Sunday, February 7, 2016

GHMC ఎన్నికల్లో TRS ఏకపక్ష విజయానికి కారణాలు ఇవే..


గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఆధిక్యతతో విజయాన్ని సాధించడం వెనుక కారణాలు అనేకం ఉన్నాయి.. ఇందు కోసం అధికార పార్టీ సామ దాన భేద దండోపాయాలను చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించింది..
2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో TRS ఘన విజయం సాధించి అధికారం చేపట్టినా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో BJP-TDP అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది.. ఈ కారణం వల్ల TRS ప్రభుత్వం సకాలంలో GHMC ఎన్నికలను నిర్వహించలేదు.. ఇందుకు పుర్విభజనను కారణంగా చూపింది.. ఏడాదిన్న జాప్యం తర్వాత హైకోర్టు తీవ్రంగా మందలించడంతో ఎన్నికలు నిర్వహించక తప్పలేదు..
వార్డుల పునర్విజన 200 లేదా 175 సీట్లు అంటూ కొంత జాప్యం చేశారు.. చివరకు ఉన్న 150 సీట్లలోనే పునర్విభజన జరిగింది.. ఈ సందర్భంగా TRS-MIMలు తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నాయి.. దీనిపై BJP,TDP, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోలేదు..
మరోవైపు ప్రతిపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఓటర్లను తొలగించారు.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పోవడంతో అక్కడి నుండి విచారణ బృందం వచ్చి ఇది నిజమని తేల్చింది.. విధిలేని పరిస్థితుల్లో తప్పను సరిదిద్దుతామని ప్రభుత్వం అంగీకరించింది.. కానీ తొలగించిన ఓట్లను చాలా వరకు తిరిగి చేర్చలేదు..
వార్డుల రిజర్వేషన్లు ఎన్నికల నోటిఫికేషన్ వరకూ ప్రకటించడలేదు.. రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే అందులోని లోపాలపై కోర్టుకు వెళ్లే అవకాశం లేకుండా, అదే రోజు నోటిఫికేషన్ ప్రకటించడం గమనార్హం.. ఏ వార్డు ఎవరికి రిజర్వు అవుతుందనేది అధికార TRS పార్టీకి ముందే తెలుసు. వార్డుల్లో ముందుగానే వెలిసిన ఆ పార్టీల అభ్యర్థుల పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇందుకు ఉదాహరణ.. తమకు అభ్యర్థులు లేని చోట్లు ఇతర పార్టీలో బలంగా ఉన్న నాయకులను చేర్చకున్నారు..
ఒక తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ అంటూ ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, బలమైన నాయకులను భారీ ఎత్తున TRSలో చేర్చుకున్నారు.. బంగారు తెలంగాణ పేరుతో పదవులు, ప్రలోభాలకు గురి చేసి ప్రతిపక్షాలను చీల్చారు.. ఈ తతంగం ఎన్నికల దాకా కొనసాగింది..
చివరగా బూటకపు వాగ్దానాలు కూడా ఓటర్లను ప్రభావితం చేయడానికి బాగానే పనికి వచ్చారు.. TRS ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్దికి ఈ ఏడాదిన్నలో చేసింది ఏమీ లేదు.. నిజం నిద్ర లేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు..
గుంతలు తేలిన రోడ్లు, అధ్వాన్న డ్రైనేజీ, రోడ్లపై చెత్తా చెదారం కూడా సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన Metro Rail తొలిదశ గత ఏడాది దసరా నాటికి ప్రారంభం కావాల్సి ఉంది.. అలైన్ మెంట్ మార్పుల పేరుతో చాలా రోజులు పనులను ఆపడంతో సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది.. అయినా Metro Rail తమ ఘనత అని చాటుకుంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనుల కారణంగానే నగరానికి గోదావరి జలాలు వచ్చాయి.. ఇక ఐదు రూపాయలకు మధ్యాహ్న భోజన పథకం కూడా గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైందే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లూ, ఇంటింటా చెత్తబుట్టలు అంటూ హడావుడి చేసింది ప్రభుత్వం.. కానీ వీటి లబ్దిదారులు ఎంత మంది?..
గతంలో కాంగ్రెస్ పార్టీ MIM పార్టీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకునేది.. ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో TRSతో వీరికి దోస్తీ కుదిరింది.. ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శం..

అన్నింటి కన్నా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అధికార పార్టీ జట్టులో ఎన్నికల సంఘం ఓ ప్లేయర్ గా పని చేసింది.. నగరం అంతటా నింబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు నింపేసినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు.. ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోవడానికి చోటు కరువైంది.. హైదరాబాద్ నగరంలో జిల్లా నుండి వచ్చి తిష్టేసిన అధికార పార్టీ నాయకులు క్యాడర్ అందరికన్నా ముందు ప్రచారాన్ని మొదలు పెట్టారు.. వార్డుల రిజర్వేషన్ల గందరగోళం, సీట్ల సర్దుబాటు జాప్యం, తిరుగుబాట్ల కారణంగా ప్రతిపక్షాలకు ప్రచారంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడింది.. అధికార పార్టీ ధన బలం కూడా ఎన్నికల్లో ఎక్కువగా పని చేసింది..

No comments:

Post a Comment