ఇటీవల
గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిధిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాందే గౌరవార్థం
రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. హొలాందేకు
కేజ్రీవాల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. ఆ సందర్భంగా కేజ్రీవాల్ పాదాల వైపు చూసి
బిత్తరపోయాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు..
విదేశీ
ప్రముఖులు వచ్చినప్పుడు ఆహార్యం విషయంలో ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత రాజ్యాంగ బద్ద
పదవుల్లో ఉన్న వారి విధి.. సాదా సీదా దుమ్ము పట్టిన పాత చెప్పులతో కేజ్రీవాల్ ఈ
కార్యక్రమానికి వచ్చాడు.. ఇది చూసిన విశాఖ కుర్రాడు సుమిత్ అగర్వాల్ కు మండింది..
వెంటనే షూస్ కొనుక్కోమంటూ ఢిల్లీ సీఎంకు ₹ 364/- పంపాడు..
పాపం
కేజ్రీవాల్ చాలా పేదవాడు కదా.. ఆయన నెల జీతం ₹ 2,10,000/-
మాత్రమే.. ఇంత తక్కువ జీతంతో బతుకీడుస్తున్న సీఎం గారికి
షూస్ కొనుక్కునే స్థోమత ఎక్కడిది..
పబ్లిసిటీ
స్టంట్ల కోసం మఫ్లర్ మీద టోపీ పెట్టుకోవడం లాంటీ వింత వేషాలు వేయడం కేజ్రీవాల్ కు వెన్నతో
పెట్టిన విద్య.. ఓ వైపు రహస్యంగా బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ప్రయాణాలూ చేయగలడు.. మరోవైపు
ఢిల్లీలో ఆటోలో ప్రయాణించి ప్రజల చెవుల్లో పూవులు పెట్టగలడు కేజ్రీవాల్..
No comments:
Post a Comment