హైదరాబాద్
మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన చారిత్రిక విజయంతో చరిత్రను తిరగ రాసింది
తెలంగాణ రాష్ట్ర సమితి.. భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భాగ్యనగరంలో నగరంలో
ఇలాంటి ఏకపక్ష విజయం సామాన్యమైనది కాదు.. మనలో ఎన్ని రాజకీయ, సైద్దాంతిక విభేదాలు
ఉన్నా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే.. అధికార పార్టీని ఎదుర్కోవడంలో విపక్షాలు
ఘోర వైఫల్యాన్ని మూట గట్టుకున్నాయి.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ విపక్ష నాయకులు,
కార్యకర్తలను నయానో భయానో దారికి తెచ్చుకొన్ని బలహీన పరచి ఉండొచ్చు.. గెలిచిన వారిలో
అత్యధికులు కండువాలు మార్చినవారే కావొచ్చు.. ప్రజల అంతిమ తీర్పే ముఖ్యం కాదా.. అయినా
విజయంతో ‘
బారా ఖూన్ మాఫ్.. ‘ ఇదంతా బంగారు తెలంగాణ
కోసమే అనుకుందాం.. విశ్వ నగరంగా భాగ్యనగరం ఎదగడానికే ఈ విజయం అని గర్వపడదాం..
భాగ్య విధాతకు వందనాలు..
No comments:
Post a Comment