Sunday, July 17, 2016

మృత్యోన్మాద విలయ తాండవం

మృత్యువు ఏ రూపంలో అయినా రావచ్చు.. అది ఎక్కడో ఏ దేశంలోనో ఉండొచ్చు.. మన దేశంలో, మన ఊరిలో.. చివరకు మన ఇంటి ముందుకే వచ్చేయొచ్చు..
ఈ మృత్యువుకు దేశాలు లేవు.. ఎల్లలు తెలియవు..
చావు ఎప్పుడో తెలియదు.. చచ్చేది ఎవడో తెలియదు.. అది నువ్వు కావచ్చు.. నేనే కావచ్చు.. మనమిద్దరం అవనూ వచ్చు..
చావు ఏనాటికైనా తప్పదు.. కానీ ఇలాగేనా మనమంతా చచ్చేది?.. ఇలాంటి చావునేనా మనం కోరుకుంటున్నది?..
వికృత మృత్యోన్మాదంతో నవ్వుతుంటే ప్రపంచం అంతా భయపడిపోతోంది.. వణికిపోతున్నది..
ఎప్పుడు ఎవన్ని కాల్చి చంపుతాడో తెలియదు,, ఎందుకు చంపుతున్నాడో తెలియదు.. ఈ విషయంలో వాడికే క్లారిటీ ఉండకపోవచ్చు..  
ఒకనాడు తోటి మనిషి కనిపిస్తే దైర్యంగా ఉండేది,, కానీ ఇప్పడు ఎదుటి వాన్ని చూస్తేనే భయపడిపోతున్నాం.. వాడు మిత్రుడా? శత్రువా? తేల్చుకోలేక వణికిపోతున్నాం.. ఎందుకిలా?
నాగరికత ఎంతో ఎత్తుకు ఎదిగిందని, ముందుకు పోతున్నామని సంబర పడుతున్నాం.. కానీ మళ్లీ వెనక్కి తిరిగి శిలా యుగం వైపు పరుగులు తీస్తూ అనాగరికులుగా మారిపోతున్నాం.. మూఢులుగా తయారవుతున్నాం..
ఏమైపోతోంది ఈ సమాజం?.. ఏమవుతోంది ఈ దేశం.. చివరకు ఈ ప్రపంచమంటూ ఒకటి మిగుతుందా? కనీసం ఈ భూగోళమైనా అస్థిత్వంలో ఉంటుందా?..
ఇదేగా జరుగున్నది.. ఇలా జరగాల్సిందేనా?.. మనం కోరుకుంటున్నది ఇదేనా?
దేవుడా? కనీసం నీవైనా మిగిలావా ఈ విశ్వంలో.. మమ్మల్ని కాపాడకున్నా పర్వాలేదు.. కనీసం నిన్ను నీవైనా రక్షించుకో..

1 comment: