Thursday, May 1, 2014

మీడియాకు ఓటు వద్దా?

ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్థంభం అంటారు.. ఓటు విలువ గురుంచి ప్రజలకు చెబుతుంది మీడియా.. కానీ ఎంత మంది జర్నలిస్టులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు?
ఎన్నికల రోజున అందరికన్నా హడావుడిగా ఉండేది పోలింగ్ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది, పోలీసులు.. ఆ తర్వాత మీడియా వారే.. కానీ వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి పోస్టల్ బ్యాలట్ పద్దతిలో ఓటు వేస్తారు.. మీడియా వారి పరిస్థితే రెంటికీ చెడ్డ రేవడి అవుతోంది..
పోలింగ్ రోజున పొద్దటి నుండి రాత్రి వరకూ విధుల్లో ఉండే మీడియా సిబ్బందిలో అత్యధికులు ఓటు హక్కును ఉపయోగించేకోలేని దుస్థితిలో ఉన్నారు.. షిప్ట్ డ్యూటీలో ఉన్నవారు ఏదో సమయంలో ఓటు వేసే వెలుసుబాటు ఉంది.. కానీ ఓటు ఎక్కడో ఉంది.. విధులు మరోచోట నిర్వహించేవారు ఓటు వేయలేకపోతున్నారు.. నిన్నటి రోజున చాలా మంది జర్నలిస్టులు ఇదే విధంగా ఓటు హక్కు కోల్పోయారు..

ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలను అందించే మీడియా కూడా అత్యవసర సర్వీసే.. వారిది ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికన్నా ఎన్నోరెట్లు కష్టపడుతున్నారు.. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలి.. మీడియా సిబ్బందికీ పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఇవ్వాలి.. ఈ విషయంలో జర్నలిస్టు సంఘాలు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందన కనిపించలేదు.. ఏం చేస్తాం ప్రతి ఒక్కడూ మీడియాను వాడుకొని వదిలేసేవాడే..

No comments:

Post a Comment