కొత్త
సంవత్సరం(అట)..
ఎప్పటిలాగే
ఉదయమే లేచి రోడ్డుపైకి వ్యాహ్యాలికొచ్చాను.. రాత్రంతా చిందులేసి సంబరాలు చేసుకున్న
జనం ఇంకా నిద్రపోతున్నారు. అదే జనం.. అదే సమాజం.. అవే వార్తలు.. అవే రాజకీయాలు.. అవే
సంకుచితాలు.. అవే రుగ్మతలు.. మనుషుల మనస్థత్వాలు ఎక్కడా మారినట్లు కనిపించలేదు..
2013 పోయి,
2014 వచ్చినా ఎక్కడా మార్పు కనిపించలేదు.. బాధ్యతలేని పౌరులు, ప్రభుత్వాలు,
పాలకులు, అధికార యంత్రాంగం.. దేశం ఏమైపోతుందనే బాధ ఎవరికీ పట్టదు.. మనం, మన కుటుంబ
సభ్యులు బాగుంటే చాలు.. మరి మారింది ఎవరు?..
క్యాలెండర్
తేదీ మారినందుకేనా ఈ పిచ్చి ఆనందం.. వేడుకలు? నిజమైన మార్పుకోసం పని చేయలేమా?
నలుగురికీ పనికి వచ్చే పనులు చేయలేమా? సమాజంలో మార్పుకోసం ప్రయత్నించలేమా?..
ఆలోచించండి..
ఆ పని ఈ రోజే ఎందుకు మొదలు పెట్టకూడదు?
No comments:
Post a Comment