Friday, May 23, 2014

లోగోను వివాదం చేయకండి..

తెలంగాణ రాజముద్ర ఎలా ఉండాలి అనే విషయంలో మజ్లిస్ పార్టీ కొత్త వివాదానికి తెరలేపింది.. లోగోలో చార్మినార్ ఉండాలట.. ప్రపంచంలోని గొప్ప కట్టడాల్లో చార్మినార్ ఒకటి ఇందులో సందేహం లేదు.. అయితే తెలంగాణ రాజముద్రగా మీరు చిత్రంలో చూస్తున్న లోగో చాలా కాలంగా ప్రాచుర్యంలో ఉంది.. అందులో వెయ్యేళ్ల నాటి కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీక అయిన ఓరుగల్లు శిలాతోరణం కనిపిస్తుంది..
తెలుగు నేలను పాలించిన గొప్ప రాజవంశంలో కాకతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.. అదీ తెలంగాణలోని ఓరుగల్లు (వరంగల్)ను కేంద్రంగా చేసుకొని పాలించారు.. కాకతీయుల పాలన ముగిసిన చాలా కాలం తర్వాత గోల్కొండ (గొల్లకొండ) కేంద్రంగా కుతుబ్ షాహీలు వచ్చారు.. గొల్కొండ పాలకుల్లో ఒకరైన కులీ కుతుబ్ షా (హైదరాబాద్ నిర్మాత) చార్మినార్ ను కట్టించారు..
ఓరుగల్లు తోరణం, చార్మినార్ రెండూ గొప్పవే.. కానీ మొదటి ప్రాచీన చరిత్రకు ప్రతీక.. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రచారంలో ఉన్న రాజముద్రకు ఒకే చెప్పడమే సమంజసం.. ఇందులో మరో కోణాన్ని అన్వేషించాల్సిన అవసరమే లేదు..

No comments:

Post a Comment