Monday, February 29, 2016

నాలుగేళ్లకు ఒకసారే జయంతి

మురార్జీ దేశాయి.. భారత దేశ నాలుగో ప్రధానమంత్రి.. సివిల్స్ సర్వీసెస్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు మురార్జీ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు.. మురార్జీ వాస్తవానికి నెహ్రూ తర్వాత ప్రధాని కావాల్సిన వాడు.. కానీ కోటరీ రాజకీయాల కారణంగా రెండు సార్లు ఆయనకు ఆ అవకాశం తప్పింది.. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు.. ఎమర్జెన్సీ కాలంలో జైలు పాలైన ముర్జార్జీ, జనతా పార్టీకి నేతృత్వం వహించారు.. కాంగ్రెస్ పార్టీ పరాజయం, జనతా పార్టీ ఘన విజయంతో దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. మురార్జీ దేశాయి ప్రధానిగా పని చేసిన కొద్ది నెలల్లోనే పాలనతో తనదైన ముద్ర చూపారు.. అంతర్గత కుమ్ములాటలో జనతా ప్రభుత్వం పతనం కావడం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి పోయారు..
మురార్జీ దేశాయి జీవించింది 99 సంత్సరాలు.. కానీ ఆయన తనకు 24 ఏళ్లే అని చమత్కరిస్తారు.. అవును మరి ఆయన పుట్టిన రోజు నాలుగేళ్లకు ఒకసారే వస్తుంది.. మురార్జీ జన్మదినం ఫిబ్రవరి 29.. ఈ ఏడాది లీపు సంవత్సరం కావడంతో ఆయన జన్మదినం వచ్చింది.. ఆ మహనీయున్ని స్మరించుకునే సందర్భమిది..

(మురార్జీ దేశాయి జననం: ఫిబ్రవరి 29, 1896, మరణం: ఏప్రిల్ 10, 1995)

Saturday, February 27, 2016

హిందూ అంటే ఉలిక్కి పడతారెందుకు?

భారత దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందట.. పార్లమెంటులో ప్రతిపక్షాల గగ్గోలు ఇది..
మనది హిందూ దేశమే కదా?.. ప్రత్యేకంగా మార్చడం ఏమిటి?.. హిందూ అనేది కొత్తగా వచ్చిన పదం అన్నట్లు అలా ఉలికి పడతారెందుకు? ప్రాచీన కాలం నుండి మన దేశం పేరే అది కదా?.. ఏం చరిత్ర మరచిపోయారా?.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారా?..
చిన్నప్పుడు మీరు చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో హిందూ దేశ చరిత్ర అనే చాప్టర్ కనిపించలేదా?.. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ చిత్ర పటాలను చూడండి.. హిందుస్థాన్ అని కనిపించకపోతే ఓసారి కళ్ల డాక్టర్ దగ్గరకు పోండి..
జై హింద్ అనే నినాదం.. సారే జహాసే అచ్చా హిందూ సితాహ్ హమారా అనే గీతం సంగతి ఏమిటి?
అంతెందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ కేబుల్స్ లకు ఆ పేర్లు ఎవరు పెట్టారు?..  ప్రయివేటు సంస్థలు హిందుస్థాన్ లీవర్, హిందుస్థాన్ మోటార్స్ కంపెనీల మాటేమిటి?.. చివరికి ది హిందూ, హిందుస్థాన్ టైమ్స్ పత్రికలను కూడా మీరు ఎప్పుడూ చూడలేదా?
ఇప్పుడు చెప్పండి.. మన దేశం హిందుస్థాన్ కాదా?.. స్వాతంత్ర్యానంతరం కొందరు సంకుచిత నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పదం వాడకాన్ని తగ్గించేశారు.. అంత మాత్రాన మన చరిత్రను చెరిపేసుకోలేం కదా?.. గర్వ్ సే కహో హమ్ హిందుస్థానీ హై..
(ఈ అంశంపై నేను ఇదే బ్లాగులో 12/08.2014 నాడు రాసిన పోస్టు చదవండి..  facebookలో రాసిన వ్యాసాన్ని
చదివేందుకు ఈ లింకులోకి వెళ్లండి.. https://www.facebook.com/mkdmitra/posts/712263612187812:0 )

Friday, February 26, 2016

ప్రధాని తల్లికి సాధారణ చికిత్స..

ప్రధాని నరేంద్రమోడీ త‌ల్లి హీరాబెన్ తీవ్ర‌ అస్వస్థకు గురైతే, 108 వాహనంలో అహ్మ‌దాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అక్క‌డ ఆమె విఐపి వైద్యాన్ని తిరస్కరించి సామాన్యుల మధ్యనే చికిత్సకి పట్టుపట్టారు.
ఆస్పత్రిలో కొలుకున్నాక కారులో ఇంటికి తీసుకెళ్తామని అక్కడి అధికారులు సూచించగా సునితంగా తిరస్కరించారు హీరాబెన్.. ఒక షేర్ఆటోలో తన ఇంటికి వెళ్ళిపోయారు..
ప్రధాని తల్లి హోదాలో లభించే సౌకర్యాలను కూడా తిరస్కరించిన హీరాబెన్ అందరికీ ఆదర్శంగా నిలిచారు..

పప్పూ 2

కాంగ్రెస్ పార్టీకి పప్పూ పెద్ద గుది బండ అనుకుంటే మరో పప్పూ తయారయ్యాడు.. పార్లమెంటులో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ JNUలో అఫ్జల్ గురుకు మద్దతుగా జరిగిన కార్యక్రమం గురుంచి ప్రస్థావించాడు.. అఫ్జల్ గురు దేశ ద్రోహి అయితే ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించాడు కాంగ్రెస్ యువ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా.. ఒకింత ఆశ్చర్యపోయిన అనురాగ్, ఇప్పటికే ఉరి వేసిన వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తాం అని ప్రశ్నించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిపోయింది.. అర్థం అయింది కదా పప్పూ-2 ఎవరో..

Thursday, February 25, 2016

సీబీఐ మాజీ డైరెక్టర్ గారి కష్టాలు

అది పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలం.. పలు సంక్షోభాలు, కుంభకోణాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. ఆ సమయంలో 1996లో జైన్ హవాలా కుంభకోణం వెలుగు చూసింది.. ప్రతిపక్ష నేత లాల్ క్రిష్ణ అడ్వానీతో సహా పలువురు అగ్ర నాయకులపై CBI కేసులు నమోదు చేసింది.. దీనికి ఆధారం ఓ డైరీలోని ఓ కాగితం ముక్కపై LK అని రాసి ఉండటం.. తనపై వచ్చిన తప్పుడు అభియోగంతో మానసిన వేదనకు గురైన అడ్వానీ తాను నిర్దోషినని తేలే వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. 18 నెలల విచారణ తర్వాత అడ్వానీపై ఆరోపణలు నిరాధారమని కొట్టేసింది ఢిల్లీ హైకోర్టు..
ఈ మధ్యనే ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిపై CBI కేసు నమోదు చేసింది.. తప్పుడు పత్రాలతో రుణాలు తీసుకొని ఎగ్గొట్టాడని ఆరోపణ.. ఈ ప్రముఖ వ్యక్తి మరెవరో కాదు.. జైన్ హవాలా కేసు సమయంలో CBIకి డైరెక్టర్ గా ఉన్న కె.విజయ రామారావు.. అభియోగాలు ఎదుర్కొంటున్నది ఆయన కొడుకు శ్రీనివాస కళ్యాణరావు.. తన కుమారుడు ఏ తప్పు చేయలేదని, నిర్ధోషిగా బయట పడతాడని చెబుతున్నారు విజయరామారావు.. తాను సీబీఐని తప్పు పట్టనని అది సమర్ధవంతమైన సంస్థ, ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని అనుకోవడం లేదని అని అంటూ కితాబిచ్చారు ఆయన.. పాపం తాను డైరక్టర్ గా పని చేసిన సంస్థ గురుంచి తక్కువ చేసి చెప్పుకోలేడు కదా..
కేవలం రెండక్షరాలను ఆధారంగా చేసుకొని ఓ అగ్రనేత రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని చూసేందుకు సీబీఐని అడ్డు పెట్టుకుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పుడు ఆ సంస్థకు అధిపతిగా ఉన్న విజయరామారావుకు కష్టం వచ్చి పడింది.. పూలమ్మిన చోటే కట్టెలు అమ్మడం కష్టమే మరి..
అన్నట్లు తెలుగు నాట పెను రాజకీయ మార్పులకు పరోక్ష కారకులు మన విజయరామారావు గారే.. సీబీఐ డైరెక్టర్ పదవీ విరమణ తర్వాత టీడీపీలో చేరి 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన విజయరామారావును రాష్ట్ర మంత్రి చేశారు నాటి సీఎం చంద్రబాబు నాయుడు. ఇందు కోసం ఒకే సామాజిక వర్గం అనే సాకుతో కె.చంద్రశేఖరరావుకు తిరిగి మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరించారు చంద్రబాబు.. ఆగ్రహించిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి లేపడం.. దశాబ్దన్నర కాలంలో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.. కొసమెరుపు ఏమిటంటే ఈ రాజకీయ పరిణామాలకు కారణమైన విజయరామారావు ఇటీవలే టీడీపీకి గుడ్ బై  చెప్పి టీఆర్ఎస్ లో చేరడం..

