి కొమరయ్య నేలకొరుగుతూ జై ఆంధ్ర మహా సభ అన్నాడు పయ్యావుల కేశవ్
(అవునవును మీ దృష్టిలో ప్రత్యేక రాష్ట్రం కోరడం కుట్ర కిందే లెక్క.. అది సరే కానీ కొమరయ్య విషయంలో కొత్తగా పరిశోధన చేసిన మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే.. ఇంకా నయం జై తెలుగు దేశం అనలేదు..)
సీడెడ్ జిల్లాలను నిజాం అమ్మేయలేదా? ధూలిపాళ్ల నరేంద్ర
(అయ్యా నిజాం సీడెడ్ ను అమ్మేయలేదు.. సైన్య సహకార పద్దతిలో భాగంగా  బ్రిటిష్ సైన్యం రక్షణ స్వీకరించిన నిజాం బకాయిలను చెల్లించడనందుకు వారు లాగేసుకున్నారు.. కోస్తా జిల్లాల విషయమూ అంతే)
నిజాం పాలనలో బానిసత్వం, నిరంకుశత్వం, బానిసత్వం, అణచివేత ఉండొచ్చు కానీ అభివృద్ధి కూడా జరిగింది.. ఈటెల రాజేందర్ (నిజాంను పొగడటం, ఎందుకు సన్నాయి నొక్కులు ఎందుకు?)
మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన నిజాం దుర్మార్గుడు.. అతన్ని పొగడటం అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించడమే మోత్కుపల్లి నర్సింహులు
కొన్ని మంచి పనులు చేసినంత మాత్రాన నిజాం మంచి వాడంటే, బ్రిటిష్ వారిని ఏమనాలి జూలకంటి రంగారెడ్డి
తుపాకుల సామర్ధ్యం పరిశీలించడానికి 86 మందిని చంపిన దుర్మార్గుడు నిజాం యెండల లక్ష్మీనారాయణ
(భేష్.. ఈ ముగ్గురు నాయకులు వాస్తవంగా మాట్లాడారు.. మిగతావారు వీరిని చూసి నేర్చుకోవాలి)
ఇది నా దృష్టిలో పడిన వ్యాఖ్యలకు స్పందన మాత్రమే.. ఇంకా ఏవైనా ఉంటే దీనికి కలుపుకోవాలని మిత్రులకు మనవి.. 

టీఆర్ఎస్ అయినా, ఎంఐఎం అయినా నిజాం భజనను ఏమాత్రం అంగీకరించలేం.. నిజాం నవాబు అంత గొప్పోడు అయితే ఆయన పాలనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం సాగినట్లు?.. పోలీస్ యాక్షన్ ఎందుకు జరిగినట్లు.. మా నిజాము రాజు తరతరాల బూజు అని దాశరధి కృష్ణమాచార్య చెప్పింది మరిచిపోయారా? ఒక పాలకుడుగా, పాలనా అవసరాల దృష్ట్యా అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడు.. అది వారి తప్పనిసరి విధి.. కొన్ని మంచి పనులను చూపించి ఏకంగా నిజాం భజన చేయడం సహించరాని విషయం.. చరిత్రను ఇష్టానుసారం వక్రీకరించుకోవడం సహించరాని విషయం.. ముందు వాస్తవ చరిత్రను అధ్యయనం చేసి మాట్లాడండి.. నిజాం భజన ఆపి రాష్ట్ర విభజన సవ్యంగా జరిగేలా చూడండి చాలు..

Saturday, January 18, 2014

సామాజిక మీడియా కాపురాల్లో చిచ్చు పెడుతుందా? నాణేనికి బొమ్మా బోరుసుల్లా, టెక్నాలజీని ఉపయోగించు కోవడంలో కూడా పరిమితులు ఉంటాయని గ్రహించండి. సామాజిక మీడియా మీ వ్యక్తిగత  జీవితాల్లో చొరబడకుండా చూసుకోండి.. శశి ధరూర్ - సునంద ఎపిసోడ్ అందరికీ కనువిప్పు కావాలి..

