Friday, February 19, 2016

దేశభక్తి గురుంచి సుద్దులు సరే..

దేశభక్తి తన రక్తంలోనే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాడు రాహుల్ గాంధీ.. అంత దేశభక్తి ఉంటే JNU, HCUలలో దేశద్రోహులైన అఫ్జల్ గురు, మెమన్ లకు మద్దతుగా సభలు పెట్టిన విద్యార్థులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్లినట్లు? ఈ దేశ పార్లమెంటుపై దాడి, ముంబై మారణకాండకు కారకులైన ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేయడాన్ని రాహుల్ వ్యతిరేకిస్తున్నారా?.. మరి వీరికి ఉరిశిక్షను అమలు చేసింది ఆయన తల్లి సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ సర్కారే కదా? అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?.. ఉగ్రవాదానికి బలైన అమాయక దేశ పౌరులకన్నా, ఇందుకు కారకులైన దేశ ద్రోహుల ప్రాణాలు విలువైనవని రాహుల్ గాంధీ చెప్పదలచుకున్నారా?
పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఆజ్యం పోసింది ఎవరు? చివరకు వారి చేతిలోనే ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు.. శ్రీలంకలో ఈలం కోసం పోరాడిన LTTEకి తమిళనాడులో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసింది ఎవరు?.. రాజీవ్ గాంధీని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు వారు.. తన నాన్నమ్మ, నాన్నల ఉదంతాల నుండి అయినా రాహుల్ గుణపాఠం నేర్చుకోవాలి.. పాముకు పాలు పోస్తే కాటేయకుండా ఉంటుందా?

చివరగా.. దేశభక్తి రక్తంలోనే కాదు.. బుర్రలో కూడా ఉండాలి..

No comments:

Post a Comment