Sunday, October 8, 2017

శ్రీవైకుంఠపుర సందర్శన

శ్రీవైకుంఠపురం.. సంగారెడ్డిలో కొలువైన ఈ దేవస్థానం నిజంగా ఒక అద్భుతమైన.. అక్కడ కొలువైన 14 అడుగుల శ్రీ వేంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం చూడటం మహాద్భాగ్యం.. ఆలయ ప్రాంగణంలోని సర్వమంగళాదేవి, దాసాంజనేయ స్వామి, సుదర్శన నారసింహ స్వామి, అడుగుల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాలు.. అన్నింటికీ మించి గోశాల, కోనేరు చూడ ముచ్చట అనిపించాయి..
WE CAN CHANGE సోషల్ మీడియా మిత్ర బృంద సభ్యులం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేసుకున్నాం.. అక్కడ ప్రధానార్చకులు వరదాచార్యులు మా బృందంతో మాట్లాడిన అరగంట ఏంతో స్పూర్తిని నింపింది.. హైందవ ధర్మ పరిరక్షణ విషయంలో వారికి ఉన్న తన నిజంగా మమ్మల్ని కదిలించింది.. ఆలయ సందర్శన తర్వాత జరిగిన సమావేశంలో ధర్మం, దేశం, సమాజ రక్షణలో జాతీయ వాదులుగా మేం నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నాం..
శ్రీవైకుంఠపురానికి మమ్మల్ని ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది పురం సంతోష్.. ఆలయ జీర్ణోద్ధరణలో ఆయన కుటుంబ పాత్ర చాలా ఉంది.. సంతోష్ కు మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం.. ఆయన సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్థి, WCC సభ్యుడు కావడం మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాం.. సంతోష్ కు ప్రత్యేక ధన్యవాదాలు..

We Can Change మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం..

No comments:

Post a Comment