Sunday, March 2, 2014

తొలి సీఎం నీలం.. చివరి సీఎం నల్లారి.

1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ (సంయుక్త) మరి కొద్ది రోజుల్లో చరిత్రలో కలుస్తోంది.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీమాంధ్ర (కోస్తాంధ్ర, రాయలసీమ) మాత్రం అంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగనుంది..  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.. 01.11.1956 నుండి 10.01.1973 వరకు పౌర ప్రభుత్వం కొనసాగింది. 10.01.1973 నుండి 10.12.1973 వరకూ రాష్ట్రపతి పాలన విధించారు.. ఈ తర్వాత 10.12.1973 నుండి నిన్నటి దాకా అంటే 01.02.2014 వరకూ పౌర ప్రభుత్వ పాలన కొనసాగింది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది..
రాష్ట్రపతి పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఉండరు.. గవర్నర్ విశేషాధికారాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయంతో పరిపాలన సాగిస్తారు.. బ్యూరోక్రాట్లకే ఎక్కువ అధికారాలు ఉంటాయి..
ఆంధ్రప్రదేశ్ చరిత్రను గమనిస్తే 15 మంది ముఖ్యమంత్రులు పాలించారు.. సంయుక్త ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి కాగా చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనతకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు.. సీమాంధ్ర నుండి 12 మంది ముఖ్యమంత్రులు (కోస్తాంధ్ర నుండి 6, రాయలసీమ నుండి 6) రాగా, తెలంగాణ నుండి 4 గురికి మాత్రమే అవకాశం దక్కింది.. ఇందులో జలగం వెంగళరావు తెలంగాణ వాసి అయినా కోస్తాంధ్ర మూలాలు ఉన్నవారు.. జిల్లాల వారిగా చూస్తే గుంటూరు నుండి నలుగురు సీఎంలు రాగా చిత్తూరుకు రెండు సార్లు అవకాశం దక్కింది.. ఎన్టీరామారావు 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, నీలం సంజీవ రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి రెండు సార్లు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు..

రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన ఘనత చంద్రబాబు నాయుడు (3,378 రోజులు)కు దక్కగా.. కాసు బ్రహ్మానంద రెడ్డి(2,777 రోజులు) రెండో స్థానంలో నిలిచారు.. అతి తక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత నాదెండ్ల భాస్కర రావు (31 రోజులు)కు దక్కింది.. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించింది సీమాంధ్ర నాయకులే.. అందునా రాయలసీమ నాయకులదే అగ్రస్థానం..  ఇంకా కచ్చితంగా లెక్కలు కావాలంటే Google లోకి వెళ్లి Andhra Pradesh Chief Minister సెర్చి కొడితే వీకీవీడియా తేదీలతో సహా వివరాలు చూపిస్తుంది..

No comments:

Post a Comment