Wednesday, October 11, 2017

ట్రాఫిక్ రూల్స్ పాటించండిరా నాయనా!

ద్విచ‌క్ర వాహ‌న‌దారులు హెల్మెట్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి.. ప్ర‌మాదం జరిగిన‌ప్పుడు మ‌న శ‌రీరంలో అతి ముఖ్య భాగ‌మైన త‌ల‌కు గాయం కాకుండా కాపాడుతుంది. దుర‌దృష్టం కొద్ది జ‌నం హెల్మెట్ ధ‌రించ‌డాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పైగా త‌మ జుట్టుకు ఇబ్బంది అని, మెడ నొప్పి అని సోది వినిపిస్తారు. మ‌రి కొంద‌రు ముందు రోడ్లు బాగు చేయ‌మ‌ని ప్ర‌భుత్వానికి ఉచిత స‌ల‌హా ఇస్తారు.. ఇంత‌క‌న్నాఘోరం ఏమిటంటే ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై ముగ్గురు న‌లుగురు ప్ర‌మాణం చేయ‌డం..త‌మ‌తో పాటు మిగ‌తావారి ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్ట‌డం దారుణం. అనంత‌పురం జిల్లాలో ఓ వ్య‌క్తి ఏకంగా త‌న‌తో పాటు మ‌రో న‌లుగురు కుటుంబ స‌భ్యుల‌ను బైక్ పై ఎక్కించుకొని బ‌య‌లు దేరాడు. వీరిని చూసి అవాక్కైన‌ ఎస్సై శుభ‌కుమార్ ఆపి చేతుతెత్తి దండం పెట్టాడు.. ఈ ఫోటో న‌వ్వు తెప్పిస్తున్నా పౌరులుగా, వాహ‌న‌దారులుగా నిబంధ‌న‌లు పాటించాల‌నే బాధ్య‌త‌ను గుర్తు చేస్తోంది.

No comments:

Post a Comment