Saturday, January 4, 2014

ఈ అసమర్ధ నిర్వాకం చాలదా?..

నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మా పాఠశాలలో వక్తృత్వ పోటీలు జరిగేవి.. ఒకసారి మీరు దేశ ప్రధానమంత్రి అయితే ఏమి చేస్తారు అనే అంశంపై పోటీ జరిగింది..  ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు.. నిరుద్యోగం, పేదరిక నిర్మూళన.. అందరికీ కూడు, గూడు, గుడ్డ.. అందరికీ ఉచిత విద్య..దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బలోపేతం చేస్తాం..’  పోటీలో పాల్గొన్న విద్యార్థులు చెప్పుకొచ్చిన అంశాల సారాంశమిది..
ప్రతి ఒక్కరికీ విజన్ ఉంటుంది.. దాన్ని సాధించేందుకు కష్టపడాలి.. ప్రధాని పదవి కావాలంటే అన్నీ అనుకూలించాలి.. పదవి వస్తే సద్వినియోగం చేసుకోగలగాలి..
కానీ ఎలాంటి ప్రయత్నాలు లేకుండా అప్పనంగా పదవి వచ్చినా చేతగాని తనం ప్రదర్శిస్తే వారిని ఏమనాలి?.. నేనైతే కచ్చితంగా మన్మోహన్ సింగ్అంటాను.. మీకేమైనా అభ్యంతరమా?
ఎప్పుడో కాని నేరు తెరవలేని ప్రధానమంత్రి ఉన్నట్లుండి మీడియాతో మాట్లాడారు.. తాను ఈ పదవిలో ఉండి దేశాన్ని ఎన్నోరకాలుగా ఉద్దరించానని చెబుతూనే ద్రవ్యోల్భనాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయానని అంగీకరించారు. ఇంతకన్నా ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి మన దేశానికి?.. తాను మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోనని మన్మోహన్జీ ప్రకటించారు.. ఇది దేశ ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో మహద్భాగ్యం.. నిజానికి కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాదా?..
నిజానికి ఇందులో మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదు.. ఆయన ఇలాగే అసమర్ధంగా ఉండాలనే సోకాల్డ్ గాంధీ కుటుంబం కోరుకుంది.. పీవీ నరసింహారావులా క్రియాశీలకంగా ఉంటే మొదటికే మోసం అని సోనియా భయం.. 2004లో ఏమీ తెలియని సోనియా గాంధీ బదులు ఒక సీనియర్ ఆర్థిక వేత్తగా, దేశానికి సంస్కరణలను పరిచయం చేసిన మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ ప్రధాని కావడావడం దేశానికి మంచిదేనని అందూ భావించారు.. కానీ దేశ ప్రజలు ఇప్పుడు ఇందుకు పశ్చాతాప పడుతున్నారు..
మళ్లీ ప్రధాని పదవి చేపట్టబోనని స్పష్టం చేసిన మన్మోహన్ సింగ్ ఇప్పుడే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది.. అయితే యువనేత పప్పూగాంధీ ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్దంగా లేరని భోగట్టా.. పప్పూ తమ భావి ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు.. అసలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కదా? ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి?..

No comments:

Post a Comment