Saturday, March 1, 2014

అయినా బుద్ది చెప్పాల్సిందే..

నీ ముక్కు ఏదిరా అని అడిగితే.. నేరుగా చూపకుండా తల చూట్టూ చేయి తిప్పి ముక్కు చూపించాడట గడసరి పిల్లోడు.. వాడు చిన్న పిల్లోడు కాబట్టి సరదా పడతాం.. కానీ అదే పని కాస్త పెద్దవాడు చేస్తే.. వీడు ఎద్దులా దిగినా, ఇంకా బుద్ది రాలేదు అని తిడతాం.. ఇంత కాలం కేంద్ర ప్రభుత్వం చేసింది ఇదే..
ఆధార్ కార్డు అవసరమే.. వద్దనలేం.. గతంలో సిలిండర్ సబ్సిడీ ధరకే నేరుగా ఇచ్చేవారు.. కానీ సబ్సిడీ బ్యాంకు అకౌంట్ లో వేస్తాం.. అసలు ధర చెల్లించండి అంటూ ముక్కు పిండి వసూలు చేశారు.. ఈ తతంగంలో బ్యాంకు ఖాతా లేని వారు, ఉన్నా సబ్సిడీ పడక మునిగిన వారు ఎందరో మోసపోయారు.. అసలు సబ్సిడీకి, బ్యాంకు అకౌంట్ కు లింకేమీటని ప్రశ్నిస్తే పట్టించుకునే వాడే లేడు.. గ్యాస్ డీలర్ ను గట్టిగా నిలదీస్తే మాకేం తెల్వదు.. ఆ మొయిలీ గాడిని అడగుండ్రి సార్ అని వినమ్రంగా చెప్పేవారు..
ఎన్నికలు ముంచు కొస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం భయపడిపోయింది.. సామాన్యుడు కాంగ్రెస్ కు ఓటేయడని అర్థమైంది.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది.. ఇక సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందట.. ఇటీవలే గ్యాస్ సిలిండర్ల వార్షిక కోటాను 6 నుండి 9కి, ఆ తర్వాత 9 నుండి 12కు చేశారు..

సంతోషం.. కానీ దాసుడి తప్పులకు దండంతో సరి అని భావించి మేము మీకు ఓటేస్తామని భ్రమల్లో ఉంటే సారీ.. చేసిన నిర్వాకానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాల్సిందే.. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సిందే..

No comments:

Post a Comment