Saturday, February 27, 2016

హిందూ అంటే ఉలిక్కి పడతారెందుకు?

భారత దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందట.. పార్లమెంటులో ప్రతిపక్షాల గగ్గోలు ఇది..
మనది హిందూ దేశమే కదా?.. ప్రత్యేకంగా మార్చడం ఏమిటి?.. హిందూ అనేది కొత్తగా వచ్చిన పదం అన్నట్లు అలా ఉలికి పడతారెందుకు? ప్రాచీన కాలం నుండి మన దేశం పేరే అది కదా?.. ఏం చరిత్ర మరచిపోయారా?.. లేక మరిచిపోయినట్లు నటిస్తున్నారా?..
చిన్నప్పుడు మీరు చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో హిందూ దేశ చరిత్ర అనే చాప్టర్ కనిపించలేదా?.. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ చిత్ర పటాలను చూడండి.. హిందుస్థాన్ అని కనిపించకపోతే ఓసారి కళ్ల డాక్టర్ దగ్గరకు పోండి..
జై హింద్ అనే నినాదం.. సారే జహాసే అచ్చా హిందూ సితాహ్ హమారా అనే గీతం సంగతి ఏమిటి?
అంతెందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ కేబుల్స్ లకు ఆ పేర్లు ఎవరు పెట్టారు?..  ప్రయివేటు సంస్థలు హిందుస్థాన్ లీవర్, హిందుస్థాన్ మోటార్స్ కంపెనీల మాటేమిటి?.. చివరికి ది హిందూ, హిందుస్థాన్ టైమ్స్ పత్రికలను కూడా మీరు ఎప్పుడూ చూడలేదా?
ఇప్పుడు చెప్పండి.. మన దేశం హిందుస్థాన్ కాదా?.. స్వాతంత్ర్యానంతరం కొందరు సంకుచిత నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ పదం వాడకాన్ని తగ్గించేశారు.. అంత మాత్రాన మన చరిత్రను చెరిపేసుకోలేం కదా?.. గర్వ్ సే కహో హమ్ హిందుస్థానీ హై..
(ఈ అంశంపై నేను ఇదే బ్లాగులో 12/08.2014 నాడు రాసిన పోస్టు చదవండి..  facebookలో రాసిన వ్యాసాన్ని
చదివేందుకు ఈ లింకులోకి వెళ్లండి.. https://www.facebook.com/mkdmitra/posts/712263612187812:0 )

No comments:

Post a Comment