Thursday, March 13, 2014

మోీడీది చేయి గుర్తా?..

ఈ మధ్య ఓ ఊరికి పోతే వ్యవసాయం లేక రోడ్డు పని చేస్తున్న కూలీలు కనిపించారు.. వారితో జరిగిన సంభాషణ ఇది..
  ఏమయ్యా ఎలచ్చన్లొస్తున్నయ్ కదా.. ఎవరికి ఏస్తరు ఓట్లు..
ఎవరొచ్చినా ఏం చేస్తరు సారూ.. ఎవరో మోడీ అంట.. ఆయన పేరు బాగా ఇనిపిస్తుంది.. ఈ సారి గాయనకు ఏసి సూద్దమనుకుంటున్నాం..
ఆయన ఏ పార్టో తెలుసా?..
తెల్వదు సార్.. చెయ్యి గుర్తంట గా.. మా సారు చెప్పిండు..
నరేంద్ర మోడీది చేయి గుర్తు అని చెప్పిన పెద్దాయన ఎవరా అని ఆరా తీస్తే, ఆ ఊర్లోని ఓ కాంగ్రెస్ నాయకుడని తేలింది.. ఈ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు.. హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు దగ్గర్లోని పులిమామిడి..
దేశమంతటా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతోంది.. తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ ఘనంగా మోడీ గురుంచి మాట్లాడుతుంటున్నారు.. కానీ నగరాలు, కొన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలు తప్ప చాలా ప్రాంతాల్లో బీజేపీకి కేడర్ లేదు.. దీంతో ఆ పార్టీ మోడీ క్రేజీని ఓట్లుగా మలచుకోగలుగుతుందా అనే అనుమానాలున్నాయి.. ఇక్కడే ఇతర పార్టీలు జనాలను బోల్తా కొడుతున్నాయి..
నరేంద్ర మోడీ ఏ పార్టీవాడు.. ఆయన పార్టీ గుర్తేదో కూడా తెలియని అమాయకులు ఉన్నారంటే వారిపై జాలి పడలేం.. ఇక్కడ తప్పు బీజేపీ నాయకులు, క్యాడర్ దే..

బీజేపీ బాబులూ.. మీ ప్రెస్ మీట్లు, చాయ్ పే చర్చలు, బహిరంగ సభలు సరే.. అర్జంటుగా గ్రామాలకు వెళ్లండి, జనాలను కలుసుకోండి.. ఇంకా నెలన్నర రోజులే ఉంది ఎన్నికలకు.. ఆ తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు..

No comments:

Post a Comment