Tuesday, December 6, 2016

జయలలిత..
ఈ పేరు వినగానే భయమెరుగని ధీర వనిత కళ్ల ముందు మెదులుతుంది.. ప్రత్యర్థులకు ఆమె నియంతగా కనిపిస్తుంది.. కానీ కోట్లాది మంది తమిళులు అమ్మ అని పిలుచుకుంటారు..
మైసూర్ రాష్ట్రంలోని సాధారణ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పుష్పవల్లి ప్రస్థానం సినీ రంగంలో జయలలితగా మొదలై పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ముగిసింది.. ఈ విజయం అంత తేలికగా కొనసాగలేదు..
జయలలిత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురైంది.. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వచ్చినా రాజీ పడలేదు.. తన అభినయంలో చలన చిత్రసీమను ఉర్రూతలూపిన జయ, రాజకీయ సముద్రం ఎనో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.. ఎంజీఆర్ మరణానంతరం అన్నా డీఎంకేలోని ప్రత్యర్థులు ఆమెను బయటకు నెట్టేస్తే, ఏఐఏడీఎంకే పార్టీని స్థాపించి ఆధిక్యతను సాధించడమే కాదు.. వారిని కలిపేసుకున్నారు..
తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి కరుణానిధి ప్రోద్భలంతా డీఎంకే ఎమ్మెల్యేలు జయలలితను చీర లాగి అవమానించారు.. ఆగ్రహించిన జయ రాష్ట్రమంతా తిరిగి ఒక మహిళామూర్తిగా తనకు జరిగిన అవమానాన్ని చాటి చెప్పారు.. అఖండ మెజారిటీతో తన పార్టీని గెలిపించుకుకొని ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే కాదు, కరుణానిధిపై బదులు తీర్చుకున్నారు..
కాలక్రమంలో జయలలిత ఎన్నో అవినీతి ఆరోపణలు, సమస్యలు ఎదుర్కొన్నారు.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. జైలు జీవితాన్ని అనుభవించారు.. ఒక దశలో నమ్మిన వారే ఆమెనే మోసం చేసేందుకు ప్రయత్నించారు.. అయినా ఓర్పు, నేర్పుతో పోరాటం సాగించారు జయ.. కాదన్న ప్రజలనే ఒప్పించి తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు..
ప్రభుత్వంలో మంత్రులతో సహా పార్టీలో సీనియర్ నాయకులు కేడర్ అంతా జయకు లాగిలపడి పాదాభివందనాలు చేయడం చూస్తుంటే ఆమెలో నియంతృత్వ పోకడలు కనిపింస్తాయి.. కానీ జీవితంలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్న నాయకురాలికి అది తగిన సత్కారమేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.. తన వైఖరిపై ఎన్ని విమర్శలు వచ్చినా భయపడలేదు.. జయ పగబడితే ఎంటి వారైనా అంతే సంగతులు అని చాలా సార్లు నిరూపితమైంది..
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత చేపట్టిన తన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడిని సృష్టించారు.. ప్రత్యర్థులకు, విమర్శకులకు అవి జనాకర్శక పథకాలుగా కనిపించవచ్చు.. కానీ అవే ఆమెను ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి.. అమ్మగా చిరస్థాయి గుర్తింపును కల్పించాయి.. లక్షలాది మంది అభిమానులు ఇప్పుడు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు.. తమిళనాడు అమ్మలేని లోటును స్పష్టంగా చూస్తోంది..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆశ్రు నివాళి..

No comments:

Post a Comment