Wednesday, May 7, 2014

బాధ్యతాయుత పార్టీలకే ఓటు..

సీమాంధ్ర మిత్రులకు శుభోదయం..
రాష్ట్ర విభజన ప్రక్రియ తర్వాత కీలకమైన ఎన్నికలు ఇవి.. అవశేష ఆంధ్రప్రదేశ్ గా పిలుస్తున్నా, నిజానికి తెలంగాణ మాదిరిగానే సీమాంధ్ర కూడా కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినట్లే భావించొచ్చు..
ఈ కీలక పరిస్థితుల్లో మీ ఓటు పైనే భవిష్యత్తు ఆధారపడి ఉండి.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీమాంధ్రకు ఎన్నో సమస్యలు ఎదురుకానున్నాయి.. వీటన్నిటినీ అధిగమించే సత్తా ఉన్న పార్టీకి, నాయకునికి పట్టంకట్టాల్సిన అవసరం ఉంది.. తాత్కాలిక ప్రలోభాలకు లొంగితే దోపిడీ దార్ల పాలన వస్తుందని మీ అందరికీ తెలుసు..
సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం, కేంద్రంలో ఏర్పడనున్న ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడం తప్పని సరి.. రెండింటి మధ్య సమన్వయం లేకపోతే నష్టపోయేది ప్రజలే.. ఈ నేపథ్యంలో మనం జాతీయ దృక్ఫధంతో కూడా ఆలోచించాలి.. పార్లమెంటుకు, అసెంబ్లీని ఓటు వేసే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి..
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతను సృష్టించి పబ్బం గడుపుకునే పార్టీల వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.. రెండు ప్రాంతాల మధ్య భవిష్యత్తులో సమన్వయం అవసరం.. ఇరు రాష్ట్రాలను ప్రభావితం చేసు ఉమ్మడి సమస్యలు ఎన్నో ఉన్నాయి..
భాద్యతాయుతమైన ప్రభుత్వాల వల్లే పురోభివృద్ధి సాధ్యమవుతుంది.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తున్నాను..

No comments:

Post a Comment