స్మృతి ఆంటీ అయితే, మరి మీరేంటి?

సోనియా గాంధీ, మమతా బెనర్జీ, మాయావతి.. వీల్లేవారు ఆంటీలు కాదట.. చివరకు ప్రియాంక కన్నా వయసులో చిన్న ఆయిన స్మృతి ఇరానీ ఆంటీగా కనిపించింది.. ఈ కామెంట్స్ ఏ నోటి దురుసు తిక్క నాయకుడు చేసి ఉంటే మతిలేని దిగజారుడు తనం అని సరిపెట్టుకునే వాళ్ళం.. స్వాతంత్ర్యానికి ముందు నుండి ఉన్న ప్రఖ్యాత దినపత్రిక The Telegraph చేసిన పని ఇది.. పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఇలా అడ్డగోలుగా అవమానించే హక్కు ఎవరిచ్చారు ఈ పత్రికకు?.. ఇదేం శాడిజం?..

దేశం అంటే ఇంత చులకనైపోయిందా?

ఈ దేశంలో పుట్టి.. ఈ దేశం గాలి పీలుస్తూ.. ఈ దేశం తిండి తింటూ.. ఈ దేశం నీళ్లు తాగుతూ.. ఈ దేశ ప్రజల పన్నుల సొమ్ముతో చదువుతూ..
చివరకూ దేశ మాతనే ముక్కలు చేస్తామంటున్న ఈ సైతానులను ఇలాగే భరించాల్సిందేనా?.. వీరికి సిగ్గు లేకుండా మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలను, సంస్థలను, సోకాల్డ్ మేతావులను ఇలాగే వదిలేద్దామా?
ఇండియన్ డాగ్స్ గో బ్యాక్ అట మరి మీరు ఎక్కడి నుండి వచ్చారురా పందులారా?.. ఏ దేశం నుండి ఊడి పడ్డార్రా అడ్డ గాడిదల్లారా?
దేశ రాజధాని ఢిల్లీలోని యూనివర్సిటీల గోడలపై కనిపిస్తున్న ఈ రాతలకు  బాధ్యులెవరు?.. ఇవి విశ్వవిద్యాలయాలా తీవ్రవాదుల కర్మాగారాలా?.. దేశ విచిన్నకర శక్తులకు అడ్డాలుగా మారుతున్న యూనివర్సిటీలను ఇకనైనా ప్రక్షాళన చేయాలి.. వారిని వెనుకేసుకు వస్తున్న శక్తులకు బుద్ది చెప్పాల్సిందే..

కాంగ్రెస్ శవరాజకీయాలపై స్మృతి ఆగ్రహం

నా పేరు స్మృతి ఇరానీ.. నా కులం ఏమిటో చెప్పండి?.. ఆమె విసిరిన సవాలు లోక్ సభలో కాంగ్రెస్ పార్టీని, ఇతర విపక్షాలను ఆత్మరక్షణలో పడేసింది.. HCUలో రోహిత్ ఆత్మహత్య తర్వాత జరిగిన శవ రాజకీయాలను ఎండగట్టారు స్మృతి ఇరానీ.. JNUలో దేశ విద్రోహక శక్తులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై నిప్పులు చెరిగారు ఆమె.. స్మృతిజీ వేసిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ దగ్గర సరైన సమాధానాలు ఉన్నాయా అసలు?. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ చదువు గురుంచి ప్రశ్నించవారు, ఆమె టీవీ నటి అని ఎద్దేవా చేసిన వారు ముందు మీ మొహాలను అద్దంలో చూసుకోండి.. మీలో సంస్కారం ఎంత సరి చూసుకోండి.. పని తీరును బట్టి వ్యక్తులను గౌరవించడం నేర్చుకోండి..

Wednesday, February 24, 2016

ఏనుగుకు, కుక్కలకు తేడా ఉంది..

ఏనుగును చూడగానే కుక్కలు మొరుగుతాయి.. అది ఘీంకరిస్తే తోక ముడుచుకు పారిపోతాయి.. ఇక్కడ ఏనుగు జాతీయవాదానికి, కుక్కలు దేశ ద్రోహులకు ప్రతీక

దేశ ద్రోహులకు మద్దతు సిగ్గు చేటు

పార్లమెంటుపై దాడి కేసులో అప్ఝల్ గురుకు ఉరిశిక్ష అమలును వ్యతిరేకిస్తూ JNUలో జరిగిన కార్యక్రమానికి సిగ్గులేకుండా మద్దతు తెలిపాయి కాంగ్రెస్, వామపక్షాలు.. పాకిస్తాన్ జిందాబాద్, భారత్ ను నాషనం చేస్తామంటూ నినాదాలు చేసిన వారిపై చర్యలను నిరసిస్తున్నా.. ఈ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామంటున్నాయి.. ఇంతగా దిగజారిపోయిన ఈ పార్టీలు పార్లమెంటు ఆవరణలో అఫ్జల్ గురు విగ్రహం పెట్టాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు..

Tuesday, February 23, 2016

భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏబావది?

JNU, HCUలలో జాతి వ్యతిరేక చర్యలు భావ ప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణిస్తున్నారు మేతావులు.. ఈ స్వేచ్ఛ ఏదో మీ బావల ఇళ్లలో ఉపయోగించుకోండి.. అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ లను ఆరాధించమని ఏ బావ చెప్పాడు మీకు? పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ బర్బాదీ తక్ అనడం భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకనా?..
తినేది ఈ దేశం తిండి.. పాడేది పాకీ పాటలా?..
విశ్వ విద్యాలయాల్లో విద్రోహులను తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి కొని శక్తులు.. దేశ ప్రజలంతా వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలి.. 

Monday, February 22, 2016

జై జవాన్.. కెప్టెన్ పవన్ కుమార్

“Kisi ko reservation chahiye to kisiko azadi bhai, hamein to kuch nahi chahiye bas apni raza..”(కొందరికి రిజర్వేషన్, మరి కొందరికి ఆజాది కావాలి అట సోదరా.. నాకేమీ వద్దు.. దుప్పటి తప్ప..)
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో మరణించిన భారత వీర జవాను కెప్టెన్ పవన్ కుమార్facebookలో పెట్టిన చివరి పోస్ట్ ఇది..  జాట్ కులస్తుడైన పవన్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో చదువుకున్నాడు.. అక్కడ ఉగ్రవాదులకు మద్దతుగా జరిగిన ఆందోళనలు, హర్యాణాలో రిజర్వేషన్ల కోసం జాట్లు చేస్తున్న ఆందోళనలపై పవన్ కుమార్ స్పందన ఆయనలోని దేశభక్తికి, సైనికుడిగా ఆలోచనా విధానానికి అద్దం పడుతున్నాయి..
వీర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ కు భారతీయులంతా సగర్వంగా సల్యూట్ చేయాల్సిందే..

Sunday, February 21, 2016

మార్ఫింగ్ ఫోటోతో సంఘ్ పై దుష్ప్రచారం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై దుష్ప్రచారం కోసం జాతి వ్యతిరేక శక్తులు వాడుకుంటున్న ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను చూడండి.. వర్జినల్ కలర్ ఫోటోను కూడా గమనించండి.. ఎలా మార్పింగ్ చేశారో అర్థమైంది కదూ..
స్వయం సేవకులు పవిత్ర భగవాధ్వజానికి తప్ప వ్యక్తులకు ప్రణామం చేయరు.. కానీ బ్రిటిష్ రాణి వారి గౌరవ వందనం స్వీకరిస్తున్నట్లు ఫోటో సృష్టించారు.. ఈ ఫోటో ఎక్కడిదో కూడా చెబితే బాగుండేది..

