Wednesday, January 29, 2014

పప్పూ ఇక మారడా?

పప్పుకి అంత సీన్ లేదని తాజా టైమ్స్ నౌఇంటర్వూ ద్వారా తేలిపోయింది.. 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో నరేంద్ర మోడీకి న్యాయస్థానాలు క్లీన్ చీట్ ఇచ్చినా ప్రజలు నమ్మరట.. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, ఊచకోతలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదట..  ఈ హత్యాకాండ వెనుక ఉన్న సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్లు ఏ పార్టీ వారు?.. ఢిల్లీ సిక్కులు కాంగ్రెస్ పై ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నారు?.. అసలు స్వర్ణ దేవాలయ సమస్య ఏమిటి? ఇందిరా గాంధీని ఎందుకు హత్య చేశారు? ఈ సమస్యకు మూలమైన బింద్రన్ వాలేనే పెంచి పోషించింది ఎవరు?.. ఈ ప్రశ్నలపై లోతుగా చర్చ జరిగితే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చేవి..
తమది దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబమని రాహుల్ గాంధీ చెప్పుకోవడం.. కాంగ్రెస్ నేతలు అందుకు బాకా ఊదడం పరిపాటి అయిపోయింది.. అయ్యా వీరు ఎవరి కోసం త్యాగాలు చేశారు?.. ఇందిర, రాజీవ్ హత్యలకు కారణమై సంఘటనల వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని ఎందుకు దాస్తారు?.. ఖలిస్తాన్ ఉద్యమానికి కారకుడైన బింద్రన్ వాలేను, శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభాకరన్ ను తయారు చేసింది ఎవరు?.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారికి పోషించింది మీ మహానేతలు కాదా?..
తాను వంశ పారంపర్య పాలనకు వ్యతిరేకమని రాగాసుద్దులు చెబుతున్నారు.. మరి కాంగ్రెస్ పార్టీని అవిచ్చిన్నంగా పాలిస్తున్నది మీ కుటుంబం కాదా? ఆ కుటుంబానికి చెందిన మీరు పార్టీ పగ్గాలు చేపట్టడం వంశ పారంపర్య విధానం కాదా?

ఇంతకీ నేను కాదు, మనం అనే నినాదాన్ని ఎందుకు కాపీ కొట్టారు పప్పూ? సొంత ఆలోచనలు లేవా?

No comments:

Post a Comment