మొన్న
రాజస్థాన్.. నిన్న గుజరాత్.. ఇవాళ ఆంధ్రప్రదేశ్.. మరి రేపు ఇంకెక్కడో.. వీరందరిదీ
ఒక్కటే డిమాండ్ అదే రిజర్వేషన్.. మరి కొన్ని వర్గాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి..
వీరి డిమాండ్లలో న్యాయం ఉండొచ్చు.. దీన్ని తప్పు పట్టడం నా ఉద్దేశ్వం కాదు.. కానీ
కొందరు స్వార్థ నాయకులు తమ ప్రయోజనాల కోసం హింసకు ప్రేరేపించడమే ఆందోళన
కలిగిస్తోంది..
ప్రపంచ
జనాభా రీత్యా భారత్ రెండో అతిపెద్ద దేశం.. కొద్ది సంవత్సరాలుగా భారతీయులు వివిధ
రంగాల్లో సాధిస్తున్న విజయాలతో ప్రపంచమంతా మనవైపే చూస్తోంది.. అగ్ర దేశాల్లో సైతం
మనవాళ్లు రాణిస్తున్నారు.. భారతీయుల ప్రతిభను, మేధోసంపత్తిని గుర్తించిన ప్రపంచ
దేశాలు మన దేశాన్ని విస్మరించలేని పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు భారత దేశంలో
జరుగుతున్నది ఏమిటి?...
కులాలు,
రిజర్వేషన్ల పేరుతో మనం కొట్టుకు చస్తున్నాం.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్
అంబేద్కర్ కుల రహిత సమాజ స్థాపన దిశగా అణగారిన వర్గాలకు వివిధ రంగాల్లో
రిజర్వేషన్లను ప్రవేశ పెట్టారు.. దానికి కాల పరిమితి విధించారు.. కానీ స్వార్థ రాజకీయ
నాయకులు సంతృష్టీకరణ విధానాలతో అసలు లక్ష్యానికే గండికొడుతున్నారు..
రిజర్వేషన్
ఫలాలు అనుభవిస్తున్న వర్గాలు క్రమంగా ఇతర వర్గాలతో సమస్థాయికి ఎదగాలి.. క్రమంగా
రిజర్వేషన్ల విధానాన్ని ఎత్తి వేయాలి.. కానీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వర్గాలు
తగ్గకపోగా కొత్తగా తమను ఈ కేటగిరీల్లో చేర్చాలని ఇతరుల నుండి డిమాండ్లు
పెరుగుతున్నాయి.. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వర్గాలు ఈ
వ్యవస్థ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాయి.. ఇలా అయితే బాబాసాహెబ్ కన్న కలలు
నెరవేరేది ఎప్పుడు?
ఇదంతా
ఒక ఎత్తయితే జాతీయ నాయకుల పేర్లతో వెలిసిన కొన్ని సంస్థలు విద్రోహ శక్తులకు మద్దతు
పలుకుతూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.. దేశ సార్వభౌమత్వాన్నే
సవాలు చేస్తున్నాయి.. ఇలాంటి శక్తులకు రాజకీయ పార్టీలు సిగ్గు లేకుండా మద్దతు
పలుకుతున్నాయి.. మన విద్యాలయాల ప్రాంగణాలను యుద్ధ కేంద్రాలుగా మార్చేస్తున్నాయి..
కొంత
కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భారత దేశానికి వ్యతిరేకంగా ఏదో కుట్ర
జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది.. దేశంలో కుల మతాల కుమ్ములాటలను
ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన వైఖరిని అవలంభించాల్సిన అవసరం ఉంది.. లేకపోతే మన దేశ
అస్థిత్వానికే ప్రమాదం..
No comments:
Post a Comment