Saturday, March 1, 2014

లక్ష్మణ్ జీ సేవలు మరువరానివి..

బంగారు లక్ష్మణ్ గారు ఇక లేరనే వార్త విచారం కలిగించింది.. సమాజ సేవకునిగా, కార్మిక నేతగా, పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి..
 1939 మార్చి 17 జన్మించిన లక్ష్మణ్ గారికి 12వ ఏట ఆర్.ఎస్.ఎస్.తో పరిచయం ఏర్పడింది.. న్యాయవాద విద్య పూర్తి చేసుకొని కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు.. ఆ తర్వాత కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.. జనసంఘ్ లో చురుగ్గా పని చేసిన లక్ష్మణ్ జీ అత్యవసర పరిస్థితి కాలంలో జైలు శిక్ష అనుభవించారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, రాజ్యసభ, లోక్ సభల సభ్యునిగా సేవలందించారు.. వాజ్ పేయి క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.. బంగారు లక్ష్మణ్ జీ బీజేపీ జాతీయ అధ్యక్షనిగా ఎన్నికైన తర్వాత తెహల్కా కుట్రకు బలయ్యారు..

కష్టకాలంలోనూ లక్ష్మణ్ గారు ఎంతో నిగ్రహంతో ఉండేవారు.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సికంద్రాబాద్ యశోదా అస్పత్రితో కన్ను మూశారు.. బంగారు లక్ష్మణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. 

No comments:

Post a Comment