Friday, January 3, 2014

నిన్నటి నినాదమే ఇవాళ్లి విధానం..

కాంగ్రెస్ కే హాత్.. ఆమ్ ఆద్మీకే సాత్..
నిజమే కదా?.. మొత్తానికి ఆమ్ ఆద్మీకే సాత్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గింది.. బలం నిరూపించుకుంది కేజ్రీవాల్ సర్కారే అయినా అది కాంగ్రెస్ సాధించిన విజయమే..
విశ్వాసానికి అనుకూలం 37 ఓట్లు (ఆప్ 28 + కాంగ్రెస్ 7 + జేడీయూ 1 + స్వతంత్ర 1).. వ్యతిరేకం 32 ఓట్లు (బీజేపీ 31 + ఎస్ఏడీ 1)
ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవినీతి, అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు..  అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకీ అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ రాలేదు.. విచిత్రమైన లాజిక్కులు చూపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ సహకారంతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.. ఇది అనైతికమే అయినా మీడియా బాజా భజంత్రీల సహకారం ఉండటంతో వ్యతిరేకించే వారి గళం నీరసపడిపోయింది.. మంచినీరు, విద్యుత్ తాయిలాలు చూపించి నెట్టుకొస్తున్నారు.. సామాన్య ప్రజలతో మమేకం కావడమే తెలివైన, ఖర్చులేని ప్రచార ఎత్తుగడ అవలంభిస్తున్నారు..

బీజేపీకి అధికారం దక్కొద్దనే ఏకైన కారణంతోనే కాంగ్రెస్ విధిలేని పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి  మద్దతు ఇస్తోంది.. కేజ్రీవాల్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రజలు అత్యధిక సీట్లు కట్టబెట్టిన బీజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి నీతివంతమైన పాలనతో పాటు తన వాగ్దానాలు అమలుచేసేందుకు ప్రయత్నించవచ్చు కాదా?.. కేజ్రీవాల్ ఎవరి చేతిలో పావో దేశ ప్రజలకు తెలుసు.. కానీ మీడియా కేజ్రీనామ జపం ముందు ప్రస్తుతానికి వినిపించడం లేదు..

No comments:

Post a Comment