Saturday, November 9, 2013

భారతీయులు, హిందువులంటే ఎందుకు చులకన?..

భారత దేశం, హిందూ మతం అంటే తెల్ల తోలు విదేశీయులకు ఎంత చులకనో ఒక్కసారి చూడండి..
అసోంలో రేప్ ఫెస్టివల్ జరుగుతోందంటూ అమెరికాకు చెందిన National Report అనే వెబ్ సైట్ అవాస్తవ కథనాన్ని ప్రచురించింది.. నాగా సాధువుల ఫోటోను ప్రచురించింది.. ఈ కథనం చదివిన ప్రవాస భారతీయులు నొచ్చుకున్నారు.. తమ నిరసన వ్యక్తం చేశారు.. అసోం ప్రభుత్వం పరువు నష్టం దావా వేసే ఆలోచనతో ఉంది.. కానీ భారత ప్రభుత్వం దీనిపై ఏ మాత్రం స్పందించలేదు..
మరోవైపు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన బ్రూక్ వేల్ యూనియన్ అనే మద్యం కంపెనీ తమ బీరు బాటిల్స్ పైన గణపతి తలతో ఉన్న లక్ష్మీ దేవి బొమ్మను, కామ ధేనువును ముద్రించి అమ్మకానికి పెట్టింది.. ఆస్ట్రేలియాలోని భారతీయులంతా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేస్తున్నారు.. కానీ షరా మామూలే భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు..
సాల్మన్ రష్దీ తన సాటానిక్ వర్సెస్ అనే నవలలో ఏదో రాశారని ముస్లింలు ఆగ్రహిస్తే భారత దేశం స్పందించి ఆ నవలను నిషేధించింది.. బంగ్లా దేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ అనే నవలను ఆ దేశ ప్రభుత్వం నిషేధించింది.. వీరిద్దరి తలలపై కొందరు ఛాందన వాదులు వెల కట్టారు.. హైదరాబాద్ వచ్చిన తస్లీమాపై ఎంఐఎం ఎమ్మెల్యేలు దాడి చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. డానిష్ పత్రికల్ వచ్చిన ఒక కార్టూన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహించారు.. ఈ అంశంతో మన దేశానికి ఎలాంటి సంబంధం లేకున్నా హైదరాబాద్లో హిందువులపై దాడులు జరిగాయి.. ఏసుక్రీస్తు వచ్చిన డావిన్సీ కోడ్ అనే నవల, సినిమాలపై మన దేశ క్రైస్తవులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.. ఒక తెలుగు పత్రికలో ప్రచురితమైన మద్యం సీసాతో ఏసు ఫోటోపై కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి..
కానీ హిందూ మతానికి తరచూ ఏదో ఏ రూపంలో అవమానం జరుగుతున్నా స్వ మతస్తులకే పట్టడం లేదు.. ఇక మన మన సో కాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఏమి స్పందిస్తాయి..

ఈ తరహా ఉదంతాలపై ప్రతి భారతీయుడు; హిందువు దీనిపై స్పందించి తన నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది.. హిందూ మతం సహసానికి ప్రతీక, దీన్ని ఆసరాగా తీసుకొని పదే పదే అవమానిస్తే ఆగ్రహించక తప్పదు..

No comments:

Post a Comment