Friday, May 30, 2014

ఎందుకీ ఆర్టికల్ 370?..

భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్ కు మాత్రమే ఎందుకు?.. ఈ అధికరం ఉండాలని వాదిస్తున్న మేధావులు డొంక తిరుగుడు లేకుండా చెప్పగలరా?..
జమ్మూ కశ్మీర్ భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది.. అలాంటి సమస్యే ఉన్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలు కూడా ఇంచుమించు అదే సమయంలో విలీనం అయ్యాయి.. మరి మిగతా రెండు ప్రాంతాలకు ఎందుకు ఆర్టికల్ 370 ఇవ్వలేదు?
కశ్మీర్లో వేర్పాటు వాదానికి, ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నది ఆర్టికల్ 370 అని ఎంత మందికి తెలుసు?.. భారత దేశంలో ఉండేవారు ఏ ప్రాంతానికైనా వెళ్లి స్వేచ్చగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు.. వివాహం, ఆస్తుల విషయంలో ఎలాంటి నియంత్రణలు లేదు.. కానీ కశ్మీర్ ప్రాంతానికి ఇవేవీ వర్తించవు.. భారత దేశ చట్టాలేవీ నేరుగా అక్కడ అమలు కావు.. ఇంకా చెప్పాలంటే చాలా విచిత్రాలు కనిపిస్తాయి..
ఆర్టికల్ 370ని సమీక్షిస్తామంటే గయ్యిన ఎగిరిపడుతున్నారు అబ్దుల్లాలు, ముఫ్తీలు.. వారికి వంతపాడే కాంగీలు.. వేర్పాటు వాదులు సరే సరి.. మరి కశ్మీర్ సంస్కృతికి నిజమైన వారసులైన పండిట్ల వాదనను ఎందుకు పట్టించుకోరు?.. తరతరాలుగా నివసిస్తున్న ఎందరో హిందూ పండిట్ల మాన ప్రాణాలను హరించి, వారి ఆస్తులను దోచుకొని కశ్మీర్ లోయ నుండి తరిమేశారు వేర్పాటువాదులు.. వారి వాదన వినాల్సిన అవసరం లేదా? కశ్మీరియత్ అంటే ఉగ్రవాదుల వాదనకు అర్థం పాడటమేనా?.. కశ్మీర్ సమస్యపై చర్చ అంటే వేర్పాటువాదులతోనేనా?.. పండిట్లను ఎందుకు అందులో భాగస్వాములును చేయరు?..

ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన విషయాలు ఇవి? ఆర్టికల్ 370ని పూర్తిగా చదవండి.. అందులో ఏముందో అర్థం చేసుకొని చర్చించండి.. వాస్తవం బోధపడుతుంది..

No comments:

Post a Comment