మరి మీరేం చేస్తారు?

దేశ ప్రజల 'నమో' జపానికి జడుస్తున్న 'రాగా'బాకాలు శృతి తప్పుతున్నాయి.. ఒకనాటి చాయ్ వాలా దేశాన్ని పాలించే స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేని 'అయ్యోరు' ఎన్నికల తర్వాత తమ స్థానం ఎక్కడుంటుందో ఆలోచించుకుంటే మంచిది.. ఛాయ్ అమ్మే స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎగిదిగన వారికి ఎక్కడైనా గౌరవం ఉంటుంది.. మరి అత్యున్న స్థాయి నుండి కిందికి పడిపోతున్న మీ స్థానం ఏమిటి?.. మిమ్మల్ని ఎవరు గౌరవిస్తారు?..  

Friday, January 17, 2014

వచ్చే ఎన్నికల్లో ఏమి చేసినా పప్పులుడకవని అమ్మోరికి తెలిసిపోయింది.. అందుకే 'పప్పూ'ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు జంకుతున్నారు..   

దైవం ముందు అందరూ సమానులు కాదా?

ప్రపంచంలో ఏ మతంలో అయినా? దేశంలోని ఏ దేవాలయంలో అయినా దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేసింది టీటీడీ.. అదీ వారి గొప్పదనం..
భగవంతుని ముందు అందరూ సమానం అంటారు.. మరి ఈ వీఐపీలు ఎవరు?..తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకీ వివక్షను పాటిస్తోంది?..
ఈ గద్దల(పెద్దలు)కు రెడ్ కార్పెట్ పరచి దైవ దర్శనం చేయిస్తూ, సామాన్య భక్తులను క్యూలైన్ కంపార్ట్మెంట్లలో గంటలు, పూటలు, రోజుల తరబడి బంధించడం ఎందుకు?.. వారేమైనా ఖైదీలా? ఉగ్రవాదులా?.. అన్నింటినీ ఓర్చుకొని స్వామి వారి ముందుకు పోయాక దూరం నుండే కనిపించీ కనిపించ ముందు తోసేస్తారు?
వైకుంఠ ఏకాదశి నాడు దైవ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు, టీటీడీ చేతగాని, వివక్షా పూరిత విధానాల కారణంగా అగచాట్లకు గురయ్యారు.. దేవున్ని చూపించలేదనే బాధతో నిరసనకు దిగితే వారిపై పోలీసు కేసులు పెట్టారు? విమర్శలు రావడంతో జడిసి ఉపసంహరించుకున్నారనుకోండి.. విచ్చల విడిగా వీఐపీ టికెట్ల పంపిణీ, బ్లాక్ లో విక్రయాలు జరిగినా తమకు సంబంధం లేదని భావిస్తోందా బోర్డు..
తిరుమల క్షేత్రంలో అన్యతమ ప్రచారం జరుగుతున్నా పట్టించుకోరు.. మద్య మాంసాలు, గుట్కా సిగరెట్లు కొండపైకి వస్తున్నా, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నా తెలియనట్లు నటిస్తారు.. అసలు ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మందికి శిక్షలు పడ్డాయనే లెక్కా పత్రం లేనేలేదు.. శ్రీవారి పాదాల చెంతనే అన్యమత విశ్వ విద్యాలయం ఏర్పాటవుతున్నా? ఉగ్రవాదాలు సంచార జాడలకనిపిస్తున్నా టీటీడీ తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది..
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది ధర్మ పరిరక్షణకా?.. విచ్చిన్నతికా?.. కేవలం వీఐపీల సేవలు, సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయం, ఆదాయం పెంచుకునేందుకే బోర్డు పరిమితమా?.. ఇంత మాత్రానికి టీటీడీ ఎందుకు? ప్రయివేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పేస్తే పోలా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలి.. అది ముందుగా వీఐపీ సేవలను రద్దు చేయడం ద్వారానే సాధ్యం.. కేవలం పీఠాధిపతులు, దేశ, రాష్ట్ర పాలకులకు మాత్రమే నేరుగా దర్శనం కలిపించాలి.. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, నటులు, వ్యాపార వేత్తులు ఎంతటి ప్రముఖులైనా సరే క్యూలైన్లో భగవంతున్ని దర్శించుకోవాల్సిందే..