దేశ ప్రజల్లో జాతీయభావాలను, దేశ భక్తిని పెంపొందించడంతో పాటు వ్యక్తి నిర్మాణం కోసం ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థపై జరుగుతున్న దుష్ఫ్రచారానికి ఈ ఫోటో మచ్చుతునక..

మాతృ భాషను మరువకండి..

ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ ముందుగా మాట్లాడే మాట అమ్మా (తన తల్లి మాట్లాడే భాషలో).. మాతృభాష అనే పదం ఇలా వచ్చిందే.. ప్రతి నాగరికత, సంస్కృతి, సాంప్రదాయ సముదాయానికి ఒక భాష ఉంటుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేలకు పైగా భాషలు ఉంటే అందులో మనుగడలో ఉన్నది 500 లోపే అంటారు.. మన భాషను కోల్పోతే ఉనికి కోల్పోయినట్లే..
ఈనాడు తెలుగు భాష పరిస్థితి గురుంచి మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాతృభాషగా ఉన్నవారు 18 కోట్లు ఉంటారని అంఛనా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మాట్లాడుతున్న తెలుగులో తెలుగుఎంత అని ఆలోచించాలి.. మనం మాట్లాడే ప్రతి పది పదాల్లో కచ్చితంగా 2 నుండి 4 దాకా ఇంగ్లీషు లేదా అన్య భాషా పదాలే ఉంటాయి.. మన భాషను సుసంపన్న చేసుకోవడానికి కొత్త పదాలను కల్పుకోవాల్సందే.. కానీ తెలుగులో పదాలు ఉన్నా అన్య భాషా పదాలనే వాడుతున్నాం.. ఇందుకు తప్పు ప్రధానంగా మీడియా సంస్థలదే.. ఆ తర్వాతే ప్రభుత్వాలను నిందించాలి..
టీవీ చానళ్లలో మన భాష ఎలా ఉందో ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. పత్రికల్లో సైతం ఈ ధోరణి ప్రారంభమైంది.. ఈనాడు వారు కొంత మేర కొత్త పదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, ఇతర మీడియా సంస్థలు అందుకు దూరంగా ఉంటున్నాయి.. వాస్తవానికి ఈ బాధ్యత తీసుకోవాల్సింది తెలుగు విశ్వవిద్యాలయం, ఉభయ రాష్ట్రాల ప్రెస్ అకాడమిలు కానీ ఈ విషయంలో అవి పూర్తిగా విఫలమయ్యాయి.. మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను భాషను రక్షించుకుందామనే సోయి లేకుండా పోయింది..
ప్రపంచంతో అను సంధానానికి ఇంగ్లీషు తదితర భాషలు కావాల్సిందే.. కానీ మన అస్థిత్వాన్ని కాపాడేది మాతృభాష మాత్రమే.. మన పిల్లలు ఏ మీడియంలో చదివినా పర్వాలేదు.. కానీ మన భాష సంస్కృతులను మరవకుండా పెంచితే చాలు.. భావి తరాలకు మేలు చేసినవాళ్లమవుతాం.. పిల్లలకు తెలుగు పాటలు, పద్యాలు, సుభాషితాలు, సూక్తులు నేర్పించండి.. ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని చదివేలా ప్రోత్సహించండి.. తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడండి.. తెలుగు పదాలను ఎక్కువగా వాడండి.. మన వంతుగా ఈ మాత్రం ప్రయత్నం చాలు.. తెలుగు భాషను భావితరాలకు అందేలా కొనసాగించిన వారిమవుతాం..

1947లో భారత దేశం విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది.. పశ్చిమ పాకిస్తాన్ ఉర్దూ భాషను తూర్పు పాకిస్తాన్ పై రుద్దేందుకు ప్రయత్నించింది.. దీంతో అక్కడి ప్రజలు తమ బెంగాళీ భాషను రక్షించుకునేందుకు ఉద్యమించారు..  ఈ సందర్భంగా 1952 ఫిబ్రవరి 21న జరిగిన కాల్పోల్లో నలుగురు భాషాభిమానులు అమరులయ్యారు.. ఈ ఘటనే బాంగ్లా దేశ్ ఆవిర్భావానికి దారి తీసింది.. ఈ స్పూర్తితో యునెస్కో ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించింది..

Saturday, February 20, 2016

వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే..

తమ స్వార్ధ రాజకీయాల కోసం తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చి దేశ ప్రజల్లో జాతీయ భావాలను మరింత ద్విగిణీకృతం చేసిన కాంగ్రెస్, వామపక్షాలకు అభినందనలు.. ‘భారత దేశాన్ని నాశనం చేస్తాం.. పాకిస్తాన్ జిందాబాద్..’ అంటూ నినాదాలు చేసిన వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మీరు ఏం సాధిస్తున్నట్లు?.. దేశ ప్రజల మనోభావాలతో ఆటలా?.. వారు కళ్లు మూసుకొని కూర్చొంటారని అనుకుంటున్నారా?.. ఈ దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం అంటే అంత చులకన అయిపోయిందా?.. ఇలాంటి వారే జాతీయవాదానికి కొండంత అండ..

Friday, February 19, 2016

దేశభక్తి గురుంచి సుద్దులు సరే..

దేశభక్తి తన రక్తంలోనే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాడు రాహుల్ గాంధీ.. అంత దేశభక్తి ఉంటే JNU, HCUలలో దేశద్రోహులైన అఫ్జల్ గురు, మెమన్ లకు మద్దతుగా సభలు పెట్టిన విద్యార్థులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్లినట్లు? ఈ దేశ పార్లమెంటుపై దాడి, ముంబై మారణకాండకు కారకులైన ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయడాన్ని రాహుల్ వ్యతిరేకిస్తున్నారా?.. మరి వీరికి ఉరిశిక్షను అమలు చేసింది ఆయన తల్లి సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ సర్కారే కదా? అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?.. ఉగ్రవాదానికి బలైన అమాయక దేశ పౌరులకన్నా, ఇందుకు కారకులైన దేశ ద్రోహుల ప్రాణాలు విలువైనవని రాహుల్ గాంధీ చెప్పదలచుకున్నారా?
పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఆజ్యం పోసింది ఎవరు? చివరకు వారి చేతిలోనే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు.. శ్రీలంకలో ఈలం కోసం పోరాడిన LTTEకి తమిళనాడులో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసింది ఎవరు?.. రాజీవ్ గాంధీని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు వారు.. తన నాన్నమ్మ, నాన్నల ఉదంతాల నుండి అయినా రాహుల్ గుణపాఠం నేర్చుకోవాలి.. పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా?

చివరగా.. దేశభక్తి రక్తంలోనే కాదు.. బుర్రలో కూడా ఉండాలి..

శివాజీ జయంతి

విదేశీ పాలకులైన మొఘలులపై తిరుబాటు బావుటా ఎగరువేసి దేశ ప్రజల్లో స్వాభిమానాన్ని రగిల్చిన మరాఠా యోధుడు శివాజీ షహాజీ భోంస్లే.. తన యుద్దతంత్రాలతో అఖండ విజయాలను సాధించి పశ్చిమ భారతాన స్వతంత్ర సామ్రాజ్యాన్ని నెలకొలిపి ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు విస్తరించి ఛత్రపతి శివాజీగా పేరు తెచ్చుకున్నారు.. హిందూ పద్ పదషాషీ బిరుదునలంకరించారు.. ఛత్రపతి శివాజీ మహరాజ్ జన్మించింది ఈరోజునే (ఫిబ్రవరి 19, 1630 సం.) దేశ ప్రజలందరినీ ఏకం చేసిన వీర శివాజీ స్పూర్తిని కొనసాగిద్దాం..

Wednesday, February 17, 2016

మేడారం జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు


మేధావులా? హిస్టీరియా పేషంట్లా?

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి మన దేశంలో కొందరు మేతావులు హిస్టీరియా పేషంట్లయిపోయారు.. ఈ ప్రభుత్వాన్ని చేతబడి చేసైనా దించేయాలి అన్నంతగా పూనకంతో చెలరేగిపోతున్నారు..దేశంలో ఎక్కడ లేని అసహనం వారికే కనిపిస్తోంది.. దేశంలో పెరిగిపోతున్న జాతీయ వాదానికి దేశ ద్రోహమే సరైన విరుగుడు అని కనిపెట్టేశారు..

