Tuesday, May 16, 2017

ధర్నా చౌక్ ఎత్తివేత నిరంకుశత్వమే..

ప్రభుత్వ విధానాలు నచ్చకుంటే నిరసన తెలపడం ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు.. కానీ ప్రదర్శనలు, ర్యాలీలు చేస్తే ప్రభుత్వాలకు నచ్చదు.. లాఠీ ఛార్జీలు, అరెస్టులు తప్పవు.. పోనీ శాంతి యుతంగా ధర్నా చేసి నిరసర తెలియజేస్తామంటే అయిష్టంగానే అంగీకరిస్తాయి..
పాతికేళ్ల క్రితం ప్రతిపక్షాలు, వివిధ సంఘాలవారు రాష్ట్ర సచివాలయం ముందు ఫుట్ పాత్ మీద (ప్రస్తుత లుంబినీపార్క్ పర్యాటక భవన్) ధర్నాలు చేసేవారు.. దీని కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోందనే కారణంతో ప్రభుత్వమే స్వయంగా ప్రస్తుత ఇందిరా పార్కు ముందు నిరసనలు తెలుపుకునేందుకు శాశ్వతంగా చోటు ఇచ్చింది.. దీనికి క్రమంగా ధర్నా చౌక్ అనే పేరొచ్చింది.. దిల్లీలోని జంతర్ మంతర్ తరహాలో..
ప్రభుత్వం ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేసింది.. ఇందుకు శాంతి భద్రతలను సాకుగా చూపుతోంది.. ఎక్కడో శివారు ప్రాంతంలో ధర్నాలు చేసుకోవాలట.. గతంలో సచివాలయం ముందు ధర్నాలు చేస్తే ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం మంత్రులు, అధికారులైనా చూసేవారు.. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నాచౌక్ వారికి కనిపించని విషయం దేవుడెరుగు.. కనీసం అక్కడ ఏ కార్యక్రమం చేసినా ఏదో రూపంలో ప్రభుత్వం దృష్టికి పోతుందనే ఆశ మినుకు మినుకుమనేది.. ఇప్పుడా ఆశ కూడా అడియాయే అయిపోయింది.. ప్రభుత్వం ప్రజల ఆక్రందనలు వినే స్థితిలో లేనప్పుడు ఎక్కడ ధర్నా చేస్తే ఏం లాభం.. చెవిటి వారి ముందు శంఖం ఊదినా ప్రయోజనం ఏమిటి?..

అధికారంలో ఉన్నవారికి భజనలే వినసొంపుగా ఉంటాయి.. నిందిస్తే ఊరుకుంటారా?.. ఈ లాజిక్కు తెలియని అమాయకంలో ఉన్నాయి పాపం ప్రతిపక్షాలు.. రండీ పుణ్యాత్ములారా.. సర్కారు భజనకు..

No comments:

Post a Comment