Thursday, January 16, 2014

మనకు ప్రచార ఆర్భాటాల ఆమ్ ఆద్మీలు వద్దు.. ప్రజల కష్టాలు తీర్చే 'కామ్ ఆద్మీ'లు చాలు.. ఆలోచించండి.. 
ఈ శీతాకాలంలో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చలి నమోదైంది.. మన దేశంలో కాశ్మీర్, హిమాచల్ రాష్ట్రాల్లో ఏకంగా మంచు కురిసింది.. ఉత్తరాది రాష్ట్రాలో ఉష్ణోగ్రత్తలు దారుణంగా పడిపోయాయి.. మన రాష్ట్రంలోని లంబసింగి పరిస్థితి తెలిసింది.. ఇక హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో ఇటీవల ఉదయం 8-9 గంటలకు సైతం పొగమంచు తొలగని పరిస్థితులు కనిపించాయి.. అలాంటి ఒక చిత్రాన్ని గమనించండి.. హైదరాబాద్-కరీంనగర్ రోడ్డులో కారులో వెళుతూ అనుకోకుండా తీసిన ఫోటో ఇది..

Wednesday, January 15, 2014

సామాజిక మీడియా మిత్రులారా..
దాదాపు మూడేళ్లుగా నేను ఫేస్ బుక్ ద్వారా మీ అందరికీ దగ్గరయ్యాను.. తెలుగు భాషలో ఫేస్ బుక్ వాడకాన్ని పెంచాలనే ఆశయంతో పని చేస్తూ వచ్చాను.. నా మాదిరిగానే చాలా మంది మన మిత్రులు ఇందులో విజయం సాధించారు.. అయితే ట్విట్టర్ లో తెలుగు వాడకం అంతగా లేని విషయాన్ని కాలంగా గమనిస్తూ వచ్చాను.. నాకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నా చాలా కాలంగా వాడకంలో లేదు.. ఇప్పడు దాన్ని పునరుద్దరించాను.. సీనియర్ జర్నలిస్టు నవీన్ (రాజమండ్రి) గారు ట్విట్టర్లో తెలుగులోనే ట్వీట్ చేస్తుండటం ఆనందాన్నిచ్చింది.. ఇకపై నేను సైతం ఫేస్ బుక్ తో పాటుగా ట్విట్టర్ లో నా అభిప్రాయాలను మీతో పంచుకుంటానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.. మీరు కూడా ట్విట్టర్ అకౌంట్లు తెరిచి తెలుగు భాషలో ట్వీట్స్ చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.. ట్విట్టర్లో నన్ను అనుసరించాలనుకునేవారు twitter.com/mkdmitra ద్వారా ప్రయత్నించాలని మనవి.
ధన్యవాదాలు

అంజయ్య తాత అవాక్కయిండు.

సంక్రాంతి, ఉగాడి, దసరా, దీపావళి పండుగల తర్వాత రోజు మార్కెట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పత్రికలు కనిపించవు.. ముస్లింల పండుగల తర్వాత రోజు ఉర్దూ పేపర్లు రావు.. 
తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు రాని రోజున నేను పడే ఇబ్బందిని చూసి ముసి ముసి నవ్వులు కనిపిస్తాయి అంజయ్య తాత ముఖంలో.. ఎందుకంటే తాతకు ఆ ఇబ్బంది లేదు. పక్కా హైదరాబాది అయిన అంజయ్య తాత తెలుగుతో పాటు ఉర్దూ పత్రికలూ చదవగలడు.. పైగా నువ్వుబీ (కూడ) ఉర్దూ నేర్చుకో బిడ్డా అని ఉచిత సలహా ఒకటి ఇస్తాడు..
ఈసారి హిందువుల సంక్రాంతి, ముస్లింల మిలాద్ ఉన్ నబి ఒకే రోజున వచ్చాయి.. దీంతో మార్కెట్లో అన్ని దినపత్రికలకూ సెలవు..
అందుకే అంజయ్య తాత అవాక్కయ్యిండు..

