Friday, January 31, 2014

ఇంకా అడ్డుకోవాలనుకోవడం భ్రమే..

అసెంబ్లీలో మొత్తం సీట్లు 294.. సీమాంధ్ర ప్రాంత సభ్యుల సంఖ్య 175.. తెలంగాణ ప్రాంత సభ్యుల సంఖ్య 119.. అంటే తెలంగాణ వారి కన్నా సీమాంధ్ర సభ్యులు 56 మంది అధికంగా ఉన్నారు..
సీమాంధ్ర సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరిరేకిస్తున్నందున రాష్ట్ర పునర్విభజన బిల్లుకు పట్టే గతేమిటో అందరూ ముందుగా ఊహించిందే.. వరదలో కొట్టుకుపోయే వారికి గడ్డిపోచ దొరికినా అదే ఎక్కవ అనుకుంటారు.. అదే విధంగా అసెంబ్లీ తిరస్కరించటంతో తెలంగాణ ప్రక్రియ ఆగిపోయినట్లు సీమాంధ్ర నేతలు ప్రచారం చేసుకుంటున్నారు..
కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి స్పష్టంగా చెప్పింది.. ముసాయిదా బిల్లును అసెంబ్లీ అభిప్రాయం కోసమే పంపామని. అసెంబ్లీ తీర్మానమే ప్రాతిపదిక అయితే అసలు తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా?
తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నప్పుడు, కలిసే ఉండాలని వత్తిడి తెచ్చినా, బలవంత పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.. ఇంకా పిడి వాదనలతో తెలంగాణను అడ్డుకోవడం అంటే సమస్యను వాయిదా వేసుకోవడంలాంటిదే.. నాకు ఇరు ప్రాంతాలపై నాకు గౌరవం ఉంది.. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా, విడిపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు..
పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించాల్సి అవసరం ఉంది.. కేవలం హైదరాబాద్ ను, తెలుగు భాషను సాకుగా చూపి పిడి వాదనలతో తెలంగాణను అడ్డుకోవాలనే కుయుక్తులను కట్టిపెట్టడం మంచిది..

చరిత్ర గతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. రాజ్యాల సరిహద్దులు నిరంతరం మారుతూ ఉంటాయి.. తెలంగాణ విషయంలోనూ అంతే.. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పగలమా? తెలంగాణ వారిమైనా, సీమాంధ్రులమైనా ముందు మనం భారతీయులం అనే విషయాన్ని మరచిపోరాదు..

No comments:

Post a Comment