Friday, January 17, 2014

దైవం ముందు అందరూ సమానులు కాదా?

ప్రపంచంలో ఏ మతంలో అయినా? దేశంలోని ఏ దేవాలయంలో అయినా దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఈ అరుదైన రికార్డును బ్రేక్ చేసింది టీటీడీ.. అదీ వారి గొప్పదనం..
భగవంతుని ముందు అందరూ సమానం అంటారు.. మరి ఈ వీఐపీలు ఎవరు?..తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకీ వివక్షను పాటిస్తోంది?..
ఈ గద్దల(పెద్దలు)కు రెడ్ కార్పెట్ పరచి దైవ దర్శనం చేయిస్తూ, సామాన్య భక్తులను క్యూలైన్ కంపార్ట్మెంట్లలో గంటలు, పూటలు, రోజుల తరబడి బంధించడం ఎందుకు?.. వారేమైనా ఖైదీలా? ఉగ్రవాదులా?.. అన్నింటినీ ఓర్చుకొని స్వామి వారి ముందుకు పోయాక దూరం నుండే కనిపించీ కనిపించ ముందు తోసేస్తారు?
వైకుంఠ ఏకాదశి నాడు దైవ దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చిన భక్తులు, టీటీడీ చేతగాని, వివక్షా పూరిత విధానాల కారణంగా అగచాట్లకు గురయ్యారు.. దేవున్ని చూపించలేదనే బాధతో నిరసనకు దిగితే వారిపై పోలీసు కేసులు పెట్టారు? విమర్శలు రావడంతో జడిసి ఉపసంహరించుకున్నారనుకోండి.. విచ్చల విడిగా వీఐపీ టికెట్ల పంపిణీ, బ్లాక్ లో విక్రయాలు జరిగినా తమకు సంబంధం లేదని భావిస్తోందా బోర్డు..
తిరుమల క్షేత్రంలో అన్యతమ ప్రచారం జరుగుతున్నా పట్టించుకోరు.. మద్య మాంసాలు, గుట్కా సిగరెట్లు కొండపైకి వస్తున్నా, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నా తెలియనట్లు నటిస్తారు.. అసలు ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మందికి శిక్షలు పడ్డాయనే లెక్కా పత్రం లేనేలేదు.. శ్రీవారి పాదాల చెంతనే అన్యమత విశ్వ విద్యాలయం ఏర్పాటవుతున్నా? ఉగ్రవాదాలు సంచార జాడలకనిపిస్తున్నా టీటీడీ తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది..
తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది ధర్మ పరిరక్షణకా?.. విచ్చిన్నతికా?.. కేవలం వీఐపీల సేవలు, సేవా టికెట్లు, ప్రసాదాల విక్రయం, ఆదాయం పెంచుకునేందుకే బోర్డు పరిమితమా?.. ఇంత మాత్రానికి టీటీడీ ఎందుకు? ప్రయివేటు కాంట్రాక్టర్లకు అప్పజెప్పేస్తే పోలా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలి.. అది ముందుగా వీఐపీ సేవలను రద్దు చేయడం ద్వారానే సాధ్యం.. కేవలం పీఠాధిపతులు, దేశ, రాష్ట్ర పాలకులకు మాత్రమే నేరుగా దర్శనం కలిపించాలి.. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, నటులు, వ్యాపార వేత్తులు ఎంతటి ప్రముఖులైనా సరే క్యూలైన్లో భగవంతున్ని దర్శించుకోవాల్సిందే..

No comments:

Post a Comment