ఎవరు కామన్ మాన్?

మనోహర్ గోపాలకృష్ణ పారికర్.. చూడటానికి మన పక్కింటి అంకుల్ గానో, బాబాయ్ గానో కనిపిస్తున్నారు కదూ.. ఆయన గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి అనగానే ఇంత సింపుల్ గా ఉన్నారేమిటి అనిపిస్తుంది కదూ..
బాంబే ఐఐటీలో చదువుకున్న మనోహర్ పారికర్ దేశంలోనే తొలి ఐఐటియన్ సీఎంగా గుర్తింపు పొందారు.. గోవాకు రెండో సారి ముఖ్యమంత్రి అయిన పారికర్ సాదాసీదా మనిషి.. ఆడంబరాలకు అతి దూరంగా ఉంటారు.. ఆయన డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది.. జనంలో ఇట్లే కలిసిపోతారు.. నేరుగా వారి దగ్గరకు వెళ్లు సమస్యలను ఆలకిస్తారు.. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.. అతి సాధారణ భద్రతా సిబ్బందితో మామూలు కారులోనో తిరుగుతారు.. అవసరమైతే స్కూటర్ పై ప్రయాణించడానికి కూడా వెనుకాడరు.. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పారికర్ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంతో నిరాడంబరంగా ఉంటున్నారు.. అధికార నివాసం కేవలం సమావేశాలకు విజిటర్లకు పరిమితం..
మరోహర్ పారికర్ గురుంచి మన దేశ ప్రజలకు తెలిసింది చాలా తక్కువ.. ఎందుకంటే ఆయనను సో కాల్డ్ నేషనల్ మీడియా అంతగా పట్టించుకోదు.. ఎందుకంటే ఆయన వారికి అంటరాని పార్టీకి చెందినవాడిలో కనిపిస్తారు కదా.. అంతకంటే కేజ్రీవాల్ మాదిరిగా పబ్లిసిటీ కోసం నిరాడంబరత పేరుతో చిత్ర విచిత్ర వేశాలు వేసి మీడియాను తిప్పుకోడానికి ఇష్టపడరు.. 


Tuesday, January 14, 2014

Monday, January 13, 2014

భోగి మంటల సంబరం..

మూడు రోజుల సంక్రాంతి పండుగ నేటి భోగితో ప్రారంభమయ్యాయి.. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసేవే భోగి మంటలు. కుప్పలు నూర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెము వేడెక్కుతుంది. పిల్లలంతా తెల్లవారు ఝామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు..

Sunday, January 12, 2014

భావసారూప్యత..

ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా పార్టీలకు భావ సారూప్యత ఉందట.. కలిసి పని చేస్తాయట.. అవును నిజమే.. (పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడటంలేదనుకుంటుందట)

యువతకు స్వామీజీ సందేశం..

నవ భారతంలో దేశ ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన మహా వ్యక్తుల్లో స్వామి వివేకానందకే ప్రథమ స్థానం ఇవ్వాలి.. స్వామీజీ జీవించింది చాలా కొద్ది కాలమే. కానీ ఆయన ఇచ్చిన సందేశం తరతరాలకు స్పూర్తి దాయకం.. స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు.. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకత్పమైన మనస్సు అవసరం.. బలమే జీవితం, బలహీనతే మరణం..
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి
తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం, ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..
విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక, ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..

లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి.. లేవండి! మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి..  - స్వామి వివేకానంద

 

Friday, January 10, 2014

మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే బృందంలోని కీలక సభ్యురాలు, భారతదేశ తొలి ఐపీఎస్ అధికారణి కిరణ్ బేడీ  తాను మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు మనసులో మాట బయట పెట్టారు. స్థిర భారత్‌ కోసం, దేశంలో మెరుగైన పాలన కోసం, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి కోసం తన ఓటు బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకేనని కిరణ్‌బేడీ బహిరంగ మద్దతు ప్రకటించారు.
దేశం సుస్థిరంగా ఉండాలంటే అనుభవజ్ఞుడితోనే  సాధ్యమంటూ ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి రహిత భారత్‌ కావాలంటే మోడీకే పట్టం కట్టాలని కిరణ్‌ బేడీ పిలుపునిచ్చారు.
ట్విట్టర్ ద్వారా కూడా కిరణ్‌ బేడీ తమ మద్దతును తెలియజేశారు. మోడీకి ఓటెయ్యాల్సిన ఆవశ్యకతను తెలియ చేశారు. (నా ట్విట్టర్ అకౌంట్లో కిరణ్ బేడీ ట్వీట్ చూడొచ్చు)

కిరణ్ బేడీ మద్దతుతో అన్నా బృందం మద్దతు మోడీకే అనే సంకేతాలు పంపినట్లు అయ్యింది. అవినీతికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం జరుపుతోన్న అన్నా హజారే బృందం అవినీతి రహిత భారత్‌ కోసం మోడీకి మద్దతివ్వడం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆర్మీ మాజీ చీఫ్‌ వికెసింగ్‌ బిజెపిలో చేరనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో కిరణ్‌బేడీ. మోడీకి బహిరంగంగా మద్దతు పలకడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కిరణ్‌బేడీ మోడీకి మద్దతు పలకడాన్ని బిజెపి స్వాగతించింది. ఐపీఎస్‌ అధికారిగా దేశంలో గొప్పపేరు తెచ్చుకున్న బేడీ. మోడీకి మద్దతు పలకడం శుభపరిణామమని వ్యాఖ్యానించింది.
ఈ సంకేతాలు కేజ్రీవాల్‑కు అన్నా బృందం దూరం అయ్యినట్లుగా కనిపిస్తున్నాయి.  

కేజ్రీ బాకాలు..

లోక్ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించగానే, సోకాల్డ్ నేషనల్ మీడియా పప్పూ(రాహుల్ గాంధీ)ని వదిలేసింది. గజిబిజి వాలాను భుజాలకేసుకుంది.. నరేంద్ర మోడీ తర్వాత కేజ్రీనే ప్రజలు ప్రధాన మంత్రిగా కోరుకుంటున్నారట(?).. Preference for PM.. Do you think would make the best PM పేరిట నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో  నరేంద్రమోడీని 58%,  కేజ్రీవాల్ ను 25%, రాహుల్ ను 14
 %  ప్రజలు ప్రధానిగా కోరుకుంటున్నారట.. సర్వేలో 31 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలదని కోరుకుంటున్నారట(?)
ఇక్కడే ఉంది అసలు మతలబు.. ఇటీవలి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లాపడ్డ కాంగ్రెస్ పార్టీకి 2014 పార్లమెంట్ ఎన్నికలపై భయాందోళనలు మొదలయ్యాయి.. నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా నిలువరించే సత్తా పప్పూకి లేదని తేలిపోయింది.. ఢిల్లీలో బీజేపీకి కనీస మెజారిటీ రాకపోవడంతో వారికి కేజ్రీవాల్ ఆశాకిరణంలా కనిపించాడు.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి కేజ్రీని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు..

అసలు కాంగ్రెస్ పార్టీకన్నా ఎక్కువ బాధ సోకాల్డ్ మేధావులకు, జాతీయ మీడియాకు వచ్చింది.. నరేంద్ర మోడీపై నిరంతర యుద్దం కొనసాగిస్తున్న వీరికి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఆయుధంగా దొరికాడు.. ఇంకేం భాజా భజంత్రీలు మొదలు పెట్టేశారు.. కేజ్రీవాల్ దేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన గ్రహాంతర జీవి అన్న స్థాయిలో ప్రొజెక్ట్ చేయడం మొదలు పెట్టారు.. 

Saturday, January 4, 2014

ఈ అసమర్ధ నిర్వాకం చాలదా?..

నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మా పాఠశాలలో వక్తృత్వ పోటీలు జరిగేవి.. ఒకసారి మీరు దేశ ప్రధానమంత్రి అయితే ఏమి చేస్తారు అనే అంశంపై పోటీ జరిగింది..  ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు.. నిరుద్యోగం, పేదరిక నిర్మూళన.. అందరికీ కూడు, గూడు, గుడ్డ.. అందరికీ ఉచిత విద్య..దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బలోపేతం చేస్తాం..’  పోటీలో పాల్గొన్న విద్యార్థులు చెప్పుకొచ్చిన అంశాల సారాంశమిది..
ప్రతి ఒక్కరికీ విజన్ ఉంటుంది.. దాన్ని సాధించేందుకు కష్టపడాలి.. ప్రధాని పదవి కావాలంటే అన్నీ అనుకూలించాలి.. పదవి వస్తే సద్వినియోగం చేసుకోగలగాలి..
కానీ ఎలాంటి ప్రయత్నాలు లేకుండా అప్పనంగా పదవి వచ్చినా చేతగాని తనం ప్రదర్శిస్తే వారిని ఏమనాలి?.. నేనైతే కచ్చితంగా మన్మోహన్ సింగ్అంటాను.. మీకేమైనా అభ్యంతరమా?
ఎప్పుడో కాని నేరు తెరవలేని ప్రధానమంత్రి ఉన్నట్లుండి మీడియాతో మాట్లాడారు.. తాను ఈ పదవిలో ఉండి దేశాన్ని ఎన్నోరకాలుగా ఉద్దరించానని చెబుతూనే ద్రవ్యోల్భనాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయానని అంగీకరించారు. ఇంతకన్నా ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి మన దేశానికి?.. తాను మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోనని మన్మోహన్జీ ప్రకటించారు.. ఇది దేశ ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో మహద్భాగ్యం.. నిజానికి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాదా?..
నిజానికి ఇందులో మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదు.. ఆయన ఇలాగే అసమర్ధంగా ఉండాలనే సోకాల్డ్ గాంధీ కుటుంబం కోరుకుంది.. పీవీ నరసింహారావులా క్రియాశీలకంగా ఉంటే మొదటికే మోసం అని సోనియా భయం.. 2004లో ఏమీ తెలియని సోనియా గాంధీ బదులు ఒక సీనియర్ ఆర్థిక వేత్తగా, దేశానికి సంస్కరణలను పరిచయం చేసిన మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ ప్రధాని కావడావడం దేశానికి మంచిదేనని అందూ భావించారు.. కానీ దేశ ప్రజలు ఇప్పుడు ఇందుకు పశ్చాతాప పడుతున్నారు..
మళ్లీ ప్రధాని పదవి చేపట్టబోనని స్పష్టం చేసిన మన్మోహన్ సింగ్ ఇప్పుడే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది.. అయితే యువనేత పప్పూగాంధీ ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా లేరని భోగట్టా.. పప్పూ తమ భావి ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు.. అసలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కదా? ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి?..

మీ బాధ్యత లేదా?..

నరేంద్రమోడీ ప్రధాని అయితే వినాశనమే అంటున్నారు మన్మోహన్ సింగ్.. మరి గత పదేళ్ల పాలనలో మీరు దేశాన్ని అన్ని విధాలా నాశనం చేయలేదా?.. అహ్మదాబాద్లో ఊచకోతలకు నరేంద్రమోడీ నాయకత్వం వహించారనే అభాండం మోపారు.. కానీ న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు మోడీకి క్లీన్ చీట్ ఇవ్వడం ప్రధానికి కనబడలేదా? ఈ అల్లర్లకే మోడీ బాధ్యత వహించాలని మీరు కోరుకుంటే ఇందిరాగాంధీ హత్యానంతం సిక్కుల ఊచకోతకు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా జరిగిన మత ఘర్షణల మృతులకు ఎవరు బాధ్యత వహించాలి? సోకాల్డ్ గాంధీ కుటుంబం బాధ్యత వహించనక్కరలేదా?