కిస్ ఆప్ లవ్, బీఫ్ ఫెస్టివల్ తదితర సాంస్కృతిక దాడులతో మొదలై.. ఇప్పుడు ఏకంగా దేశ అస్థిత్వాన్నే సవాలు చేసేంతగా బరితెగించారు. భారత పార్లమెంటుపై దాడి చేసిన, దేశ ప్రజలను పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టులకు నివాళ్లర్పించే స్థాయికి దిగజారిపోయారు.. కుల, మతాలను అడ్డంపెట్టుకొని ఈ దేశాన్ని విచ్చిన్నం చేసేంత వరకూ నిద్రపోమంటూ భీకర ప్రతినలు చేస్తున్నారు..
తాజాగా ఓ మేతావి జాతీయత అనే పదానికి అర్థం లేదని తేల్చేశాడు.. దేశ ద్రోహులకు మద్దతుగా ప్రదర్శనలు జరిపితే వీటిని వ్యతిరేకించడం ఘోరమైన తప్పిదమన్నట్లు రాశాడీ పెద్ద మనిషి.. ఆయన రాతల్లో కోరుకున్న ప్రకారం ఆ దేశం ఐక్యంగా ఉండరాదు.. స్వాతంత్ర్య పూర్వ సంస్థానాల మాదిరిగానే విచ్చిన్నం కావాలి.. దేశం కుల, మతాల ప్రాతి పదికన విడిపోవాలి.. మోకాలికీ, బట్టతలకు ముడి పెట్టినట్లు రాజ్యాంగం, హక్కులు, బహుళ జాతి కంపెనీలు, ఉరిశిక్ష అంటూ తన వ్యాసంలో చెలరేగిపోయాడీ మేతావి.. విదేశీ సైద్దాంతిక భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న ఈ పెద్ద మనిషి ఓ యూనివర్సిటీలో విచ్చిన్నకర శక్తులకు బీజాలు వేసిన వారిలో ఒకరట.. ఛీ ఛీ..

Tuesday, February 16, 2016

నేతాజీని వదలని కమ్యూనిస్టులు

చారిత్రిక తప్పిదాలు చేయడం, ఆ తర్వాత పశ్చాతాప్త పడటం కమ్యూనిస్టులకు అలవాటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పట్ల కూడా వారు ఇదే రకంగా వ్యవహరించారు..
బ్రిటిష్ వారిపై పోరాడేందుకు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించి శత్రువు శత్రువు మనకు మిత్రుడనే యుద్ద నీతిని పాటించారు.. ఇందులో భాగంగా బ్రిటిష్ వారి శత్రువు జపాన్ సహకారం తీసుకున్నారు ఆయన..
రెండో ప్రపంచ యుద్ద కాలంలో రష్యాకు సన్నిహితంగా ఉన్న బ్రిటిష్ వారిని సమర్ధించారు భారత కమ్యూనిస్టులు.. ఇందులో భాగంగా జపాన్ సహకారం తీసుకున్న సుభాష్ చంద్ర బోసును కించపరిచారు.. నేతాజీని జపాన్ ప్రధాని టోజో పెంపుడు కుక్క అంటూ నోరు పారేసుకున్నారు..  కమ్యూనిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ వార్ పత్రిక బోసుబాబును గాడిదలా, ఆయనపై టోజో కూర్చొని స్వారీ చేస్తున్నట్లు కార్టూన్ ప్రచురించింది..

కాలక్రమంలో నేతాజీని తాము తప్పుగా అర్ధం చేసుకున్నామని వివరణ ఇచ్చుకున్నారు కమ్యూనిస్టులు.. చేతులు కాలిన తరువాతే ఆకులు పట్టుకోవడం కమ్యూనిస్టులకు అలవాటే కదా.. వారు ఎక్కే రైలు ఎప్పటికీ జీవిత కాలం లేటే...

Monday, February 15, 2016

హఫీజ్ పాట.. వారి వంత

JNUలో విద్యార్థుల ముసుగులో అఫ్జల్ గురు ఉరిశిక్షకు వ్యతిరేకంగా, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన వారికి ముంబై దాడుల సూత్రదారి హఫీజ్ సయీద్ మద్దతు ప్రకటించాడు.. కాంగీస్, కమ్మీస్, పాపీస్ వంతపాడుతున్నారు.. దీన్ని దేశ ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి?

దేశంపట్ల బాధ్యతలేని వామపక్షాలు

వామపక్షాలు ఎవరి పక్షం?.. ఆ పార్టీలు భారత దేశాన్ని ఏనాడైనా అర్థం చేసుకున్నాయా?..
మన దేశంలో వారసత్వ రాజకీయాలకు తావులేకుండా, అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి లెఫ్ట్, రైట్.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ క్షీణించి, బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నిలవాల్సింది వామపక్షాలే.. కానీ ఈ పార్టీలు తమ లక్ష్యాలకు అందనంత దూరంలో ఉండిపోయాయి. కారణం.. ప్రారంభం నుండి వారు వేస్తున్నవి తప్పటడుగులే కాబట్టి..
తొలి రోజుల్లో భారత కమ్యూనిస్టులు సోవియట్ యూనియన్ (రష్యా) నమూనాతో మన దేశంలో కూడా విప్లవం తేవాలని పగటి కలలు కన్నారు.. భారత దేశాన్ని జాతుల సముదాయంగా అభివర్ణించి, ముక్కలు చేసి పాలిద్దామనుకున్నారు.. భారత దేశంలో తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) విలీనం అయ్యాక కూడా ఇక్కడ సాయుధ పోరాటం కొనసాగించారు.. చివరకు నెహ్రూ జోక్యం, రష్యా నియంత స్టాలిన్ ఆదేశంతో పోరాటాన్ని విరమించారు.
బ్రిటిన్ తో రష్యాకు సంబంధాలు బాగా ఉన్న కాలంలో భారత కమ్యూనిస్టులు మన దేశ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉన్నారన్నది చారిత్రిక సత్యం.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ వారిపై పోరాటం చేపడితే ఆయన జపాన్ పెంపుడు కుక్క అంటూ నిందించారు కమ్యూనిస్టులు..
భారత దేశంపై చైనా దురాక్రమ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ CPI, CPMలుగా చీలిపోయింది.. సీపీఐ రష్యాకు, సీపీఎం చైనాకు మద్దతు పలికేవి..
రష్యాలో వర్షం పడితే ఇండియాలో గొడుగు పట్టిన చందంగా వ్యవహరించిన సీపీఐ, సోవియట్ యూనియన్ కుప్ప కూలడంతో అనాధగా మారింది.. మన దేశంపై చైనా దాడిని నిస్సిగ్గుగా సమర్ధించిన సీపీఎం ఇప్పుడు ఆ దేశంలోనే కమ్యూనిజానికి బీటలు పడటాన్ని జీర్ణించుకోలేకపోతోంది..
సైద్దాంతిక విబేధాలతో కమ్యూనిస్టులు ముక్కలు చెక్కలుగా చీలిపోతూ, ప్రజలకు దూరమవుతూ వచ్చారు.. వామపక్షాల ఐక్యత అన్నది పగటి కలగా మారింది.. 2014 లోక్ సభ ఎన్నికల్లో వారు గెలుచుకున్న సీట్ల సంఖ్య రెండు డిజిట్లు కూడా దాటలేదు..

భారత దేశ రాజకీయాల్లో క్రమంగా ఉనికిని కోల్పోతున్న వామపక్షాలు తమ పితృ దేశాలైన రష్యా, చైనాల అండ లేక ఇప్పుడు బిత్తరపోతున్నాయి.. ఇప్పుడు తమ విధేయ కేంద్రాన్ని పాకిస్తాన్ కు మార్చుకున్నాయేమో? అందుకే వేర్పాటు వాద, ఉగ్రవాద సంస్థలకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి.. JNUలో జాతి వ్యతిరేక శక్తులకు బాసటగా నిలవడం దేనికి ప్రతీక?

Sunday, February 14, 2016

facebookలో నాకు ఐదేళ్లు..

facebookలో నా పయనం 5 ఏళ్లు పూర్తయింది.. ఈ విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసేదాకా నాకే తెలియదు.. నా భావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే అవకాశం ఇచ్చిన facebookకు ముందుగా నా ధన్యవాదాలు.. జర్నలిస్టుగా నా అభిప్రాయాలను వెల్లడించడానికి పరిమితులు ఉంటాయి.. అయితే సోషల్ మీడియా నాకు ఆ స్వేచ్చను ఇచ్చింది.. facebook నా మిత్రుల జాబితాను ఘననీయంగా పెంచింది.. ఎంతో మంది కొత్త మిత్రులను అందించింది.. ప్రతి రోజూ పదుల సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నా నా జాబితాను 2000కే పరిమితం చేద్దామనుకున్నా.. ఎంత తొలగిస్తూ, కలుపుతూ పోయినా ఈ జాబితా 2500 దాటిపోయింది.. ఇబ్బడి ముబ్బడిగా జాబితా పెంచుకోవాలని, దీన్ని వ్యాపార సరకుగా మార్చాలనే ఆసక్తి నాకు ఏమాత్రం లేదు.. నిజానికి సోషల్ మీడియా ఒ వ్యసనం.. కాలాన్ని హరిస్తుంది.. క్రమంగా సోషల్ మీడియా నుండి వైదొలగాలని చాలా సార్లు అనుకున్నా అందుకు సాహసించలేకపోయాను.. నా సోషల్ మీడియా పయనంలో సహకరించిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు.. మున్ముందు మీ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..

