Sunday, March 2, 2014

పాపం పెద్దాయన..

ఇది ఎంత నిజమో తెలియదు కానీ.. రాజకీయ, మీడియా వర్గాల్లో కొన్ని సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న ముచ్చట...
గతంలో ఒక రాష్ట్రాన్ని సుధీర్ఘకాలం పాలించిన పెద్దాయన తన అక్రమ సంపాదన అంతా బినామీ పేరిట పెట్టాడట.. ఆ బినామీ ఈ బ్లాక్ మనీతో ఓ విదేశంలోహోటళ్ల వ్యాపారం పెట్టారట.. తీరా ఇక్కడ పెద్దాయన పదవి ఊడే సమయానికి అక్కడ హోటళ్లను లోకల్ మాఫీయాలు ఆక్రమించుకున్నారట..
పాపం పెద్దాయన పరిస్థితి కుడితితో పడ్డ ఎలకలా తయారయ్యిందట.. ఆ హోటళ్లను కబ్జా చేసుకున్న మాఫియాపై కేసులు పెడదామంటే బినామీ పేరిట ఉన్నాయి.. గట్టిగా పోరాడితే నల్లధనం వ్యవహారం దేశంలోని ప్రజలకు తెలిసిపోతుంది.. ఏమీ చేయలేని పరిస్థితాయే..
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అక్కడి మాఫియాలకు వెన్నుదన్ను ఇక్కడి ప్రత్యర్థి యువనేతే అని మరో ప్రచారం.. అంటే పెద్దాయన బినామీ ఆస్తులు యువనేత చేతికి వచ్చాయట..

ఇందులో నిజమెంతో, కల్పన ఎంతో నాకు తెలియదు.. నేను విన్న ముచ్చటే మీతో పంచుకున్నాను.. వారెవరు, ఏమిటి అని మాత్రం అడక్కండి.. నా దగ్గర ఆధారేలే ఉంటే పేర్లు వెళ్లడించేవాన్ని కదా?..

No comments:

Post a Comment