Saturday, September 30, 2017

దసరా - విజయదశమి ఎందుకు?

మనమంతా దసరా పండుగ జరపుకునేందుకు సిద్దమయ్యాం.. దీన్నే విజయదశమి అని కూడా అంటున్నాం.. అసలు ఏమిటి ఈ దసరా, విజయదశమిల వెనుక ఉన్న కథ..
శ్రీరాముడు ఈ రోజునే రావణాసురున్ని సంహరించిన రోజు ఇది.. రావణుడు అంటే పది తలల రాక్షసుడు మనకు గుర్తు వస్తాడు..
ఈ పది తలలు దేనికి సంకేతమో మీకు తెలుసా?.. మనలోని దుష్ట గుణాలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య, స్వార్ధ, అన్యాయ, అమానత్వ, అహంకారాలు.. ఈ దశ వికారాలను అంతమొందించడం ద్వారా దశహరా జరుపుకుంటాం.. ఇలా దశహరాయే దసరా అయ్యింది..
రావణ దహనం అంటే కేవలం ఒక రాక్షసుని బొమ్మను కాల్చేయడం కాదు.. దశ దుర్గుణాలను దగ్దం చేయడానికి ప్రతీకగా మనం భావించాలి..
దసరా రోజున రావణ సంహారం మాత్రమే కాదు.. మరో మహత్కార్యం కూడా జరిగింది.. జగజ్జనని దుర్గామాత మహిషాసురున్ని అంతమొందించింది కూడా ఇదే రోజున.. దుష్ట శక్తులపై దైవం సాధించిన విజయానికి సంకేతంగా మనం దసరా, విజయదశమిలను జరుపుకుంటాం..

అందరికీ పర్వదిన శుభాకాంక్షలు.. 

No comments:

Post a Comment