గోడ
గడియారం ఎప్పుడు చూసినా టిక్కు టిక్కు మంటూ పని చేస్తూనే ఉంది.. చాలా రోజుల నుండి
ఆసక్తిగా గమస్తోంది ఓ బల్లి.. ఇంతకీ ఈ గడియారం విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటుంది?
అనే అనుమానం వచ్చింది.. చివరకు గడియారాన్నే అడిగేసింది..
‘ఓ గడియారమా! నీకు విశ్రాంతి లేదా?’
‘లేకేం.. కచ్చితంగా ఉంది..’
‘ఎప్పుడూ పని చేస్తూనే కనిపిస్తున్నావు.. ఇంతకీ నీవు విశ్రాంతి
తీసుకుంటున్నది ఎప్పుడు?’
‘ఒక్క టిక్ కి మరో టిక్ కి
మధ్యనే నాకు విశ్రాంతి..’
సమయంలేదని తప్పించుకునేవారికి, పని
చేయకుండా విశ్రాంతితో కాలక్షేపం చేసేవారికి గడియారం స్పూర్తి కావాలి.. సమయం కల్పించుకోవడం మన చేతిలోనే ఉంది.. పనిలోనే విశ్రాంతిని
కూడా ఆస్వాదించగలం అని గ్రహించాలి..
No comments:
Post a Comment