Friday, March 7, 2014

మహాత్ముని హత్యతో ఆరెస్సెస్ కు సంబంధం ఉందా?

మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ వ్యక్తులా?.. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ విషయంలో ఆరెస్సెస్ ను నిందిస్తూ ఉంటుంది.. తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మరోసారి తన నోటి దురద తీర్చుకున్నాడు..
గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమైతే నాడు నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ సంస్థపై చర్యలు తీసుకోలేకపోయింది?.. చట్టం ముందు ఎందుకు నిరూపించలేకపోయింది?.. ఆర్ఎస్ఎస్ కు గాంధీ హత్యతో ఎలాంటి సంబంధం లేదని నిరూపితం అయ్యాకే ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తేశారు కదా? మరి ఎందుకు పదే పదే బురద చల్లడం?
నిజానికి గాంధీజీని హత్య చేసిన నాధూరాం గాడ్సే హిందూ మహా సభ సభ్యుడు.. అయితే గతంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్నవాడే.. కానీ అతడు తీసుకున్న నిర్ణయంతో ఈ రెండు సంస్థలకు సంబంధం లేనిదని ఆనాడే నిరూపితం అయ్యింది.. మహాత్మ గాంధీ దేశ విభజనకు కారణం అయ్యాడని, పాకిస్తాన్ కు ధన సాయం చేయాలంటూ భారత ప్రభుత్వంపై వత్తిడి తెచ్చాడని.. దేశ విభజన కారంగా కాందీశీకులుగా తరలి వచ్చిన హిందూ శరణార్థుల దుస్థితి చూసి ఆగ్రహించిన నాధూరాం గాడ్సే ఈ హత్య చేశాడని తేలింది..
ఆర్ఎస్ఎస్ సంస్థను జవహర్లాల్ నెహ్రూ మొదటి నుండి అనుమానంగానే చూశారు.. కానీ చైనా యుద్ద సమయంలో ఆర్ఎస్ఎస్ భారత సైన్యానికి అండగా నిలచి, చేసిన సాయాన్ని చూసి అపోహలు తొలగించుకున్నారు.. ఆ తర్వాత జరిగిన రిపబ్లిక్ డే కవాతులో పాల్గొన్నాలని ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించారు.. ఇందిరా గాంధీకి సైతం ఆర్ఎస్ఎస్ అంటే భయం ఉండేది.. ఎమర్జెన్సీలో నిషేధించింది కూడా.. అలాంటి ఇందిర సైతం రష్యా పర్యటనలో ఈ సంస్థను మెచ్చుకున్నారు..
ఆర్ఎస్ఎస్ రహస్య సంస్థ కాదు.. దాని కార్యకలాపాలు అన్నీ బహిరంగంగానే జరుగుతాయి.. ఆ సంస్థలో దేశ భక్తి, క్రమశిక్షణ, సంస్కారాన్ని బోధిస్తారు.. ఆత్మ రక్షణ కోసం శారీరక శిక్షణ ఇస్తారు.. ఇందులో దాపరికం ఏదీ లేదు.. ఆర్ఎస్ఎస్ శాఖలకు ఎవరైనా రావచ్చు.. చూడవచ్చు. నచ్చితే స్వయం సేవక్ గా కొనసాగవచ్చు.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది స్వయం సేవకులు ఉన్నారు.. ఆర్ఎస్ఎస్ నిజంగానే తీవ్రవాద సంస్థ అయితే పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి..

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కేవలం మైనారిటీల ఓట్ల కోసమే ఆర్ఎస్ఎస్ ను బూచిగా చూపిస్తోంది.. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ చేసిన పని కూడా.. కానీ నిజం నిప్పులాంటిది..  రాహుల్ బాధ్యతారాహిత్య ప్రకటనపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యల కోసం ఆర్ఎస్ఎస్ ఉపక్రమిచింది..


 

No comments:

Post a Comment