Friday, January 3, 2014

నిన్నటి నినాదమే ఇవాళ్లి విధానం..

కాంగ్రెస్ కే హాత్.. ఆమ్ ఆద్మీకే సాత్..
నిజమే కదా?.. మొత్తానికి ఆమ్ ఆద్మీకే సాత్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గింది.. బలం నిరూపించుకుంది కేజ్రీవాల్ సర్కారే అయినా అది కాంగ్రెస్ సాధించిన విజయమే..
విశ్వాసానికి అనుకూలం 37 ఓట్లు (ఆప్ 28 + కాంగ్రెస్ 7 + జేడీయూ 1 + స్వతంత్ర 1).. వ్యతిరేకం 32 ఓట్లు (బీజేపీ 31 + ఎస్ఏడీ 1)
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవినీతి, అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు..  అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ రాలేదు.. విచిత్రమైన లాజిక్కులు చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.. ఇది అనైతికమే అయినా మీడియా బాజా భజంత్రీల సహకారం ఉండటంతో వ్యతిరేకించే వారి గళం నీరసపడిపోయింది.. మంచినీరు, విద్యుత్ తాయిలాలు చూపించి నెట్టుకొస్తున్నారు.. సామాన్య ప్రజలతో మమేకం కావడమే తెలివైన, ఖర్చులేని ప్రచార ఎత్తుగడ అవలంభిస్తున్నారు..

బీజేపీకి అధికారం దక్కొద్దనే ఏకైన కారణంతోనే కాంగ్రెస్ విధిలేని పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి  మద్దతు ఇస్తోంది.. కేజ్రీవాల్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రజలు అత్యధిక సీట్లు కట్టబెట్టిన బీజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి నీతివంతమైన పాలనతో పాటు తన వాగ్దానాలు అమలుచేసేందుకు ప్రయత్నించవచ్చు కాదా?.. కేజ్రీవాల్ ఎవరి చేతిలో పావో దేశ ప్రజలకు తెలుసు.. కానీ మీడియా కేజ్రీనామ జపం ముందు ప్రస్తుతానికి వినిపించడం లేదు..

Wednesday, January 1, 2014

ప్రకృతికి దగ్గరగా..

2013 సంవత్సరంలో నా చివరి వారాంతం ఇలా గడచిపోయింది.. నగరానికి దూరంగా, ఎంతో ప్రశాంత వాతావరణంలో.. కొమురవెల్లి దగ్గర..

ఇదేనా కొత్త ఏడాది?..

కొత్త సంవత్సరం(అట)..
ఎప్పటిలాగే ఉదయమే లేచి రోడ్డుపైకి వ్యాహ్యాలికొచ్చాను.. రాత్రంతా చిందులేసి సంబరాలు చేసుకున్న జనం ఇంకా నిద్రపోతున్నారు. అదే జనం.. అదే సమాజం.. అవే వార్తలు.. అవే రాజకీయాలు.. అవే సంకుచితాలు.. అవే రుగ్మతలు.. మనుషుల మనస్థత్వాలు ఎక్కడా మారినట్లు కనిపించలేదు..
2013 పోయి, 2014 వచ్చినా ఎక్కడా మార్పు కనిపించలేదు.. బాధ్యతలేని పౌరులు, ప్రభుత్వాలు, పాలకులు, అధికార యంత్రాంగం.. దేశం ఏమైపోతుందనే బాధ ఎవరికీ పట్టదు.. మనం, మన కుటుంబ సభ్యులు బాగుంటే చాలు.. మరి మారింది ఎవరు?..
క్యాలెండర్ తేదీ మారినందుకేనా ఈ పిచ్చి ఆనందం.. వేడుకలు? నిజమైన మార్పుకోసం పని చేయలేమా? నలుగురికీ పనికి వచ్చే పనులు చేయలేమా? సమాజంలో మార్పుకోసం ప్రయత్నించలేమా?..

ఆలోచించండి.. ఆ పని ఈ రోజే ఎందుకు మొదలు పెట్టకూడదు?