Thursday, January 23, 2014

‘మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’


ఎప్పడో స్వాతంత్ర్యం వచ్చానా, ఏడు దశాబ్దాల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు ఈనాటికీ భారతీయులను కదిలిస్తోంది.. ఇవాళ ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుందాం..
వీరులకు జననమే కానీ, మరణం ఉండదంటారు.. నిజమే నేతాజీ అమరుడు.. వివాదాలను పక్కన పెడితే, ఆయన ఏనాడో మరణించారంటే చాలా మంది నమ్మరు.. నేతాజీ పోరాట మార్గం గురుంచి ఎవరేమన్నా, ఆయన ఇచ్చిన జై హింద్ నినాదం ఉన్నంత కాలం ప్రతి భారతీయుని హృదయంలో ఉంటారు.. తొలి స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయారు నేతాజీ..
సుభాష్ చంద్రబోస్ చాలా కాలం మహాత్మా గాంధీజీపై నమ్మకంతో ఆయన అహింసా సిద్దాంతాన్ని గౌరవించి స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు.. 20 ఏళ్ల పోరాట కాలంలో 11 సార్లు జైలుకు వెళ్లన ఘనత ఆయనది.. కానీ గాంధీ మాత్రం బోస్ బాబును ఎప్పుడూ అనుమానంగా చూసేవారు.. కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీ కన్నా సుభాష్ చంద్రబోస్ ను అభిమానించే వారే ఎక్కవగా ఉండటం ఇందుకు కారణం.. 1938లో బోస్ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఘన విజయం సాధిస్తే గాంధీజీ సమర్ధించిన పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు అధ్యక్షునిగా పని చేసినా, గాంధీ-నెహ్రూల కుట్రలు కుతంత్రాలతో విసిగిపోయారు బోస్ బాబు. చివరకు ఆ పార్టీని నుండి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు..
తదనంతర కాలంలో దేశం నుండి అనూహ్యంగా అదృశ్యమైన సుభాష్ చంద్రబోస్ విదేశాలకు చేరుకొని, బ్రిటిష్ వారి శతృ దేశాల మద్దతు కూడగట్టి ఆజాద్ హింద్ ఫాజ్ ఏర్పాటు చేశారు.. బోస్ పోరాటంలో విజయాలూ, అపజయాలూ ఉన్నాయి.. 18 ఆగస్టు 1945లో జరిగిన విమానం ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతున్నా, ఎలాంటి ఆధారాలు దొరకలేదు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ ఈ విషయంలో విచారణకు ఆసక్తి చూపకపోవడం అనుమానాలకు తావిచ్చింది.. ఏది ఏమైనా భారతీయులు బోస్ ను తమ నేతాజీగా గుర్తించారు.. కాంగ్రెస్ చరిత్రలో కుట్రలు, కుతంత్రాలు లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు తొలి ప్రధానమంత్రి అయ్యేవారు..


No comments:

Post a Comment