Thursday, April 16, 2015

ఢిల్లీ టూ బ్యాంగ్ కాక్ టూ ఢిల్లీ.. పప్పూ ఘర్ వాపసీ..

బుజ్జోడొచ్చాసాడోచ్ అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.. 'నాన్నా ఎక్కడికెళ్లావ్ కన్నా.. అంటూ అమ్మగారు బెంగెట్టుకున్నారు.. నిన్నెవరూ ఏమీ అనరు పప్పూ.. అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది.. త్వరగా వచ్చేయరా..' అంటూ బుజ్జగించారు.. మసాజులు ఇక చాలులే అనుకున్నాడు.. వచ్చేశాడు..
రాహుల్ గాంధీ.. ఫిబ్రవరి 16న ఢిల్లీ నుండి బిజినెస్ క్లాస్ విమానంలో తెల్లవారు జామున 3.30కి బయలు దేరిన రాహుల్ 9.00కి బ్యాంగ్ కాక్ చేరుకున్నాడు.. మళ్లీ ఏప్రిల్ 16న ఉదయం 7.35కి బ్యాంగ్ కాక్ నుండి 10.35కి ఢిల్లీకి వచ్చేశాడు.. ఈ మధ్య కాలంలో అక్కడేమి చేశారో రాజావారు..
పార్లమెంట్ సమావేశాలు డుమ్మా.. రెండు వారాలు సెలవన్నాడు.. ఏకంగా రెండు నెలల తర్వాత తీరిగ్గా వచ్చాడు.. సెలవు పెట్టడానికి ఇదేమన్నా ఉద్యోగమా? ప్రజా సేవకు సెలవు అనేది ఉంటుందా?.. అధ్యయనం కోసం సెలవుమీద వెళ్లాడని చెప్పుకొచ్చారు కాంగీ పెద్దలు.. దేశంలో ఎక్కడా దిక్కు లేనట్లు అధ్యయనాని థాయ్ లాండే దొరికిందా అబ్బాయి గారికి.. విపస్యన ధ్యాయం కోసం వెళ్లాడని మరి కొందరు అన్నారు.. థాయ్ లాండ్ వారే ధ్యానం కోసం మన దేశానికి వస్తుంటారు. మరి ఈయన అక్కడికి వెళ్లి నేర్చుకొచ్చిందేమిటో..
ఢిల్లీలో దిగుతూనే తానెక్కడికెళ్లాడో, ఏం చేశాడో ఎవరికీ చెప్పొద్దని తన భద్రతా సిబ్బందికి హుకుం జారీ చేశారంట యువరాజా వారు.. అంత రహస్యం ఏమిటో మరి.. రాహుల్ ఎక్కడికి వెళ్లాడని ఆ మధ్య భద్రతా సిబ్బంది ఆరా తీస్తే కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టేశారు.. అజ్ఞాతంలో ఏదైనా జరగకూడనికి జరిగి ఉంటే ఏం చేసేవారు? మోదీ సర్కారు భద్రత కల్పించలేదని వారే కదా చిందులేసేది?..

ఇంతకీ పప్పూ థాయ్ లాండ్ ఎందుకెళ్లాడు?.. నో టాప్ సీక్రెట్.. తెలిస్తే ఇంకేమైనా ఉందా?.. థాయ్ స్పెషాలిటీస్ ఏమిటో అక్కడికి వెళ్లి వచ్చినవారిని  అడగండి చెబుతారు.

No comments:

Post a Comment