Wednesday, January 22, 2014

అరాచకవాది ధర్నా..

ఇద్దరు స్టేషన్ హౌస్ ఆఫీసర్లను సెలవు మీద పంపడం కోసం ఢిల్లీ ప్రజలు రెండు రోజులు నరకం అనుభవించాలా?.. ఇది కేజ్రీవాల్ ఆప్ సర్కారు విజయమా?.. సిగ్గు సిగ్గు.. ఇలాంటి వ్యక్తులు మన ప్రజాస్వామ్యానికే చేటు..
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తన అరాచక, సైకో ధోరణితో సాధించదలచుకున్నది ఏమిటి? ఢిల్లీ పోలీసులు తన మాట వినడం లేదని అలికి రోడ్డుపై రెండు రోజులు ధర్నా చేయాలా? కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రజలను అగచాట్లకు గురిచేయాలా?.. రాజ్యాంగపరమై హోదాలో ఉన్న వ్యక్తికి, కేంద్ర ప్రభుత్వంతో సమస్యను పరిష్కరించుకునే విషయంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.. కానీ కేజ్రీవాల్ తక్షణ రాజకీయ లబ్ది పొందాలనే ఆరాటంలో ఉన్నాడు.. అందుకే ఈ ఢిల్లీ ధర్నా..
రిపబ్లిక్ డే వేడుకల కన్నా, తన ధర్నానే ముఖ్యమంటాడీ క్రేజీ.. అది వీఐపీలు మాత్రమే పాల్గొనే ఉట్టి లక్క పిడతల ఊరేగింపు అంటాడు.. దేశ సైనిక శక్తి సామర్ధ్యాలు చాటే వేడుకలను ఎలా అవమానించాడో చూడండి.. దేశ ప్రజలు రిపబ్లిక్ డే వేడుకల బదులు, ఈయనగార జిడ్డు మొహాన్ని లైవ్లో చూసి సంబరపడాలనుకుంటున్నాడా?
రెండు రోజుల కేజ్రీ రోడ్ షోతో ఇబ్బందులు పడి విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు తిట్ల దండకం మొదలు పెట్టేసరికి ఆప్ అదిరిపోయింది.. ఇక తప్పని సరి పరిస్థితి ఏర్పడటంతో అవమానకర పద్దతిలో ధర్నా విరమించింది.. నలుగురు పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలనే డిమాండ్తో ప్రారంభమైన ధర్నా ఇద్దరు ఎస్.హెచ్,వో.లను సెలపైపై పంపడంతో రాజీ పడిపోయింది.. ఇది ఢిల్లీ ప్రజల విజయం అని సిగ్గులేకుండగా సమర్ధించుకుంటున్నాడు గజిబిజివాలా...

No comments:

Post a Comment