Wednesday, January 15, 2014

ఎవరు కామన్ మాన్?

మనోహర్ గోపాలకృష్ణ పారికర్.. చూడటానికి మన పక్కింటి అంకుల్ గానో, బాబాయ్ గానో కనిపిస్తున్నారు కదూ.. ఆయన గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి అనగానే ఇంత సింపుల్ గా ఉన్నారేమిటి అనిపిస్తుంది కదూ..
బాంబే ఐఐటీలో చదువుకున్న మనోహర్ పారికర్ దేశంలోనే తొలి ఐఐటియన్ సీఎంగా గుర్తింపు పొందారు.. గోవాకు రెండో సారి ముఖ్యమంత్రి అయిన పారికర్ సాదాసీదా మనిషి.. ఆడంబరాలకు అతి దూరంగా ఉంటారు.. ఆయన డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది.. జనంలో ఇట్లే కలిసిపోతారు.. నేరుగా వారి దగ్గరకు వెళ్లు సమస్యలను ఆలకిస్తారు.. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.. అతి సాధారణ భద్రతా సిబ్బందితో మామూలు కారులోనో తిరుగుతారు.. అవసరమైతే స్కూటర్ పై ప్రయాణించడానికి కూడా వెనుకాడరు.. కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పారికర్ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంతో నిరాడంబరంగా ఉంటున్నారు.. అధికార నివాసం కేవలం సమావేశాలకు విజిటర్లకు పరిమితం..
మరోహర్ పారికర్ గురుంచి మన దేశ ప్రజలకు తెలిసింది చాలా తక్కువ.. ఎందుకంటే ఆయనను సో కాల్డ్ నేషనల్ మీడియా అంతగా పట్టించుకోదు.. ఎందుకంటే ఆయన వారికి అంటరాని పార్టీకి చెందినవాడిలో కనిపిస్తారు కదా.. అంతకంటే కేజ్రీవాల్ మాదిరిగా పబ్లిసిటీ కోసం నిరాడంబరత పేరుతో చిత్ర విచిత్ర వేశాలు వేసి మీడియాను తిప్పుకోడానికి ఇష్టపడరు.. 


No comments:

Post a Comment