ఇవాళో దిక్కుమాలిన దినం

ప్రేమికులకూ ఓ దినం ఉందంట.. అది ఫిబ్రవరి 14 అంట.. అంటే ఈ ఒక్కరోజులోనే ప్రేమ పుట్టి చచ్చిపోతుందా?
అసలు ప్రేమ అంటే ఏమిటి?.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం.. తల్లి దండ్రులను, భార్యా పిల్లలను తోబుట్టువులను, బంధు మిత్రులనూ ప్రేమిస్తాం..
మరి కేవలం యువతీ, యువకుల మధ్య ఆకర్షణ, శృంగారమే ప్రేమ అని ఎలా అనగలం?.. ఇదే నిజం అయితే జంతువులకు, మనుషులకు తేడా ఏం ఉంది? పాశ్చాత్య పోకడలు, చెత్త సాహిత్యం, సినిమాలు, మీడియా ప్రేమకు అర్ధం మార్చేసి దాన్ని ఒకే కోణంలో చూపుతున్నాయి..
ప్రేమికులు దినం పేరుతో విచ్చల విడిగా సినిమా థియేటర్లు, పార్కులు, పబ్బులు అంటూ తిరుగుతూ.. వికృత చేష్టలు చేస్తూ,  భజరంగ్ దళ్ వాడో పట్టుకొని ఎక్కడ పెళ్లి చేస్తాడోనని భయపడటంలో అర్థం ఉందా?
ప్రేమ అనేది తాత్కాలిక ఆకర్షణ కాదు.. దీనికో విస్తృత అర్ధం ఉంది.. ప్రేమ అనంతం, శాశ్వతం, నిత్యనూతనం.. ఇలాంటి ప్రేమకు ఓ దినం పెట్టుకోవడం భావ్యమేనా?
నిజానికి ఈ దిక్కుమాలిన వాలెంటైన్స్ డే మనది కాదు.. ఇదో మత పరమైన వేడుక.. వాలైంటన్ అనే మత ప్రచారకుడు సైనికులు యుద్దం చేయరాదంటూ, పెళ్లిళ్లు చేసుకొని సుఖంగా ఇంటి పట్టునే ఉండండంటూ ప్రచారం చేస్తుంటే రోమన్ చక్రవర్తి క్లాడియర్-ii అతన్ని బంధించారు.. ఇతగాడు ఏకంగా జైలర్ కూతురుకు ప్రేమ లేఖ రాశాడు.. ఈ ముసలి మత ప్రచారకుడు కూతురు వయసులో ఉన్న యువతికి లవ్ లెటర్ రాయడం ఏమిటి అని ఎవరూ ప్రశ్నించలేదెందుకో?
చివరకు చక్రవర్తి వాడిని ఉరి తీయడంతో ఇదో గొప్ప త్యాగదినం అంటూ వాలంటైన్స్ దినాలు మొదలుపెట్టారు..ఇలాంటి అర్థం పర్థం లేని వేలంటైన్స్ దినం మనకేల?..
ప్రేమ తత్వం మన దేశానికి కొత్త కాదు.. ప్రేమలు. పెళ్లిల్లూ భారతీయ సంస్కృతిలోనూ ఉన్నాయి.. పురాతన కాలంలో గంధర్వ వివాహాలు, స్వయంవరాలు తెలిసినవే.. రాధాకృష్ణులు, నల దమయంతులు.. ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.. సమాజ పరిణామ క్రమంలో సామాజిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రేమను వ్యక్తం చేసుకోవడానకి భారతీయులకంటూ ఉత్సవాలున్నాయి.. వసంతోత్సవం తెలిసిందే కదా?

ప్రేమను వ్యక్తీకరించుకోడానికి మన సంస్కృతి ప్రకారమే అవకాశాలు ఉన్నాక వేలంటేన్స్ డేలు ఎందుకో.. నా దృష్టిలో ఒదొక కమర్షియల్ వెస్ట్రన్ కల్చర్ మాత్రమే.. ఫిబ్రవరి 14 అంటే పక్తు వ్యాపారమే కనిపిస్తుంది.. గ్రీటింగ్ కార్డులు, బొకేల వ్యాపారానికి, గిఫ్టులు, హోటల్, రిసార్టుల వేడుకలు, టీవీ చానెళ్ల కమర్షియల్ ప్రోగ్రామ్ కోసమే పనికొచ్చే వేడుక ఇది. ఈ రోజున రోడ్లు, పార్కులు, రిసార్టుల వెంట తిరిగేవారిలో నిజమైన ప్రేమికులు చాలా తక్కువే.. ప్రేమ పేరిట బరితెగించి వాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే వారూ ఉన్నారు..
ప్రేమికులకు అడ్డు పడుతున్నారంటూ నిందించేవారు కూడా కాస్త ఆలోచించాలి.. విచ్చల విడిగా వ్యవహరించే వారిని ఓ కంట కనిపెట్టకపోతే ఆ నష్టం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.. నిజమైన ప్రేమను అర్థం చేసుకోండి.. నచ్చిన వారిని వివాహం చేసుకొని జీవితాన్ని పంచుకోండి..
నా వ్యాఖ్యలు కొందరికి కోపం కలిగించి ఉండొచ్చు.. ఉన్నమాటంటే ఎవరికైనా ఉలుకే..

ఉగ్రవాదుల మద్దతు కేంద్రంగా JNU

' ఇండియా డౌన్ డౌన్..
పాకిస్తాన్ జిందాబాద్..
కాశ్మీర్ విముక్తి పొందేదాక యుద్ధం కొనసాగుతుంది..
భారత దేశం నాశనం అయ్యే వరకు ఈ యుద్ధం..'
అమరవీరుడా అఫ్జల్ గురు.. నీ ఆశయాన్ని నెరవేరుస్తాం..
ఇండియా గో బ్యాక్‌..
జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర్యం ఇవాల్సిసిందే..’
ఈ స్లోగన్స్ పాకిస్థాన్లో చేసినవి కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీలోని JNUలో వినిపించిన నినాదాలు ఇవి.. మన దేశంలో పుట్టి.. మన దేశంలో పెరిగి.. దేశ ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా.. సబ్సిడీ ద్వారా ఉన్నత చదువులు చదుకుంటున్న విద్యార్థులు ఇలా ప్రవర్తించడం దారుణం..

మన దేశంలో అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్న పాకిస్థాన్‌ను.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మద్దతిస్తున్న ఈ విద్యార్థులు అసలు మనుషులేనా? యాకుబ్‌ మెమెన్‌.. అఫ్జల్ గురు లాంటి వారి మీద ఇంత ప్రేమ చూపిస్తున్న వీళ్లు.. మరి వీరి అరాచకాల కారణంగా.. వందలాది మంది భారతీయులు మీద చనిపోయారన్న స్పృహ ఏమాత్రం వీళ్లకు ఉందా..
ఒక్క JNUలొనే కాదు.. HCUతో సహా దేశంలోని యూనివర్సిటిల్లో కొన్ని విద్యార్థి సంఘాలు ఇంత నీచాతినీచంగా ప్రవర్తిస్తున్నారు.
ఇది ఒక మతానికో, కులానికో సంబంధించిన విషయం కాదు.. భారత దేశ స్వతంత్రం, సార్వభౌమత్వం, రాజ్యాంగం, ప్రజల మనోభావాలను సవాలు చేస్తున్న కొన్ని విదేశీ శక్తులు యూనివర్సిటీలను విద్రోహ కార్యకలాపాలకు వాడుకుంటున్నాయి..
దేశ ప్రజలంతా అప్రమత్తం కావాలి.. ఇలాంటి శక్తులను, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు, సంస్థలను దేశం నుండి తరిమి కొట్టాలి..

Saturday, February 13, 2016

కండువా మార్చడం చాలా ఈజీ..

ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షాన్ని దులిపేస్తున్నాడా?.. అయితే అతను రేపో మాపో కచ్చితగా ఆ గూటికి చేరతాడు.. లేదా ఆఫర్ కోసం ఇంకా గట్టిగా దుమ్మెత్తిపోస్తుంటాడు..
అధికార పక్షంలో ఉండి ప్రతి పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడా? సో అతడు వారి గుట్టు ముట్లు బాగా తెలిసిన మాజీ ప్రతిపక్షీయుడై ఉంటాడు..
చెరువు చేపలతో నుండుగా ఉన్నప్పుడే వలస పక్షులు వస్తాయి.. ఖాళీ అయితే తమదారి తాము చూసుకుంటాయి.. ఈ దిమ్మరులకు నీతి నిజాయితీలు ఉండవు.. విధేయతలూ చొక్కాలు, కండువాల్లాగే మారుతుంటాయి..ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రలో దొందుకు దొందే.. ఎవరూ సొక్కం కాదు..చివరకు నిలిచే నినాదం ఒక్కటే.. జై జంపింగ్ జపాంగ్.. జైజై జంప్ జిలానీ..

Friday, February 12, 2016

ఇష్రత్ వ్యవహారంలో తప్పటడుగు

నిజం నిప్పులాంటిది.. దాస్తే దాగ‌దు.. వాస్త‌వాలు ఏనాటికైనా బ‌య‌ట‌కు వ‌స్తాయి..
ఇష్ర‌త్ జ‌హాన్ విష‌యంలో ఇప్పుడు తేలింది అదే.. 2004లో నాటి గుజ‌రాత్ సీఎం న‌రేంద్ర మోదీని హ‌త్య చేసేందుకు వెళ్లిన బృందంలో ఆమె కూడా స‌భ్యురాలు..గుజ‌రాత్ పోలీసులు ఎన్ కౌంట‌ర్‌లో వీరిని మ‌ట్టుపెట్టిన‌ప్పుడు కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల‌తో స‌హా ప‌లు పార్టీలు, సంఘాలు, మీడియా నానా యాగి చేశాయి.. ఇది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ అని, అమాయ‌కురాలిని అన్యాయంగా హ‌త్య చేశార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు..
తాజాగా ముంబైపై దాడి కుట్ర‌దారుల్లో ఒక‌రైన డేవిడ్ హేడ్లీని విచారించ‌గా, ఇష్ర‌త్ జ‌హాన్ అస‌లు రంగు నిగ్గు తేలింది.. ఆమె మాన‌వ బాంబు అని హేడ్లీ తేట‌తెల్లం చేశారు..
ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌ను దేశ భ‌ద్ర‌తతో ముడి పెట్టే రాజ‌కీయ పార్టీల‌కు ఇష్ర‌త్ జ‌హాన్ వ్య‌వ‌హారం క‌నువిప్పు క‌లిగించాలి..

వర్సిటీల్లో విద్రోహక శక్తులు

విశ్వ విద్యాల‌యాలు విద్రోహ నిలయాలుగా మారుతున్నాయా?.. విచ్చిన్న‌క‌ర శ‌క్తులు విద్యార్థుల్లో విష బీజాలు నాటుతున్నాయా?.. మొన్న హైద‌రాబాద్‌లో HCU.. నిన్న దేశ రాజ‌ధాని ఢిల్లీలో JNUలో జ‌రిగింది ఏమిటి?.. ముంబై బాంబు పేలుళ్ల కుట్ర‌దారు యాకుబ్ మెమ‌న్‌, పార్ల‌మెంట్‌పై దాడి కేసు దోషి అఫ్జ‌ల్ గురుల‌కు ఉరి శిక్ష విధించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ ఈ యూనివ‌ర్సిటీల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌ర‌ప‌డాన్ని మ‌నం ఏ ర‌కంగా అర్థం చేసుకోవాలి.. దేశ ద్రోహుల‌కు శిక్ష‌ను జ‌రిపిన ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు విశ్వ‌విద్యాల‌యాలే ఎందుకు వేదిక‌లు అయ్యాయి.. వీరి వెనుక ఎవ‌రున్నారు.. దేశ భ‌ద్ర‌త‌ను రాజ‌కీయ కోణంలో చూడ‌టం స‌బ‌బేనా? ఆలోచించండి..

వర్మ ప్రకటన నమ్మొచ్చా?

నమ్మొచ్చంటారా?.. గతంలో ఒకసారి సెన్సార్ వాళ్లతో గొడవపడి అసలు తెలుగు సినిమాలే ఇక తీయనని ప్రకటించారు ఈ వర్మ.. ఆ తర్వాత ఒట్టు తీసి గట్టున పెట్టారు.. ఇప్పుడేమో ఇదే ఆఖరి తెలుగు సినిమా అట. తన కొత్త సినిమాలను ప్రమోట్ చేసేందుకు సంచలన ప్రకటన చేయడం వర్మ స్టైల్.. ఇదీ అలాంటి ఎత్తుగడేనా?

Thursday, February 11, 2016

మేడారం స్పెషల్ బస్సులకు అధనపు బాదుడు ఎందుకు?

పూర్వం తీర్థయాత్రలకు వెళ్లే యాత్రీకుల నుండి జిజియా పన్ను వసూలు చేసేవారు.. దారిలో బందిపోట్లు దోచుకునేవారు.. ఇప్పుడు ఈ బాధ్యతను సెక్యులర్ ప్రభుత్వాలు, ఆర్టీసీ స్వీకరించాయి..
ముస్లింల హజ్ యాత్రలకు ప్రభుత్వాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్నాయి.. హజ్ హౌస్ నుండి ఎయిర్ పోర్టుకు ఉచితంగా ఏసీ బస్సుల్లో తీసుకుళుతున్నారు.. కానీ హిందువుల పండుగలు, ఉత్సవాలు జరిగినప్పుడు బస్సు ఛార్జీలు భారీగా పెంచేసి దోచుకుంటున్నారు..
తాజాగా సమ్మక్క సారలమ్మ జాతర విషయానికి వద్దాం.. కరీంనగర్ నుండి వరంగల్ మీదుగా మేడారం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో మామూలు రోజుల్లో టికెట్ ధర రూ.130 మాత్రమే.. ఇప్పుడు మేడారం స్పెషల్ పేరుతో రూ.250 వసూలు చేసేందుకు సిద్దమైంది ఆర్టీసీ..
హిందూ పర్వదినాలు అంటే ప్రభుత్వానికి ఎందుకు చులకన?.. హిందూ తీర్ధయాత్రికులపై ఆర్టీసీ ఎందుకు వివక్ష చూపుతోంది?.. జాగో బంధూ ప్రభుత్వాన్ని, ఆర్టీసీని గట్టిగా నిలదీయండి.. సబ్సిడీ ఇచ్చి తక్కువ ఛార్జీలు తీసుకోవాలని డిమాండ్ చేయండి..

Sunday, February 7, 2016

హైదరాబాద్ ఎవరి రాజధాని?

ఐటీ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం విశ్వ నగరంగా మారుతోందని మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెబుతున్నారు.. కానీ అధికార యంత్రాంగం మాత్రం ఈ స్పీడును అందుకుందా అనే అనుమానం కలుగుతోంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తుంది.. కానీ ఈ వాస్తవాన్ని గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ గుర్తించినట్లు లేదు.. హైదరాబాద్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిగానే వారు అధికారికంగా చెబుతున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావచ్చు.. కానీ ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు కూడా రాజధాని అని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తిస్తే మంచిది..

ఈ గోలంతా ఏమిటి అనుకుంటున్నారా? అయితే జీహెచ్ఎంసీ పోర్టల్ లింకు http://www.ghmc.gov.in/hyd/hydhistory.asp  ఓసారి క్లిక్ చేసి చూడండి.. తాజా సమాచారాన్ని ప్రజలకు అందించడంలో వారు ఎంత వెనుకబడి ఉన్నారో మీకే తెలుస్తుంది.. ఇందులో 1591లో హైదరాబాద్ నగరం ఏర్పడింది మొదలు 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి వరకూ చరిత్ర కనిపిస్తుంది,, కానీ 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడిన విషయాన్ని మాత్రం గుర్తించలేదు. 

GHMC ఎన్నికల్లో TRS ఏకపక్ష విజయానికి కారణాలు ఇవే..


గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యతతో విజయాన్ని సాధించడం వెనుక కారణాలు అనేకం ఉన్నాయి.. ఇందు కోసం అధికార పార్టీ సామ దాన భేద దండోపాయాలను చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించింది..
2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో TRS ఘన విజయం సాధించి అధికారం చేపట్టినా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో BJP-TDP అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.. ఈ కారణం వల్ల TRS ప్రభుత్వం సకాలంలో GHMC ఎన్నికలను నిర్వహించలేదు.. ఇందుకు పుర్విభజనను కారణంగా చూపింది.. ఏడాదిన్న జాప్యం తర్వాత హైకోర్టు తీవ్రంగా మందలించడంతో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు..
వార్డుల పునర్విజన 200 లేదా 175 సీట్లు అంటూ కొంత జాప్యం చేశారు.. చివరకు ఉన్న 150 సీట్లలోనే పునర్విభజన జరిగింది.. ఈ సందర్భంగా TRS-MIMలు తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నాయి.. దీనిపై BJP,TDP, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోలేదు..
మరోవైపు ప్రతిపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఓటర్లను తొలగించారు.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పోవడంతో అక్కడి నుండి విచారణ బృందం వచ్చి ఇది నిజమని తేల్చింది.. విధిలేని పరిస్థితుల్లో తప్పను సరిదిద్దుతామని ప్రభుత్వం అంగీకరించింది.. కానీ తొలగించిన ఓట్లను చాలా వరకు తిరిగి చేర్చలేదు..
వార్డుల రిజర్వేషన్లు ఎన్నికల నోటిఫికేషన్ వరకూ ప్రకటించడలేదు.. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే అందులోని లోపాలపై కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా, అదే రోజు నోటిఫికేషన్ ప్రకటించడం గమనార్హం.. ఏ వార్డు ఎవరికి రిజర్వు అవుతుందనేది అధికార TRS పార్టీకి ముందే తెలుసు. వార్డుల్లో ముందుగానే వెలిసిన ఆ పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇందుకు ఉదాహరణ.. తమకు అభ్యర్థులు లేని చోట్లు ఇతర పార్టీలో బలంగా ఉన్న నాయకులను చేర్చకున్నారు..
ఒక తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అంటూ ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, బలమైన నాయకులను భారీ ఎత్తున TRSలో చేర్చుకున్నారు.. బంగారు తెలంగాణ పేరుతో పదవులు, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాలను చీల్చారు.. ఈ తతంగం ఎన్నికల దాకా కొనసాగింది..
చివరగా బూటకపు వాగ్దానాలు కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి బాగానే పనికి వచ్చారు.. TRS ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్దికి ఈ ఏడాదిన్నలో చేసింది ఏమీ లేదు.. నిజం నిద్ర లేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు..
గుంతలు తేలిన రోడ్లు, అధ్వాన్న డ్రైనేజీ, రోడ్లపై చెత్తా చెదారం కూడా సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన Metro Rail తొలిదశ గత ఏడాది దసరా నాటికి ప్రారంభం కావాల్సి ఉంది.. అలైన్ మెంట్ మార్పుల పేరుతో చాలా రోజులు పనులను ఆపడంతో సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది.. అయినా Metro Rail తమ ఘనత అని చాటుకుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనుల కారణంగానే నగరానికి గోదావరి జలాలు వచ్చాయి.. ఇక ఐదు రూపాయలకు మధ్యాహ్న భోజన పథకం కూడా గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైందే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లూ, ఇంటింటా చెత్తబుట్టలు అంటూ హడావుడి చేసింది ప్రభుత్వం.. కానీ వీటి లబ్దిదారులు ఎంత మంది?..
గతంలో కాంగ్రెస్ పార్టీ MIM పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకునేది.. ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో TRSతో వీరికి దోస్తీ కుదిరింది.. ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శం..

అన్నింటి కన్నా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికార పార్టీ జట్టులో ఎన్నికల సంఘం ఓ ప్లేయర్ గా పని చేసింది.. నగరం అంతటా నింబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు నింపేసినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు.. ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవడానికి చోటు కరువైంది.. హైదరాబాద్ నగరంలో జిల్లా నుండి వచ్చి తిష్టేసిన అధికార పార్టీ నాయకులు క్యాడర్ అందరికన్నా ముందు ప్రచారాన్ని మొదలు పెట్టారు.. వార్డుల రిజర్వేషన్ల గందరగోళం, సీట్ల సర్దుబాటు జాప్యం, తిరుగుబాట్ల కారణంగా ప్రతిపక్షాలకు ప్రచారంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడింది.. అధికార పార్టీ ధన బలం కూడా ఎన్నికల్లో ఎక్కువగా పని చేసింది..

Saturday, February 6, 2016

తెరాస అసమాన్య విజయం

హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన చారిత్రిక విజయంతో చరిత్రను తిరగ రాసింది తెలంగాణ రాష్ట్ర సమితి.. భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భాగ్యనగరంలో నగరంలో ఇలాంటి ఏకపక్ష విజయం సామాన్యమైనది కాదు.. మనలో ఎన్ని రాజకీయ, సైద్దాంతిక విభేదాలు ఉన్నా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే.. అధికార పార్టీని ఎదుర్కోవడంలో విపక్షాలు ఘోర వైఫల్యాన్ని మూట గట్టుకున్నాయి.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ విపక్ష నాయకులు, కార్యకర్తలను నయానో భయానో దారికి తెచ్చుకొన్ని బలహీన పరచి ఉండొచ్చు.. గెలిచిన వారిలో అత్యధికులు కండువాలు మార్చినవారే కావొచ్చు.. ప్రజల అంతిమ తీర్పే ముఖ్యం కాదా.. అయినా విజయంతో బారా ఖూన్ మాఫ్.. ఇదంతా బంగారు తెలంగాణ కోసమే అనుకుందాం.. విశ్వ నగరంగా భాగ్యనగరం ఎదగడానికే ఈ విజయం అని గర్వపడదాం.. భాగ్య విధాతకు వందనాలు..

Thursday, February 4, 2016

ఢిల్లీ సీఎం పేదవాడు కదా మరి..

ఇటీవల గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిధిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాందే గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. హొలాందేకు కేజ్రీవాల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. ఆ సందర్భంగా కేజ్రీవాల్ పాదాల వైపు చూసి బిత్తరపోయాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు..
విదేశీ ప్రముఖులు వచ్చినప్పుడు ఆహార్యం విషయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారి విధి.. సాదా సీదా దుమ్ము పట్టిన పాత చెప్పులతో కేజ్రీవాల్ ఈ కార్యక్రమానికి వచ్చాడు.. ఇది చూసిన విశాఖ కుర్రాడు సుమిత్ అగర్వాల్ కు మండింది.. వెంటనే షూస్ కొనుక్కోమంటూ ఢిల్లీ సీఎంకు 364/- పంపాడు..
పాపం కేజ్రీవాల్ చాలా పేదవాడు కదా.. ఆయన నెల జీతం 2,10,000/- మాత్రమే.. ఇంత తక్కువ జీతంతో బతుకీడుస్తున్న సీఎం గారికి షూస్ కొనుక్కునే స్థోమత ఎక్కడిది..

పబ్లిసిటీ స్టంట్ల కోసం మఫ్లర్ మీద టోపీ పెట్టుకోవడం లాంటీ  వింత వేషాలు వేయడం కేజ్రీవాల్ కు వెన్నతో పెట్టిన విద్య.. ఓ వైపు రహస్యంగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ప్రయాణాలూ చేయగలడు.. మరోవైపు ఢిల్లీలో ఆటోలో ప్రయాణించి ప్రజల చెవుల్లో పూవులు పెట్టగలడు కేజ్రీవాల్.. 

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం Breaking India

భారతదేశాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా కొన్నివిచ్చిన్నకర  శక్తులు కుల, మత, ప్రాంతీయ ఉద్యమాల్లో, రాజకీయ పార్టీలలో చొరబడుతున్నాయన్నది బహిరంగ రహస్యం.. దేశ వ్యాప్తంగా కొంత కాలంగా జరుగుతున్న కార్యకలాపాలను అధ్యయనం చేస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది.. దేశ ప్రజలంతా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.. ఈ అంశంపై రాజీవ్ మల్మోత్రా, అరవిందన్ నీలకందన్ కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

Wednesday, February 3, 2016

పాత బస్తీ జబర్దస్తీ తెలిసొచ్చిందా?

పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది.. ఇది టీఆర్ఎస్ పార్టీకి కూడా గుణపాఠమే..
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో ఏకంగా పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షడు షబ్బీర్ అలీపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో ఎంఐఎం నాయకులు కార్యకర్తలు దాడులకు దిగారు.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపై దాడి చేసి ఆయన కుమారున్ని కొట్టారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాల..
పాతబస్తీకి ఎందుకు వచ్చారని కాంగ్రెస్ నేతలను బెదిరించారు ఓవైసీ.. అవును మరి వారి తాత గారి జాగీరుగా రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీయే కదా.. పాతబస్తీలో మజ్లిస్ ఈ స్థాయిలో ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీయే కారణం. కాంగ్రెస్ పాలకులు పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లిస్ ను పెంచి పోషించారు.. ఆ పార్టీ నాయకుల ఆగడాలకు వత్తాసు పలికారు.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రాభవం కోల్పోవడంతో మజ్లిస్ అధికార తెరాసతో దోస్తీకి దిగింది..

తాము చేసిన తప్పుకు కాంగ్రెస్ నేతలు తమను తాము నిందించుకొని ఉండాలి.. అధికార  టీఆర్ఎస్ ఇకనైనా ఎంఐఎంను అదుపులో పెట్టాలి.. వారికి ఉన్మాదం తప్ప దోస్తీకి, దుష్మనీకి తేడా తెలియదు.. కిరణ్ కుమార్ రెడ్డే వీరికి సరైన మొగుడు..

Tuesday, February 2, 2016

పొండ్రి పొండ్రి జల్ది ఓటేసి రాండ్రి..

ఓటేద్దాం రాండ్రి..

గ్రేటర్ హైదరాబాద్ ఓటరులారా..  మీ అమూల్యమైన ఓటు హక్కును ప్రజలకు అందుబాటులో ఉండే మంచి అభ్యర్థులకే వేయండి.. ప్రలోభాలకు లొంగకండి.. రౌడీలు, గుండాలు, భూకబ్జాదారులకు, పార్టీ పిరాయింపుదారులకు బుద్ది చెప్పండి..

Monday, February 1, 2016

దేశ భద్రతకు సవాలు విసురుతున్న కులతత్వం

మొన్న రాజస్థాన్.. నిన్న గుజరాత్.. ఇవాళ ఆంధ్రప్రదేశ్.. మరి రేపు ఇంకెక్కడో.. వీరందరిదీ ఒక్కటే డిమాండ్ అదే రిజర్వేషన్.. మరి కొన్ని వర్గాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.. వీరి డిమాండ్లలో న్యాయం ఉండొచ్చు.. దీన్ని తప్పు పట్టడం నా ఉద్దేశ్వం కాదు.. కానీ కొందరు స్వార్థ నాయకులు తమ ప్రయోజనాల కోసం హింసకు ప్రేరేపించడమే ఆందోళన కలిగిస్తోంది..
ప్రపంచ జనాభా రీత్యా భారత్ రెండో అతిపెద్ద దేశం.. కొద్ది సంవత్సరాలుగా భారతీయులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలతో ప్రపంచమంతా మనవైపే చూస్తోంది.. అగ్ర దేశాల్లో సైతం మనవాళ్లు రాణిస్తున్నారు.. భారతీయుల ప్రతిభను, మేధోసంపత్తిని గుర్తించిన ప్రపంచ దేశాలు మన దేశాన్ని విస్మరించలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు భారత దేశంలో జరుగుతున్నది ఏమిటి?...
కులాలు, రిజర్వేషన్ల పేరుతో మనం కొట్టుకు చస్తున్నాం.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కుల రహిత సమాజ స్థాపన దిశగా అణగారిన వర్గాలకు వివిధ రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశ పెట్టారు.. దానికి కాల పరిమితి విధించారు.. కానీ స్వార్థ రాజకీయ నాయకులు సంతృష్టీకరణ విధానాలతో అసలు లక్ష్యానికే గండికొడుతున్నారు..
రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వర్గాలు క్రమంగా ఇతర వర్గాలతో సమస్థాయికి ఎదగాలి.. క్రమంగా రిజర్వేషన్ల విధానాన్ని ఎత్తి వేయాలి.. కానీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వర్గాలు తగ్గకపోగా కొత్తగా తమను ఈ కేటగిరీల్లో చేర్చాలని ఇతరుల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి.. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వర్గాలు ఈ వ్యవస్థ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాయి.. ఇలా అయితే బాబాసాహెబ్ కన్న కలలు నెరవేరేది ఎప్పుడు?
ఇదంతా ఒక ఎత్తయితే జాతీయ నాయకుల పేర్లతో వెలిసిన కొన్ని సంస్థలు విద్రోహ శక్తులకు మద్దతు పలుకుతూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.. దేశ సార్వభౌమత్వాన్నే సవాలు చేస్తున్నాయి.. ఇలాంటి శక్తులకు రాజకీయ పార్టీలు సిగ్గు లేకుండా మద్దతు పలుకుతున్నాయి.. మన విద్యాలయాల ప్రాంగణాలను యుద్ధ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి..

కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భారత దేశానికి వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది.. దేశంలో కుల మతాల కుమ్ములాటలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన వైఖరిని అవలంభించాల్సిన అవసరం ఉంది.. లేకపోతే మన దేశ అస్థిత్వానికే ప్రమాదం..

హైదరాబాద్ ను గెలిపించుకోండి..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో హైదరాబాద్ వాసులు ఈపాటికే ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు.. అయినా ఓటర్లు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది..
ఇవి పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరుకు ఏరకంగా కూడా ప్లెబిసైట్లు కాదు.. కాబట్టి రాజకీయ పార్టీల అభ్యర్థులకే ఓటు వేయాలనే నియమం లేదు.. గెలిచే అభ్యర్థులు హైదరాబాద్ నగరంలో స్థానిక సమస్యల పరిష్కారానికి మాత్రమే కృషి చేయాలి.. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఏమాత్రం సంబంధం లేదు అని గ్రహించండి.. ఎన్నికల్లో ఎవరు గెలిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నగరానికి న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధుల వాటాలు రావాల్సిందే.. తమకు ఓటు వేయలేదని వారు తొక్కి పెట్టే అవకాశం ఏమాత్రం లేదు..
పార్టీ ఫిరాయింపు దారులను, రాజకీయ అవకాశవాదులను కచ్చితంగా ఓడించండి.. స్వలాభాల కోసం అమ్ముడుపోయిన వీరు ప్రజాప్రతనిధులుగా ఏమాత్రం పనికిరారు.. తమ పార్టీలకే ద్రోహం చేసిన వాడు ప్రజలను కూడా మోసగించడనే గ్యారంటీ ఏమిటి?
అభ్యర్థుల పార్టీలను కాకుండా, అభ్యర్థుల గుణగణాలను పరిగణనలోకి తీసుకోండి.. మీకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించే అభ్యర్థినే ఎన్నుకోండి.. గుండాలు, అవినీతిపరులకు అసలు ఓట్ల వేయకండి.. నీతి నిజాయితీ ఉన్న వారినే ఎన్నుకోండి..
కుల, మతాలు, రాజకీయాల ఆధారంగా ఓటు వేస్తే అభ్యర్థులు తమ వర్గాలకే పరిమితం అవుతారే తప్ప నిజమైన ప్రజాప్రతినిధులుకాదు..
అభ్యర్థి బాగా డబ్బు ఖర్చుపెట్టాడు.. జోరుగా ప్రచారం చేశాడు కాబట్టి అతనికే ఓటు వేద్దామని అనుకోకండి.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న అభ్యర్థులు రేపు గెలిస్తే అవినీతి, అనైతిక కార్యకలాపాలతో ఈ పెట్టుబడిని అంతా రాబట్టుకోవడం ఖాయం.. వీరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు గుంజి పనుల నాణ్యతను దెబ్బతీస్తారని గ్రహించండి..
మీ బస్తీకి మంచినీరు సక్రమంగా వస్తోందా?, డ్రైనేజీలు, టాయిలెట్లు, పారిశుధ్యం, రోడ్లు, వీధి దీపాలు, పార్కులు బాగున్నాయా?.. ఏ అభ్యర్థికి వీటిని పరిష్కరించే సత్తా ఉందో వారికే ఓటు వేయండి.. గెలిచే అభ్యర్థులు ప్రజల మధ్య ఉండాలి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలను మీకు అందించడంలో సాయపడతారనే నమ్మకం ఉన్నవారికే ఓటు వేయండి..

ఈ ఎన్నికల్లో మీకు కచ్చితంగా ఓటు వేయండి.. అది మంచి అభ్యర్థికి మాత్రమే.. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మీ ఓటు దోహదపడేలా చూసుకోండి..