Friday, May 9, 2014

మా మాతి బంగ్లాదేశీ..

భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన సమస్య బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు.. బంగ్లాదేశ్ నుండి చొరబాటుదార్లు పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు.. అత్యధిక జనాభా, భూభాగం తక్కువగా ఉన్న బంగ్లాదేశ్ స్వయంగా తన పౌరులను భారత దేశంలోకి చొరబడేందుకు ప్రోత్సహిస్తుందనడం వాస్తవం.. దీన్ని మానవతా దృక్పథంతో చూడాలని కొందరు సోకాల్డ్ మేధావులు వాదిస్తుంటారు.. కానీ వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి..
బంగ్లాదేశ్ నుండి భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదార్లు ముప్పుగా తయారయ్యారు.. వీరి చొరబాట్లు లక్షల్లోకి చేరిపోయాయి.. ఫలితంగా పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో వారు స్థానికులపై దౌర్జన్యాలు చేస్తున్నారు.. చొరబాట్ల ముసుగులో తీవ్రవాదులు చేరి మన దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు.. సరిహద్దు రాష్ట్రాల భాష, మతం, సంస్కృతిపై ప్రభావాన్ని చూపిస్తున్నారు..
జాతీయ దృక్పథంలేని రాజకీయ పార్టీల నాయకులు ఆయా రాష్ట్రాల్లో తమ ఓటు బ్యాంకు రాజకీయాలతో చొరబాటుదార్లుకు రేషన్ కార్డు, ఓటరు కార్డులను ఇచ్చేస్తున్నారు.. ఈ పాపంలో కాంగ్రెస్, వామపక్షాలతో ప్రధాన పాత్ర.. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల సరిహద్దుల్లోని పలు నియోజకవర్గాల్లో ఈ రోజున బంగ్లా చొరబాటు దారుల ఓట్లు కీలకంగా మారాయి.. గెలుపు ఓటములను వారే ప్రాభావితం చేస్తారు..
పశ్చిమ బెంగాల్ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం బంగ్లా చొరబాటు దార్లను ప్రోత్సహిస్తున్న తీరుపై 1990 దశకంలో మమతా బెనర్జీ గట్టి పోరాటమే చేశారు.. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న ఇంద్రజీత్ గుప్తా (సీపీఎం)ను పార్లమెంటులో బంగ్లా చొరబాట్ల సమస్యపై మమత గట్టిగా నిలదీశారు..
ఇప్పడు సీన్ రివర్స్ అయ్యింది.. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆమెకూ ఓట్లు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమయ్యాయి.. ఈ విషయంలో వామపక్షాలను మించిపోయారు.. తాజా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ చొరబాట్లతో ముంచుకొస్తున్న ముప్పును ప్రస్థావించినప్పుడు మమత ఆయనపై విరుచుకుపడ్డారు.. బంగ్లాదేశీయుల చొరబాట్లను బహిరంగా సమర్ధించే రీతిలో వెనుకేసుకుచ్చారు..

మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మా మాతి మనుస్ అనే నినాదంలో పశ్చిమ బెంగాల్లో వామపక్షాలను ఓడించి అధికారంలోని వచ్చింది.. ఇప్పడు ఆమె స్వరం మారినందున ఈ నినాదాన్ని మా మాతి బంగ్లాదేశీ అని మార్చాలేమో..

No comments:

Post a Comment