Saturday, April 11, 2015

నేతాజీపై నెహ్రూ ఎందుకు నిఘా పెట్టారు?

నేతాజీ.. అసలు ఈ పేరు పుట్టిందే ఆయన కోసం.. భారతీయుల హృదయాల్లో ఎన్ని తరాలైనా సజీవం ఉంటే మహావ్యక్తి సుభాష్ చంద్రబోస్.. వీరులకు మరణం ఉండదంటారు.. యాదృచ్ఛికంగా నేతాజీ మరణించింది ఎప్పుడో ఎవరికీ తెలియదు. ఇది రహస్యంగానే ఉండిపోయింది. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన మరోరహస్యం సంచలం సృష్టించింది.. అది సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెట్టిన నిఘా.. అసలు బోసు బాబుపై నెహ్రూ ఎందుకు నిఘా పెట్టినట్లు?..
భారత స్వాతంత్రోద్యమం ఉదృతంగా సాగుతున్న కాలమది.. మహాత్మా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సారధ్యం వహిస్తోంది.. అదే సమయంలో దేశ ప్రజల హృదయాలను మరో వ్యక్తి ఆక్రమించాడు.. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్..  1938లో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు వచ్చిపడ్డాయి. గాంధీజీ అధ్యక్ష అభ్యర్థిగా పట్టాభి సీతారామయ్యను ప్రతిపాదించారు. అయితే సుభాష్ చంద్ర బోసు కూడా ఈ పదవికి పోటీ పడ్డారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో బోసుబాబు కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నకయ్యారు. ఈ విషయాన్ని గాంధీ జీర్ణించుకోలేక పోయారు. పట్టాభి ఓటమిని తన ఓటమిగా ప్రకటించుకున్నారు. బోసుకు  ప్రత్యామ్నాయంగా జవహర్ లాల్ నెహ్రూను ఎగదోసి అసమ్మతి రాజకీయాలకు ఊతం ఇచ్చాడు మన మహాత్ముడు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు నేతాజీ..
రెండో ప్రపంచ యుద్దంలోకి భారత దేశాన్ని బలవంతంగా నెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించిన సుభాష్ చంద్రబోసును అరెస్టు చేశారు. కొంత కాలం జైలుతో పెట్టి ఆ తర్వాత గృహ నిర్భందంలో ఉంచారు. ఆ సమయంలో నేతాజీ మదిలో కొత్త ఆలోచనలు వచ్చాయి. 1941లో బ్రిటిష్ ప్రభుత్వ నిఘాను తప్పించుకునేందుకు మారు వేషంలో దేశం విడిచిపోయారు. బ్రిటిష్ వారి బద్ద శత్రువులుగా ఉన్న జర్మనీ, జపాన్ దేశాలను సంప్రదించారు. ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట తొలి స్వతంత్ర భారత సైన్యాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యుద్దం ప్రారంభించారు సుభాష్ చంద్రబోస్. మీ రక్తాన్ని ధారబోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తానుఅనే నేతాజీ పిలుపు భారతీయులందరినీ కదిలించింది.. దీన్నినెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోయారు. బోసుబాబు తిరిగి వస్తే తమ పీఠాలు కదులుతాయని భయపడ్డారు. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా నేతాజీ వ్యవహారంలో ముచ్చెమటలు పట్టాయి.
అలాంటి సమయంలో ఆగస్టు 18, 1945న తైవాన్ నుండి టోక్యో వెళుతున్న విమానం కుప్పకూలిందనే వార్త వచ్చింది. అందులో బోసుబాబు ఉన్నారని చెబుతున్నారు. నేతాజీ మరణించారనే వార్త దుమారాన్ని లేపింది. కానీ ఎవరూ ఈ వార్తను నమ్మలేదు.. ఆయన చితాభస్మాన్ని జపాన్ లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని అంటారు. నెహ్రూ తనకు సన్నిహితుడైన సోవియట్ నియంత స్టాలిన్ తో సంప్రదించి సుభాష్ చంద్రబోసును రష్యాలోని సైబీరియాలో నిర్భందించారనే కథనాలు కూడా ఉన్నాయి..
15 ఆగస్టు, 1947న స్వతంత్ర్య భారత ప్రభుత్వానికి తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు జవహర్ లాల్ నెహ్రూ.. వాస్తవానికి ఆ పదవిలో ఉండాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్.. బోసు బాబు ఇంకా ప్రజల మాటల్లో సజీవంగా ఉండటం నెహ్రూ జీర్ణించుకోలేకపోయారు.. అందు కోసమే ఆయన కుటుంబంపై నిరంతర నిఘా కొనసాగించారు.. 1948 నుండి 1968 వరకూ ఇంటలిజెన్స్ బ్యూరో సాగించిందీ వ్యవహారం.. నెహ్రూ చనిపోయిన తర్వాత కూడా నిఘా కొనసాగడం విశేషం.. బోసు బాబు మరణ రహస్యాన్ని ఛేదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు.. వివిధ వర్గాల నుండి వచ్చిన వత్తిడితో 1956లో షానవాజ్ కమిటీని నియమించినా సరైన వివేదిక ఇవ్వలేక పోయింది. అటల్జీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ సంచలన విషయాన్ని బయట పెట్టింది.. అందరూ అనుకున్నట్లుగా అసలు ఆగస్టు 18, 1945న విమాన ప్రమాదమే జరగలేదు. జపాన్ లోని రెంకోజీ ఆలయంలోని చితాభస్మం కూడా నేతాజీది కాదని స్పష్టమైంది. నివేదిక వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సహజంగానే ఈ నివేదికను తిరస్కరించింది..

ఇంతకీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమైనట్లు.. ఆయన ఎక్కడికీ పోలేదు.. దేశ ప్రజల హృదయాల్లోనే చిరస్థాయిగా ఉన్నారు..


No comments:

Post a Comment